చెన్నైకి చెందిన వీడియోని షేర్ చేసి ఆంధ్ర ప్రదేశ్ లో పోలీసుని కొట్టిన యువకుడు అని క్లైమ్ చేశారు

ద్వారా: రాజేశ్వరి పరస
ఏప్రిల్ 29 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
చెన్నైకి చెందిన వీడియోని షేర్ చేసి ఆంధ్ర ప్రదేశ్ లో పోలీసుని కొట్టిన యువకుడు అని క్లైమ్ చేశారు

ఆంధ్ర ప్రదేశ్ లో పోలీసు మీద యువకుడి దాడి అంటూ వీడియోని షేర్ చేసిన సామాజిక మాధ్యమ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

ఈ ఘటన చెన్నైలో 2017 లో జరిగిందని కుమరన్ నగర్ పోలీస్ స్టేషన్ అధికారి ఒకరు లాజికల్లీ ఫ్యాక్ట్స్ కి నిర్ధారించారు.

క్లైమ్ ఐడి ff934a54

క్లైమ్ ఏంటి?

ఒక యువకుడు ఒక పోలీసుని కొడుతున్న వీడియో షేర్ చేసి, ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్ లో జరిగినది అని సామాజిక మాధ్యమాలలో క్లైమ్ చేశారు. ఈ వీడియోతో పాటు రానున్న ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలలో విపక్ష కూటమికి ఓటు వేయమని కుడా రాసుకొచ్చారు. 2024 ఎన్నికలకి తెలుగుదేశం పార్టీ, జన సేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమిగా ఏర్పడ్డాయి. వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ. ఈ పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. 

ఆన్లైన్ లో సర్కులేట్ అవుతున్న క్లైమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే, ఈ ఘటన జరిగినది తమిళ నాడు రాష్టంలో.

మేము ఏమి తెలుసుకున్నాము?

ఈ వీడియో కీ ఫ్రేమ్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతికితే, ఈ వీడియో 2017 నుండి ఆన్లైన్ లో ఉందని తెలిసింది. “చెన్నై: విధి నిర్వర్తించినందుకు పోలీసుని కొట్టిన విద్యార్ధి, వైరల్ అయిన వీడియో” అనే శీర్షికతో డిసెంబర్ 24, 2017 నాడు టైమ్స్ ఆఫ్ ఇండియా లో వచ్చిన ఒక కథనం మాకు లభించింది. ఈ కథనంలో ఈ వైరల్ వీడియోని జోడించారు. తన బండి మీద మరొక ఇద్దరిని ఎక్కించుకుని వెళ్తుండగా, పోలీసు తనను ఆపారని, ఆపినందుకు పోలీసుతో గొడవ పడి, పోలీసు మీద ఈ 21 సంవత్సరాల విద్యార్ధి దాడి చేశాడు అని ఈ కథనంలో ఉంది. నిందితుడిని అరెస్ట్ చేశారని ఈ కథనం పేర్కొంది. 

వన్ ఇండియా (ఆర్కైవ్ ఇక్కడ) అనే న్యూస్ పోర్టల్ కూడా ఈ వీడియోని తమ యూట్యూబ్ చానల్ లో డిసెంబర్ 30, 2017 నాడు అప్లోడ్ చేసింది. 

2017 నాటి వన్ ఇండియా వీడియో కథనం స్క్రీన్ షాట్ (సౌజన్యం: యూట్యూబ్/వన్ ఇండియా)

ది హిందూ లో డిసెంబర్ 26, 2017 నాడు వచ్చిన ఒక కథనం ప్రకారం, ఈ ఘటన ఉత్తర చెన్నైలోని కుమరన్ నగర్ అనే ప్రాంతంలో చోటు చేసుకుంది. 

వీటి ఆధారంగా, మేము కుమరన్ నగర్ పోలీస్ స్టేషన్ అధికారులని సంప్రదించాము. పేరు తెలపడానికి ఇష్టపడని అధికారి ఒకరు ఈ ఘటన డిసెంబర్ 2017 లో జరిగింది అని నిర్ధారించారు. వీడియోలో ఉన్న పోలీసు మహేశ్వరన్ పిళ్లై అని, తను అప్పుడు ఈ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ అని, ఇప్పుడు మరొక పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్నారని మాకు తెలిపారు. 

తీర్పు

చెన్నైలో 2017లో ఒక విద్యార్ధి పోలీసు అధికారి మీద దాడి చేసిన ఘటన వీడియోని ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాములో జరిగినట్టు షేర్ చేశారు. కాబట్టి ఈ క్లైమ్ అబద్ధం అని మేము నిర్ధారించాము. 

(అనువాదం- గుత్తా రోహిత్)

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , తెలుగు

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.