సంభందం లేని హర్యానా వీడియో చూపించి, అయోధ్యలో ఒక దళిత బాలుడి ని కొడుతున్నట్టుగా ప్రచారం చేసారు

ద్వారా: రాజేశ్వరి పరస
జనవరి 5 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
సంభందం లేని హర్యానా వీడియో చూపించి, అయోధ్యలో ఒక దళిత బాలుడి ని కొడుతున్నట్టుగా ప్రచారం చేసారు

క్లెయిమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

లాజికల్లీ ఫ్యాక్ట్స్ బాధితుడి తల్లితండ్రులతో మరియు పొలిసు వారితో మాట్లాడి ఈ ఘటన అయోధ్యలో కాదు హర్యానాలో జరిగింది అని నిర్ధారించింది.

క్లైమ్ ఐడి 1703cd08

క్లెయిమ్ ఏమిటి? 

నూతనంగా కట్టబడిన అయోధ్యలోని రామ మందిరం, జనవరిలో 22వ తారీఖున ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది, ఈ తరుణంలో ఎంతో మంది అథితులు వస్తారని కుడా అంచనా.  ఇలాంటి సమయంలో, ఒక బాలుడిని కొడుతున్న వీడియో ఒకటి, ఇతను దళితుడిని అయోధ్యలో రామ మందిర సంబరాలలో పూలు జల్లిన కారణంగా కొట్టారు అనే వ్యాఖ్యలతో సామాజిక మాధ్యమాలలో ప్రచారం అవుతుంది.

వీడియోలో నారింజ రంగు దుస్తులు ధరించిన కొంతమంది వ్యక్తులు వాయిద్యాలు వాయిస్తూ కనిపించగా మరి కొందరు మహిళా నృత్యకారులు అటు పక్కాగా నడవటం చూడవచ్చు. అంతలోనే ఒక గొడవ మొదలవుతుంది, అందులో మనం ఇద్దరు వ్యక్తులు ఒక ఎరుపు రంగు స్వేటర్ వేసుకున్న బాలుడిని కింద పడిన కుడా కొట్టడం మనం చూడవచ్చు. ఇంతలో మనకి ఒక మహిళా ఆ వీడియోలో ‘అతనిని ఎందుకు కొడుతున్నారు’ అని అడగటం కుడా వినవచ్చు. 

ఎక్స్ (పూర్వపు ట్విట్టర్) ఈ వీడియోని షేర్ చేస్తూ, విష్ణు అనే దళిత బాలుడిని అయోధ్య రామ మందిర సంబరాలలో పూలు జల్లినందుకు కొడుతున్నారు అనే వ్యాఖ్యలతో ప్రచారం చేసారు. ఈ పోస్ట్ కు మేము ఈ కథనం రాసే సమయానికి 29,600కు మంది పైగా చూసారు. ఆర్కైవ్ చేసిన పోస్ట్లు ఇక్కడ చూడవచ్చు. ఇలాంటి వ్యాఖ్యలతోనే ఉన్న ఇతర ఫేస్బుక్ పోస్ట్లు ఇక్కడ చూడవచ్చు.


హిందీ లో ఉన్న క్లెయిమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్స్ ఎడిటింగ్)

కానీ ఈ వీడియో హర్యానాకి సంబంధించింది, దీనిని తప్పుగా అయోధ్య లోని రామ మందిరానికి జత చేస్తున్నారు. 

వాస్తవం ఏమిటి?

వీడియోలో కీ ఫ్రేమ్స్ ని రెవెర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా వెతికితే మాకు డిసెంబర్ 24, 2023 నాడు ప్రచురించబడిన ఈటీవీ భారత్ హర్యానా కథనం లభించింది. ఈ కథనం ప్రకారం, హర్యానాలోని ఫరీదాబాద్ లో రెండు రోజల గీతా జయంతి వేడుకలు నిర్వహించారు, ఇందులో అనేక పాఠశాలలోని విద్యార్థులు హాజరు కాగా ఆ వేడుకలో ఒక బాలుడిని ఇద్దరు వ్యక్తులు కొట్టిన వీడియో కూడా వైరల్ అయ్యింది అని ఉంది. ఆ కొట్టిన వారు బాలుడి ఉపాధ్యాయులు అని కూడా కథనం ద్వారా తెలుస్తుంది, ఇందులో వైరల్ అవుతున్న వీడియో మాదిరి చిత్రాలే మనం చూడవచ్చు.

హిందుస్థాన్ టైమ్స్ రాసిన మరో కథనం కుడా మాకు లభించింది. దీని ప్రకారం, ఇద్దరు ఫరీదాబాద్ టీచర్లు మీద ఒక 15 ఏండ్ల బాలుడిని కొట్టినందుకుగాను కేసు నమోదు చేయబడింది అని పేర్కొన్నారు. కేసు నమోదు చేసింది బాలుడి తండ్రి. ఉపాధ్యాయులు ఇద్దరినీ, సెక్షన్ 74 మరియు 75 బాలల చట్టం కింద  కింద కేసు నమోదు చేసారు, మరియు భారత శిక్ష స్మృతి ప్రకారం 506 మరియు 323 న కుడా నమోదు చేసారు.

లాజికల్లీ ఫ్యాక్స్ తో మాట్లాడుతూ, ఫరీదాబాద్ సెంట్రల్ పొలిసు స్టేషన్ ఇన్స్పెక్టర్, రన్బీర్ సింగ్ ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో ఫరీదాబాద్ లోని గీత మహోత్సవం కార్యక్రమం లోనిదే అనే తెలిపారు. బాధితుడు దళిత జాతికి చెందిన వాడు కాదని కుడా నిర్ధారించారు.

మేము బాధితుడి తల్లి తండ్రులను కుడా సంప్రదించాము, వారు మాకు ఈ ఘటన ఫరీదాబాద్ లోని సెక్టార్ 12 లో జరిగింది అని తెలిపారు. కుటుంబం పేర్కొన్న దాని ప్రకారం, ఆ కార్యక్రమం లో వారి బాలుడిని ఇద్దరు ఉపాధ్యాయలు కొట్టగా, ఆ బాలుడు ఇంకా ఆ మానసిక వేదనను నుంచి కోలుకేలేదని పేర్కొన్నారు. 

అయోధ్యలో ఉండే ఏ బి పి లైవ్ పాత్రికేయుడు, రిషి గుప్తాని కుడా మేము సంప్రదించాము, అతడు మాకు అయోధ్యలో ఇలాంటి ఘటనలు ఏమి జరగలేదు అని నిర్ధారించారు. మాతో మాట్లాడుతూ, “అయోధ్యలో సంబరాలు జరిగినపుడు ఉన్న చుట్టుపక్కల సన్నివేశం వైరల్ వీడియో లో ఉన్న విధంగా లేదు,” అని అన్నారు. అయోధ్య పోలీసులు కుడా వారి ఎక్స్ అకౌంట్ లో వివరిస్తూ, ఇలాంటి సంఘటన ఏమి అయోధ్యలో జరగలేదు అని పేర్కొని, అది అబద్ధం అని తెలిపారు.

తీర్పు:

హర్యానాలోని ఫరీదాబాద్ లో ఇద్దరు ఉపాధ్యాయులు ఒక బాలుడిని కొడుతున్న వీడియోని అయోధ్యలో ఒక దళిత బాలుడిని కొడుతున్నాడు అనే తప్పుడు వ్యాఖ్యలతో షేర్ చేసారు. కనుక మేము దీనిని అబద్ధం అని పేర్కొన్నాము.

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , हिंदी , తెలుగు , ಕನ್ನಡ

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.