హోమ్ మంత్రి పాత వీడియోని షేర్ చేసి ముఖ్తార్ అన్సారీ మరణాన్ని గురించి చేసిన వ్యాఖ్యలగా షేర్ చేస్తున్నారు

ద్వారా: రాహుల్ అధికారి
ఏప్రిల్ 3 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
హోమ్ మంత్రి పాత వీడియోని షేర్ చేసి ముఖ్తార్ అన్సారీ మరణాన్ని గురించి చేసిన వ్యాఖ్యలగా షేర్ చేస్తున్నారు

వైరల్ అవుతున్న పోస్టుల స్క్రీన్ షాట్లు ( సౌజన్యం : ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు తప్పుదారి పట్టించేది

ఈ వీడియో 2019 ఏప్రిల్ లోనిది. ఇక్కడ హోమ్ వ్యవ్యహారాల మంత్రి అమిత్ షా ఉత్తర్ ప్రదేశ్ లోని కస్గంజ్ లో ఒక ర్యాలీ లో మాట్లాడుతున్నారు.

క్లైమ్ ఐడి 9e4df4e0

క్లెయిమ్ ఏమిటి ?

భారత హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ఒక వీడియోలో తానే ముఖ్తార్ అన్సారీ అనే గూండాని చంపానని ఒక ర్యాలీ లో ఒప్పుకున్నట్టు పోస్టు షేర్ అవుతుంది. అన్సారీ అనే వ్యక్తి గుండె పోటు వలన ఉత్తర్ ప్రదేశ్ లోని బందా జైలు లో మార్చ్ 28 నాడు మృతి చెందారు.

ఈ 57 సెకెన్ల నిడివి గల వీడియోలో, షా హిందీ లో మాట్లాడుతూ, తమ ప్రభుత్వం చేసిన గొప్ప పనుల్లో ఒకటి ‘నిజాం’ (NIZAM) నుండి ప్రజల్ని విముక్తి పరచటం అని తెలిపారు. ఇక్కడ నిజాం అనగా అందులో ఎన్ అంటే నజీముద్దీన్ సిద్దిక్వి నుండి బిజెపి విముక్తి ఇచ్చింది అని. అదే విధంగా, అజాం ఖాన్, అతిక్ అహ్మద్, ముఖ్తార్ అన్సారీ నుండి కుడా విముక్తి కల్పించింది అని తెలిపారు. కానీ సమాజ్వాదీ  మరియు బహుజన్ సమాజ్వాదీ పార్టీ కూటమి కనుక మళ్ళీ అధికారం లకి వస్తే నిజాంను మరల అధికారంలోకి తీసుకువచ్చినట్టే అని తెలిపారు.

అనేక మంది యూజర్లు ఈ వీడియోని ఎక్స్ (పూర్వపు ట్విట్టర్) లో పోస్ట్ చేసారు. ఆర్కైవ్ చేసిన పోస్టులను ఇక్కడ చూడవచ్చు.

వైరల్ అవుతున్న పోస్టుల స్క్రీన్ షాట్లు ( సౌజన్యం : ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే, ఈ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది. 

వాస్తవం ఏమిటి?

వైరల్ అవుతున్న వీడియోలో కీ ఫ్రేమ్స్ ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా వెతికాగా మాకు ఈ వీడియో 2019 లో  ఏప్రిల్ 10 నాటిది అని అర్ధమయింది, అప్పట్లో 16 వ లోక్ సభ ఎన్నికల నేపధ్యంలో భారతీయ జనతా పార్టీ తమ యూట్యూబ్ ఛానల్ లో ఈ వీడియోని పోస్ట్ చేసింది. ఈ 57 సెకెన్ల వీడియోని ‘బిజెపి ఉత్తర్ ప్రదేశ్ ని నిజాం నుండి విముక్తి చేసింది: అమిత్ షా, కస్గంజ్’ అనే శీర్షిక తో షేర్ చేసారు


