బీజేపీకి ఓటు వేయనందుకు ఉత్తర్ ప్రదేశ్ లో ఓటర్ ను కొడుతున్న వీడియో కాదిది

ద్వారా: అనెట్ ప్రీతి ఫుర్తాధో
మే 16 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
బీజేపీకి ఓటు వేయనందుకు ఉత్తర్ ప్రదేశ్ లో ఓటర్ ను కొడుతున్న వీడియో కాదిది

ఉత్తర్ ప్రదేశ్ లోని కన్నోజ్ లో బీజేపీకి ఓటు వేయలేదని ఒక ఓటరును కొడుతున్న వీడియో అంటూ క్లైమ్ చేసిన సామాజిక మాధ్యమ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఇన్స్టాగ్రామ్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

ఇది ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన వీడియో. మే 13 నాడు జరిగిన ఎన్నికలలో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ శాసనసభ్యుడు ఒక ఓటర్ ను కొడుతున్న వీడియో ఇది.

క్లైమ్ ఐడి d8361861

క్లైమ్ ఏంటి?

ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలలో, యూట్యూబ్, ఇన్స్టా గ్రామ్ లాంటి సామాజిక మాధ్యమాలలో ఒక వీడియో వైరల్ అయ్యింది. భారతీయ జనతా పార్టీకి ఓటు వేయనందుకు కన్నోజ్ లో ఒక ఓటర్ ను కొడుతున్నారు అనేది క్లైమ్.

ఈ 9 సెకన్ల వైరల్ క్లిప్ లో, తెల్ల చొక్కా వేసుకున్న ఒక వ్యక్తి, నారింజ రంగు టి-షర్ట్ వేసుకున్న ఒక వ్యక్తిని కొట్టగా, ఆ వ్యక్తి తిరిగి కొట్టడం మనం చూడవచ్చు. ఈ గొడవలో మరి కొంత మంది తోడవ్వగా, కొంత మంది సర్దిచెప్పే ప్రయత్నం చేయడం కూడా మనం చూడవచ్చు. ఉత్తర ప్రదేశ్ లోని కన్నోజ్ నియోజకవర్గంలో మే 13 నాడు నాలుగో దఫాలో ఎన్నికలు జరిగాయి. 

ఈ వీడియోని యూట్యూబ్ లో షేర్ చేసి, “బీజేపీని తొలగించండి. రాజ్యాంగాన్ని కాపాడండి. బీజీపీకి ఓటు వేయకపోతే ఇలా కొడుతున్నారు,” అని హిందీలో శీర్షిక పెట్టారు. ఈ పోస్ట్ ఆర్కైవ్ ఇక్కడ చూడవచ్చు. 

యూట్యూబ్ వీడియో స్క్రీన్ షాట్ (సౌజన్యం: యూట్యూబ్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఇన్స్టాగ్రామ్ లో ఈ వీడియో మీద “బీజేపీకి ఓటు వేయని కారణంగా ఇలా మూల్యం చెల్లిస్తున్న ప్రజలు” అనే టెక్స్ట్ హిందీలో పెట్టారు. వీడియో కింద ఇది కన్నోజ్ లోక్ సభ పరిధిలో జరిగింది అని ఉంది.

ఇటువంటి పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. 

ఇన్స్టాగ్రామ్ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఇన్స్టాగ్రామ్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే ఇది ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన వీడియో కాదు. ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరులో మే 13 నాడు జరిగిన ఘటన వీడియో. 

మేము ఏమి తెలుసుకున్నాము?

ఈ వీడియోలో ఉన్న వ్యక్తుల వెనుక ఉన్న బోర్డ్ మీద తెలుగు ఉంది. హిందీ ఎక్కువుగా మాట్లాడే ఉత్తర్ ప్రదేశ్ లో ఇలా తెలుగులో బోర్డ్ ఉండటం అసాధారణం. 

