బ్రెజిల్ కి సంబంధించిన వీడియోని గుజరాత్ లో డాక్టర్ ఒక రోగి పై లైంగిక దాడి చేస్తున్నట్టుగా షేర్ చేసారు

ద్వారా: మహమ్మద్ సల్మాన్
ఫిబ్రవరి 13 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
బ్రెజిల్ కి సంబంధించిన వీడియోని గుజరాత్ లో డాక్టర్ ఒక రోగి పై లైంగిక దాడి చేస్తున్నట్టుగా షేర్ చేసారు

వైరల్ పోస్ట్ యొక్క స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/ స్క్రీన్ షాట్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

ఈ వీడియో బ్రెజిల్ దేశానికీ సంబంధించినది, అందులో ఉన్నది గియోవన్నీ క్వీన్తెల్ల బెజెర్ర అనే ఒక మత్తు వైద్యుడు.

క్లైమ్ ఐడి 617a93df

క్లెయిమ్ ఏమిటి?

శస్త్రచికిత్స సమయంలో ఒక రోగి పై లైంగిక దాడి కి సంబంధించిన ఒక ఇబ్బందికర వీడియోని షేర్ చేసి ఇందులో ఉన్న డాక్టర్ గుజరాత్ కి చెందిన వ్యక్తి అంటూ షేర్ చేస్తున్నారు. సామాజిక మాధ్యమాలలో షేర్ చేసిన దాని ప్రకారం, గుజరాత్ కి చెందిన రమేష్ భాయ్ పటేల్ అనే ఒక డాక్టర్ సి సెక్షన్ చేయబడుతున్న రోగి పై లైంగిక దాడి కి పాల్పడుతున్నాడు. ఈ వీడియోని ఎక్స్ (పూర్వపు ట్విట్టర్) మరియు ఫేస్బుక్ లాంటి వేదికలలో కుడా షేర్ చేస్తున్నారు, వీటిని కొన్ని వేల మంది చూస్తున్నారు. (ఆ పోస్ట్లు చూడడానికి ఇబ్బందికరంగా ఉండటం తో మేము వాటికి సంబంధించిన లింకులను కానీ ఆర్చైవ్ పోస్ట్ను కానీ జత చేయటం లేదు)


వైరల్ పోస్ట్ యొక్క స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/ స్క్రీన్ షాట్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్) 

కానీ ఈ వీడియో గుజరాత్ కి సంబంధించినది కాదు, బ్రెజిల్ లోని రియో డి జనేయురో ది. అందులో ఉన్నది గియోవన్నీ క్వీన్తెల్ల బెజెర్ర అనే ఒక మత్తు వైద్యుడు.

మేము ఏమి కనుగొన్నము?

మేము గూగుల్ సెర్చ్ చేయగా, జులై 2022 లో ఈ వీడియోకి సంబంధించి రిపోర్ట్ అయిన అనేక వార్త కథనాలు మాకు లభించాయి. 

బ్రెజిల్ కి సంబంధించిన ‘ఇస్టోయే’ అనే ఒక మాస పత్రిక ప్రచురించిన కథనంలో కుడా వైరల్ క్లిప్ లో ఉన్న మాదిరి విజుఅల్స్ ఉన్నాయి. ఈ కథనం ప్రకారం గియోవన్నీ క్వీన్తెల్ల  బెజెర్ర అనే ఒక మత్తు వైద్యుడు దా మూళ్హర్ దే విలార్ డోస్ టేల్స్ అనే ఆసుపత్రి లో ఒక రోగి కి సి-సెక్షన్ డెలివరీ జరుగుతున్న సమయంలో ఆమెపై లైంగిక దాడి చేసినందుకు అరెస్ట్ చేయబడ్డాడు అని ఉంది. జులై 11, 2022 న బ్రెజిలియన్ సివిల్ పోలీసులు ప్రకారం ఈ ఘటనను హాస్పిటల్ సిబ్బంది వీడియో తీశారు అని తెలుస్తుంది.

సి ఎన్ ఎన్ బ్రెజిల్, ది డైలీ మెయిల్, ది సన్ లాంటి అనేక మీడియా సంస్థలు ఈ సంఘటన గురించి కథనాలు ప్రచురించాయి. ఈ కథనాల ప్రకారం కుడా, హాస్పిటల్ సిబ్బందిలో ఒకరు ఆ మత్తు వైద్యుడు, బెజెర్ర పేషెంట్ పై లైంగిక దాడి చేస్తుండగా వీడియో తీశారు. నేరస్తుడి కి జీవిత ఖైదు శిక్ష విధించారు అని పేర్కొన్నాయి.

రేడియోఏజెన్సియా వారి కథనం ప్రకారం, బెజెర్ర పై ఆరోపణలు ఉన్న మరో అయిదు రేప్ కేసులను కుడా విచారిస్తున్నారు. జులై 12, 2022 నుండి ఈయనను వైద్య వృత్తి నుండి కుడా బహిష్కరించారు. మా పరిశోధన ప్రకారం, నేరస్థుడు ఇప్పుడు జైలు లో ఉన్నారు. 

ఇలాంటి కథనాలే ఏమైనా గుజరాత్ లో రమేష్ భాయ్ పటేల్ పేరుతో ఉన్నాయా అని వెతికాము, కానీ అలాంటివి ఏమి మాకు లభించలేదు.

తీర్పు :

మా పరిశోధన ప్రకారం, వైరల్ వీడియో లో ఉన్న సంఘటన బ్రెజిల్ లో జరిగింది. దీనికి గుజరాత్ కి కానీ అక్కడి డాక్టర్ కి కానీ ఎటువంటి సంబంధం లేదు. కనుక మేము దీనిని అబద్ధం అని నిర్ధారించాము. 

(అనువాదం : రాజేశ్వరి పరస )

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , हिंदी , తెలుగు

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.