తెలంగాణలో ‘ఐస్ క్రీంలో వీర్యం కలిపిన వ్యక్తి’ వీడియోకి మతం రంగు పులిమి షేర్ చేస్తున్నారు

ద్వారా: రోహిత్ గుత్తా
మార్చి 26 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
తెలంగాణలో ‘ఐస్ క్రీంలో వీర్యం కలిపిన వ్యక్తి’ వీడియోకి మతం రంగు పులిమి షేర్ చేస్తున్నారు

సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న పోస్ట్స్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/లాజికల్లీ ఫాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

వీడియోలో ఉన్న వ్యక్తి రాజస్థాన్ కి చెందిన కాలూ రామ్ పుర్బియా, నెక్కొండ పోలీసులు ఆ వ్యక్తి ముస్లిం కాదని తెలియజేశారు.

క్లైమ్ ఐడి f2fcf43b

గమనిక :  ఈ కథనం లో అశ్లీల దృశ్యం గురించిన వివరణ ఉంటుంది, పాఠకులు గమనించగలరు

క్లెయిమ్ ఏమిటి?


సామాజిక మాధ్యమాలలో ఒక 22 సెకన్ల నిడివి గల వీడియో ప్రచారం అవుతుంది. దీనిలో రోడ్డు పక్కన ఐస్ క్రీం అమ్ముకునే వ్యక్తి తాను అమ్మే ఐస్ క్రీం లో హస్త ప్రయోగం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది, ఇతను ముస్లిం మతానికి చెందిన వ్యక్తిగా క్లైమ్ చేస్తున్నారు. ఎక్స్ (పూర్వపు ట్విట్టర్) లో ఒక వ్యక్తి, ఈ వీడియోని షేర్ చేస్తూ, దక్షిణ భారత రాష్ట్రమైన తెలంగాణలో ఒక జిహాదీ టెర్రరిస్ట్ హస్తప్రయోగం చేసి తన వీర్యాన్ని ఐస్ క్రీంలో కలుపుతున్నారు అని రాశారు.

దీనితో పాటుగా ఒక వ్యక్తి ని పోలీసులు అరెస్ట్ చేస్తున్నట్టుగా ఇంకో ఫొటో జత చేసారు. ఆర్కైవ్ చేసిన పోస్టులను ఇక్కడ, ఇక్కడ మరియి ఇక్కడ చూడవచ్చు. 



సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న పోస్ట్స్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/లాజికల్లీ ఫాక్ట్స్ ఎడిటింగ్)


అయితే, ఈ వీడియోలోని వ్యక్తి ముస్లిం కాదు.

మేము ఏమి కనుగొన్నాము?

టైమ్స్ అఫ్ ఇండియా, ఇండియా టుడే, మరియు న్యూస్ 18 లాంటి వార్తా సంస్థలు, తెలంగాణ లోని వరంగల్ జిల్లాలోని నెక్కొండలో జరిగిన ఈ సంఘటనను గురించి ప్రచురించాయి. అన్ని కథనాలలోను ఈ వ్యక్తిని ‘కాలు రామ్ పుర్బియా’ గా గుర్తించారు.

ఇతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారని పోలీసులు తెలిపారని ఈ కథనాలలో పేర్కొన్నారు. 

లాజికల్లీ ఫ్యాక్ట్స్ కు ఈ కేసుకు సంబంధించి నెక్కొండ పొలిసు స్టేషన్లో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీ లభించింది. ఎఫ్ఐఆర్ ప్రకారం, మార్చ్ 17, 2024 నాడు నెక్కొండ లోని అంబెడ్కర్ సెంటర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది, దీనికి సంబందించిన పొలిసు ఫిర్యాదు మార్చ్ 19 నాడు నమోదు అయ్యింది. 

ఎఫ్ఐఆర్ ప్రకారం, నిందితుడు హస్తప్రయోగం చేయటం మార్చ్ 17 నాడు వీడియోలో రికార్డు అయ్యింది, ఈ వీడియో వాట్స్ అప్ లాంటి మాధ్యమాలలో కుడా వైరల్ అయ్యింది. పోలీసులు నిందితుడిని కాలూ రామ్ పుర్బియా గా గుర్తించారు, ఇతను రాజస్థాన్ లోని భిల్వారా గ్రామానికి చెందిన వ్యక్తిగా నిర్ధారించారు.  పొలిసు అధికారులు ఇతని మీద భారతీయ శిక్షా  స్మృతిలో సెక్షన్ 294 కింద కేసు నమోదు చేశారు. బహిరంగ ప్రదేశాలలో అశ్లీల చేష్టలకి సంబంధించిన సెక్షన్ ఇది. 


నెక్కొండ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: tspolice.gov.in)

లాజికల్లీ ఫ్యాక్ట్స్ నెక్కొండ పోలీసులను మరింత సమాచారం కోసం సంప్రదించింది. నెక్కొండ పొలిసు సబ్ ఇన్స్పెక్టర్ ఎం మహేంద్ర మాతో మాట్లాడుతూ, నిందితుడు కాలూ రామ్ ముస్లిం వ్యక్తి కాదని అతడు హిందువులలో యాదవుల కులానికి చెందిన వాడని తెలియజేశారు. అతను హస్త ప్రయోగం చేశాడని అనుమానం ఉన్న ఐస్ క్రీం బాటిల్ ని పరీక్షలు జరపడానికి పంపారని, మిగిలిన బాటిల్లని పారవేశారని తెలియజేశారు. 

తీర్పు :

తెలంగాణలో ఒక వ్యక్తి ఐస్ క్రీం బాటిల్లో లో హస్త ప్రయోగం చేస్తునట్టుగా ఉన్న ఒక వీడియోని షేర్ చేసి ఇందులో ఉన్న వ్యక్తి ఒక ముస్లిం అని క్లైమ్ చేశారు. కానీ అతడు ముస్లిం కాదు, రాజస్థాన్ కి చెందిన ఒక హిందూ వ్యక్తి. కనుక మేము దీనిని అబద్ధం అని నిర్ధారించాము. 

(అనువాదం: రాజేశ్వరి పరస)

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , తెలుగు

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.