ఈ వీడియోలోని కీ ఫ్రేమ్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతికితే ఇండియా టుడేలో మే 13, 2024 నాడు వచ్చిన ఒక వార్తా కథనం మాకు లభించింది. “వైరల్: ఆంధ్ర పోలింగ్ బూత్ లో ఓటర్ ను కొట్టిన శాసనసభ్యుడు, తిరిగి కొట్టిన ఓటర్” అనేది ఈ కథనం శీర్షిక. ఈ కథనం ప్రకారం, ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో మే 13 నాడు జరిగిన ఎన్నికల సందర్భంగా చోటు చేసుకుంది. 

ఇండియా టుడే కథనం స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఇండియా టుడే)

వై ఎస్ ఆర్ కాంగ్రెస్ తెనాలి శాసనసభ్యుడు శివ కుమార్ క్యూ జంప్ చేస్తుండగా, ఒక ఓటర్ ప్రశ్నించారు అని, దానితో శివ కుమార్ ఆ ఓటర్ ను కొట్టారని, ఆ ఓటర్ కూడా తిరిగి శివ కుమార్ ను కొట్టారని ఈ కథనంలో ఉంది. అలాగే ఆ తరువాత శివ కుమార్ అనుచరులు కూడా ఈ ఓటర్ మీద దాడి చేయగా, కొంతమంది సర్దిచెప్పే ప్రయత్నం చేశారని ఇందులో ఉంది.

సి ఎన్ బి సి - టీవీ 18 (ఆర్కైవ్ ఇక్కడ) కూడా ఇదే విషయాన్ని పేర్కొంది. 

సి ఎన్ బి సి - టీవీ 18 అధికారిక యూట్యూబ్ అకౌంట్ లో పోస్ట్ చేసిన వీడియో స్క్రీన్ షాట్ (సౌజన్యం: సి ఎన్ బి సి - టీవీ 18/యూట్యూబ్)

శివ కుమార్ చేతిలో దాడికి గురయ్యిన వ్యక్తి గొట్టుముక్కల సుధాకర్ అని ఎన్ డి టి వి కథనంలో ఉంది. శాసనసభ్యుడు, తన కుటుంబ సభ్యులు పోలింగ్ బూత్ కి వచ్చినప్పుడు, తను ఇతరులు లైన్ లో ఉన్నామని సుధాకర్ మీడియాకి తెలిపారు.

“అందరూ క్యూలో నిలబడి ఓటు వేయాలి. ఎవ్వరికీ విశేషాధికారాలు లేవు. కాబట్టి నేను తన అనుచరులను లైన్ లో నిలబడమని అడిగాను. శివ కుమార్ ఓటు వేసి బయటకి వచ్చాక వాళ్ళు తనకి ఈ విషయం చెప్పినట్టున్నారు. దాంతో తను నా దగ్గరికి వచ్చి, ‘నువ్వెవడు ఆడగటానికి? ఎంత ధైర్యం నీకు?’ అని అంటూ నా మీద దాడి చేశాడు,” అని సుధాకర్ తెలిపారు. 

ఈ ఘటన మీద ఎన్నికల సంఘం పూర్తి స్థాయి విచారణకి ఆదేశించింది అని ది హిందూ పత్రిక మే 13 నాడు తెలిపింది. పోలింగ్ స్టేషన్ లో లైవ్ వెబ్ కాస్టింగ్ ఫుటేజీ ఉంది కాబట్టి, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా పూర్తి స్థాయి విచారణకి ఆదేశించారు అని ఈ కథనంలో ఉంది.

శివ కుమార్, తన అనుచరుల మీద కేసు నమోదు చేయమని గుంటూరు జిల్లా ఎస్పీ ను ఆదేశించారు అని ఈ కథనంలో ఉంది.

తీర్పు

మే 13 నాడు ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల సందర్భంలో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక శాసనసభ్యుడు ఒక ఓటర్ మీద దాడి చేసిన ఘటనకి సంబంధించిన వీడియోని కన్నోజ్ లో బీజేపీకి ఓటు వేయనందుకు దాడి చేసిన వీడియోగా షేర్ చేశారు. కాబట్టి ఈ క్లైమ్ అబద్ధం అని మేము నిర్ధారించాము. 

(అనువాదం- గుత్తా రోహిత్)

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , తెలుగు

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.