బీహార్ కి చెందిన వీడియోని ‘ఆంధ్ర ప్రదేశ్ లో ‘మాదకద్రవ్యాలు సేవిస్తున్న మైనర్లు’ అని షేర్ చేశారు

ద్వారా: రోహిత్ గుత్తా
జనవరి 19 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
బీహార్ కి చెందిన వీడియోని ‘ఆంధ్ర ప్రదేశ్ లో ‘మాదకద్రవ్యాలు సేవిస్తున్న మైనర్లు’ అని షేర్ చేశారు

ఆంధ్ర ప్రదేశ్ లో మైనర్లు మాదకద్రవ్యాలు సేవిస్తున్న వీడియో ఇది అంటూ క్లైమ్ చేసిన పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

ఆన్లైన్ లో సర్కులేట్ అవుతున్న మరింత నిడివి ఉన్న మరొక వీడియో నుండి క్లిప్ చేసిన వీడియో ఇది. ఈ వీడియో బీహార్ లోని పట్నాకి చెందినదిగా మేము గుర్తించాము.

క్లైమ్ ఐడి 88613e21

క్లైమ్ ఏంటి?

నలుగురు మైనర్ బాలులు ఉన్న ఒక వీడియోని ఎక్స్ (పూర్వపు ట్విట్టర్) లో షేర్ చేసి, ఆంధ్ర ప్రదేశ్ లో మాదకద్రవ్యాలు సేవిస్తున్న మైనర్ల వీడియో అని క్లైమ్ చేశారు. ఈ వీడియోలో బాలురు ప్లాస్టిక్ కవర్ నుండి ఏదో పీలుస్తున్నట్టు మనం చూడవచ్చు. బ్యాక్ గ్రౌండ్లో ఒకరు, “మన ఇంట్లో ఉన్న పిల్లలని ఏకంగా గంజాయికి బానిసలను చేశారు. నేనది కళ్ళారా చంద్రగిరి నియోజకవర్గంలో చూశాను. ఒక తల్లి ఆమె కూతురుని తీసుకువచ్చి, ‘చూడండన్న, వైకాపా నాయకులు మా పదవ తరగతి పాపని గంజాయికి బానిసలు చేశారు. నన్ను ఆదుకోండి, మా కుటుంబాన్ని ఆదుకోండి,’ అని చెప్పారు. అందుకే యువకులలో చైతన్యం తీసుకొచ్చేదానికి, అవగాహన తీసుకొచ్చేదానికి ‘గంజా వద్దు, బ్రో’ అన్న ఒక ప్రచారం ఈ రోజున మేము చేపడుతున్నాము,” అని మాట్లాడటం మనం వినవచ్చు. ఈ పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ  మరియు ఇక్కడ  చూడవచ్చు. 

వైరల్ సామాజిక మాధ్యమ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం; ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే ఇది ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన వీడియో కాదు.

మేము ఏమి తెలుసుకున్నాము?

వైరల్ వీడియోలో ఉన్న వాయిస్ ఓవర్ ని తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఉపన్యాసం నుండి తీసుకున్నారని మేము గుర్తించాము. యువ గళంలో భాగంగా అనంతపురం జిల్లా శింగనమలలో ఏప్రిల్ 7, 2023 నాటి సభలో మాట్లాడిన వీడియో నుండి తీసుకున్నారు. లోకేష్ వీడియోలో 00:27 నుండి 1:08 మార్క్ వరకు ఉన్న భాగాన్ని వైరల్ వీడియోలో చేర్చారు.

వైరల్ వీడియో కీ ఫ్రేమ్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా వెతికితే మరింత నిడివి ఉన్న ఇదే వీడియోని ఇన్స్టాగ్రామ్ లో ‘బీహారీలడ్కా’ అనే ఒక యూజర్ జనవరి 7, 2024 నాడు షేర్ చేశారని తెలుసుకున్నాము. వైరల్ వీడియోలో మొదటి 22 సెకన్ల భాగం ఈ ఇన్స్టాగ్రామ్ వీడియోలో 7 సెకన్ల మార్క్ దగ్గర నుండి తీసుకున్నదే. అయితే ఈ ఇన్స్టాగ్రామ్ వీడియోలో వేరే వాయిస్ ఓవర్ ఉంది.