అదే రోజున పార్టీ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసిన మరింత నిడివి గల
వీడియో కుడా మాకు లభించింది. ఈ వీడియో మొత్తం నిడివి 34:34 నిమిషాలు ఉంటె, అందులో 19:30 నుండి 20:27 మధ్య ప్రస్తుతం వైరల్ అవుతున్న క్లిప్ ఉంటుంది. ఈ స్పీచ్ లో కుడా తమ ప్రభుత్వం సాధించిన విజయాలలో ఒకటి ‘నిజాం’ (NIZAM) నుండి ప్రజల్ని విముక్తి పరచటం అని తెలిపారు. ఇక్కడ నిజాం అనగా ప్రతిపక్ష పార్టీల నేతలు, వారిలో నజీముద్దీన్ సిద్దిక్వి, ఇమ్రాన్ మసూద్, అజాం ఖాన్, ఆతిక్ అహ్మద్, మరియు ముఖ్తార్  అన్సారీ అని తెలిపారు. ఇక్కడ సిద్దిక్వి మరియు మసూద్ లు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నాయకులు మరియు ఖాన్ ఇంకా అహ్మద్ లు సమాజ్వాదీ పార్టీ టికెట్ పై పోటీ చేస్తున్న నాయకులు.

అన్సారీ, ఉత్తర్ ప్రదేశ్ లోని మవ్ సదర్ అనే నియోజకవర్గానికి అయిదు సార్లు ఎన్నికైన శాసనసభ్యుడు. ఈయన మొదట్లో బీఎస్పీ పార్టీ వ్యక్తి. ఈయన రెండు సార్లు స్వతంత్ర అభ్యర్ధిగా  పోటీ చేసి గెలవగా, ఒకసారి సొంత పార్టీ తరపున పోటీ చేసారు. తరువాత 2017 లో బీఎస్పీ కి మరల తిరిగి వచ్చారు.

ఏప్రిల్ 10, 2019 నాడు ఫిరోజాబాద్ లో షా మాట్లాడుతూ ఇక్కడ కుడా నిజామ్ అనే పదం వాడారు, ఇక్కడ కుడా బిజెపి సాధించిన అన్ని విజయాల కన్నా నిజాం నుండి విముక్తి అనేది గొప్పది అని పేర్కొన్నారు. 

పైగా, ఇక్కడ ర్యాలీ లో మాట్లాడుతూ, ఈ వ్యక్తులను అయితే జైలు అన్న పంపగలిగాము లేదా ఉత్తర్ ప్రదేశ్ వదిలి వెళ్లేలా చేసాము అని అన్నారు. ‘ఒకవేళ  సమాజ్వాదీ మరియు బహుజన్ సమాజ్వాదీ పార్టీ కూటమి కనుక మల్లి అధికారం లోకి వస్తే నజీముద్దీన్ సిద్దిక్వి, ఇమ్రాన్ మసూద్, అజాం ఖాన్, ఆతిక్ అహ్మద్, మరియు ముఖ్తార్ అన్సారీ లాంటి వాళ్ళు మరల రాజ్యం ఏలుతారు’ అని తెలిపారు.

ఇక్కడ పేర్కొన్న నిజాం నాయకులలో, అతిక్ అహ్మద్ 2023 లో పోలీసులు తనను జైలుకు తీసుకువెళ్తుండగా హత్యకు గురికాగా, అన్సారీ వివిధ జైళ్లలో మొత్తం మీద 19 సంవత్సరాలు మగ్గి ఈ మధ్యనే ఒక జైలు లో కన్ను మూసారు. 

తీర్పు:

ఒక పాత వీడియోలో అమిత్ షా,  సమాజ్వాదీ మరియు బహుజన్ సమాజ్వాదీ పార్టీ కూటమి విమర్శిస్తూ ఒక సందర్భంలో ముఖ్తార్ అన్సారీ గురించి మాటాడిన సన్నివేశాన్ని అసందర్భంగా షేర్ చేస్తున్నారు. ఈ వీడియో 2019 లోని ఎన్నికల ప్రచారం లోనిది. అన్సారీ మరణానికి ముందుగానే మాట్లాడిన వ్యాఖ్యలు. కనుక మేము దీనిని తప్పుదోవ పట్టించే విధంగా ఉందని నిర్ధారించాము.

(అనువాదం : రాజేశ్వరి పరస)

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , हिंदी , తెలుగు

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.