కొడంగల్ లో కేటీఆర్ ప్రచార ర్యాలీలో కాంగ్రెస్ అనుకూల నినాదాలు చేయలేదు

ద్వారా: ప్రవీణ్ కుమార్ హెచ్
నవంబర్ 21 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
కొడంగల్ లో కేటీఆర్ ప్రచార ర్యాలీలో కాంగ్రెస్ అనుకూల నినాదాలు చేయలేదు

సామాజిక మాధ్యమాలలో పోస్ట్స్ స్క్రీన్ షాట్స్ (సౌజన్యం: ఫేస్బుక్/ఎక్స్/స్క్రీన్ షాట్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

సంబంధం లేని కాంగ్రెస్ అనుకూల నినాదాల ఆడియో క్లిప్ ని కొడంగల్ ప్రచార ర్యాలీ వీడియోకి జోడించారు.

క్లైమ్ ఐడి cfa3e9fc

క్లైమ్ ఏమిటి?

నవంబర్ 30 నాడు తెలంగాణ శాసనసభకి ఎన్నికలు జరగనున్నాయి. ఆ నేపధ్యంలో సామాజిక మాధ్యమాలలో 29 సెకన్ల వీడియో క్లిప్ ఒకటి సర్కులేట్ అవుతున్నది. అందులో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కే. తారక రామారావు బీఆర్ఎస్ ర్యాలీలో మాట్లాడుతున్నారు. తను మాట్లాడుతున్నప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, అలాగే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న నినాదాలు కూడా మనకి ఇందులో వినిపిస్తాయి. ఈ క్లిప్ షేర్ చేసి తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి చాలా బాగుంది అని రాసుకొచ్చారు. 

తెలంగాణ కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ తమ ఫేస్బుక్, ఎక్స్ (పూర్వపు ట్విట్టర్) అకౌంట్లలో ఈ వీడియోని షేర్ చేశాయి. ఇతర ప్లాట్ఫామ్ లలో కూడా ఈ వీడియోకి వేలల్లో వ్యూస్ ఉన్నాయి. అటువంటి పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవచ్చు.  

వీడియో క్లిప్ ని, క్లైమ్ ని సామాజిక మాధ్యమాలలో తెలుగులో షేర్ చేశారు (సౌజన్యం: ఫేస్బుక్/ స్క్రీన్ షాట్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఇదే వీడియోని ఎక్స్ లో కూడా షేర్ చేశారు (సౌజన్యం: ఎక్స్/స్క్రీన్ షాట్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే కాంగ్రెస్ అనుకూల నినాదాలని కేటీఆర్ వీడియోకి డిజిటల్ గా జోడించారు.   

మేము ఏమి తెలుసుకున్నాము?

ఈ వైరల్ క్లిప్ స్క్రీన్ షాట్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతికితే స్థానిక వార్తా చానళ్ళు ఇటువంటి అనేక క్లిప్స్ ని నవంబర్ 9, 10 నాడు తమ యూట్యూబ్ చానళ్లలో అప్లోడ్ చేశాయని తెలుసుకున్నాము. నవంబర్ 9 నాడు బీఆర్ఎస్ కొడంగల్ లో రోడ్ షో నిర్వహించిందని తెలుసుకున్నాము. మొత్తం 7 గంటల వీడియోని టీ న్యూస్ తెలుగు లైవ్ స్ట్రీమ్ చేసింది. ఈ లైవ్ స్ట్రీమ్ లో ఈ వైరల్ క్లిప్  2:13:12 టైమ్ స్టాంప్ దగ్గర మొదలవుతుంది. 

టీ న్యూస్ తెలుగు లైవ్ స్ట్రీమ్ చేసిన నవంబర్ 9 నాటి కొడంగల్ బీఆర్ఎస్ రోడ్ షో

ఇదే క్లిప్ ని ఏబీపి దేశం వారి నవంబర్ 9 నాటి లైవ్ స్ట్రీమ్ లో కూడా చూడవచ్చు. ఇందులో ఈ క్లిప్ 2:00:25 దగ్గర మొదలవుతుంది. ఈ రోడ్ షో సంక్లిప్త భాగాన్ని టీ న్యూస్ తెలుగు నవంబర్ 9 నాడు తమ యూట్యూబ్ చానల్ లో అప్లోడ్ చేసింది. అందులో కూడా ఈ వైరల్ క్లిప్ ఉంది.

వైరల్ వీడియోలో కేటీఆర్ కేసీఆర్ మళ్ళీ గెలిచి మూడోసారి ముఖ్యమంత్రి అవుతారు అని అనగానే కాంగ్రెస్ అనుకూల నినాదాలు మనకి వినిపిస్తాయి. ఆ తరువాత ఫ్రేమ్ లో కేటీఆర్ తమ ఎడమవైపు ఉన్న ఒక వ్యక్తిని చూపించి సరదాగా, “ఈయన మనోడా లేక కాంగ్రెస్ వ్యక్తా?” అని అడగటం మనం వినవచ్చు. కాంగ్రెస్ అనుకూల నినాదాలు తప్పించి వైరల్ వీడియోలోని భాగం, ఒరిజినల్ వీడియోలోని భాగం ఒక్కటే. దీనిబట్టి కాంగ్రెస్ అనుకూల నినాదాలు జొప్పించారు అని అర్థమవుతుంది. ఈ నినాదాల ఒరిజినల్ సోర్స్ మాకు దొరకలేదు.

తెలంగాణ శాసనసభ ఎన్నికలు

2014 నుండి రెండు పర్యాయాలు కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా చేశారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఒక కథనం ప్రకారం బీఆర్ఎస్ ప్రచారం తమ పనితీరు గురించి చెప్పటం నుండి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏమవుతుందో అని తాము అనుకుంటున్నామో అని చెప్పటం వైపుకి మళ్ళింది. రాష్ట్రంలో కాంగ్రెస్ బాగా పుంజుకుంటున్నది అనే ఊహాగానాలకి ఇది దారి తీసింది.

తీర్పు

కొడంగల్ బీఆర్ఎస్ ర్యాలీలో ఎటువంటి కాంగ్రెస్ అనుకూల నినాదాలు చేయలేదు అని లైవ్ స్ట్రీమ్ వీడియోలో ద్వారా తెలుస్తుంది. ఆ నినాదాలు ఉన్న వీడియో ఎడిటెడ్ వీడియో. దీనిని ముఖ్యంగా కాంగ్రెస్ మద్ధతుదారులు షేర్ చేస్తున్నారు. కాబట్టి ఈ క్లైమ్ అబద్ధం అని మేము నిర్ధారించాము. 

(అనువాదం- గుత్తా రోహిత్)

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , తెలుగు

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.