ఇన్స్టాగ్రామ్ వీడియోలో ఒక వ్యక్తి, బహుశా కెమెరా పర్సన్ అయ్యుండొచ్చు, హిందీలో మాట్లాడుతూ ఈ బాలురు మాదకద్రవ్యాలు సేవిస్తున్నారని తెలిపారు. ఇది బీహార్ లోని పట్నా రైల్వే జంక్షన్ దగ్గర ఉన్న హనుమాన్ మందిర్ పక్కన ఉన్న ఖాళీ స్థలం అని తను వీడియోలో తెలిపారు. ఈ ఇన్స్టాగ్రామ్ వీడియోలో మనం ఈ మందిరం పై భాగం చూడవచ్చు. వీడియోలోని బాలురు తమని ఎవరో వీడియో తీస్తున్నారని గమనించగానే, ఒకరు తమ మొహం కనిపించకుండా దాక్కునే ప్రయత్నం చేయాగా, మరొకరు కెమెరా పర్సన్ వైపు  అసభ్యకరమైన సంజ్ఞలు చేశారు.

న్యూస్ 18 హిందీ సంస్థ దీని గురించి ఈ ఇన్స్టాగ్రామ్ వీడియోతో కూడిన కథనం ఒకటి ప్రచురించింది. ఈ ఘటన పట్నా రైల్వే జంక్షన్ స్టేషన్ బయట జరిగింది అని ఆ కథనంలో ఉంది. ఈ స్టేషన్ పట్నాలో అతి పెద్ద రైల్వే స్టేషన్.

ఈ ఇన్స్టాగ్రామ్ వీడియోలో మనం హనుమాన్ మందిర్, అలాగే దాని పక్కన ‘స్టెప్ అప్ కెఫే అండ్ వెయిటింగ్ లాంజ్’ అనే రెస్టారెంట్ ని గమనించవచ్చు. వీటిని గూగుల్ మ్యాప్స్ ద్వారా మేము గుర్తించాము. 

వీడియోలో కనిపించిన హనుమాన్ మందిర్, స్టెప్ అప్ కెఫే అండ్ వెయిటింగ్ లాంజ్ లు పట్నా రైల్వే స్టేషన్ బయట ఉన్నట్టు గూగుల్ మ్యాప్స్ ద్వారా గుర్తించాము (సౌజన్యం: గూగుల్ మ్యాప్స్, స్క్రీన్ షాట్స్)

అలాగే ఈ ఇన్స్టాగ్రామ్ వీడియోలో ఉద్యోగలు ఉన్నాయి అంటూ గోడ మీద అతికించిన పోస్టర్లు, ఆలాగే ఒక షాపు మనం చూడవచ్చు. ఇవన్నీ కూడా హిందీలో ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో మాట్లాడే ప్రధానమైన భాష తెలుగు. 

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారి ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ కూడా ఈ వీడియో ఆంధ్ర ప్రదేశ్ కి చెందినది కాదని, బీహార్ కి చెందిన వీడియో అని ఎక్స్ లో జనవరి 10, 2024 నాడు వివరణ ఇచ్చింది. 

తీర్పు

మైనర్ బాలురు మాదకద్రవ్యాలు సేవిస్తున్నారంటూ చెబుతున్న బీహార్ కి చెందిన ఒక వీడియోని ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన వీడియోగా షేర్ చేశారు. కాబట్టి ఈ క్లైమ్ అబద్ధం అని మేము నిర్ధారించాము.  

(అనువాదం- గుత్తా రోహిత్)

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , తెలుగు

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.