2021 నాటి వీడియో షేర్ చేసి తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో బీఆర్‌ఎస్ నాయకుడు ఓటరుపై దాడి చేస్తున్న వీడియోగా ప్రచారం చెసారు

ద్వారా: రాజేశ్వరి పరస
నవంబర్ 9 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
2021 నాటి వీడియో షేర్ చేసి తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో బీఆర్‌ఎస్ నాయకుడు ఓటరుపై దాడి చేస్తున్న వీడియోగా ప్రచారం చెసారు

వైరల్ అవుతున్న క్లెయిమ్ స్క్రీన్ ‌షాట్ (సౌజన్యం: ఎక్స్ /స్క్రీన్‌షాట్/లాజికలల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు తప్పుదారి పట్టించేది

వికారాబాద్ లో ఒక గ్రామ సర్పంచ్ గ్రామస్థుడిని కొట్టిన పాత వీడియోను తెలంగాణలో ఇటీవల జరిగిన సంఘటన వీడియోగా ప్రచారం చేశారు

క్లైమ్ ఐడి 5d7da200

క్లెయిమ్ ఏమిటి?

దక్షిణ భారత రాష్ట్రమైన తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30, 2023 నాడు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో సామాజిక మాధ్యమాలలో  తప్పుడు సమాచారం ప్రచారం అవుతున్నది. ఎక్స్ (పూర్వపు ట్విటర్)లో ఒక యూజర్ ఒక వీడియోను పోస్ట్ చేసారు, ఇక్కడ ఒక తెల్ల చొక్కా ధరించిన వ్యక్తి  నీలం రంగు చొక్కా ధరించి నేలపై పడిపోయిన వ్యక్తిపై దాడి చేయడం మరియు దుర్భాషలాడడం చూడవచ్చు, వారి చుట్టూ ఉన్న ఇతరులు దాడిని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఈ వీడియోని ఈ శీర్షికతో షేర్ చేశారు, #TelanganaAssemblyElections2023 #WATCH: తెలంగాణలో సామాన్య ప్రజలపై బీఆర్ఎస్ నాయకుని దాడి!”

బిఆర్ఎస్ తెలంగాణలో అధికార పార్టీ అయిన భారత రాష్ట్ర సమితి. ఈ పోస్ట్ ను నవంబర్ 6, 2023న షేర్ చేశారు, మేము ఈ కథనం రాసే సమయానికి 23,700 వ్యూస్ ఉన్నాయి. ఆర్కైవ్ చేసిన పోస్ట్ ను ఇక్కడ చూడవచ్చు. 


వైరల్ అవుతున్న క్లెయిమ్ స్క్రీన్ ‌షాట్ (సౌజన్యం: ఎక్స్ /స్క్రీన్‌షాట్/లాజికలల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే, ఇది తప్పుదారి పట్టించేటట్టుగా ఉంది. ఎందుకంటే ఈ వీడియో 2021 నాటిది. దీనికి జరుగుతున్న ఎన్నికల ప్రచారానికి సంబంధం లేదు. 

వాస్తవం ఏమిటి?

ఈ పోస్ట్ వైరల్ అవ్వడంతో చాలా మంది యూజర్లు ఇది పాత సంఘటన అని కామెంట్ చేశారు. ఆలా చేస్తూ, దానికి సంబంధించి ఈనాడులో ప్రచురితమయిన ఒక వార్త కథనాన్ని షేర్ చేశారు. ఈ కథనంలో వికారాబాద్ లో ఒక సర్పంచ్ ఒక వ్యక్తిని కొడుతున్న వీడియో 2021 లో వైరల్ అయ్యింది అని రాసి ఉంది. 

ఇటువంటి సంఘటన గురించి మేము కీ వర్డ్ సెర్చ్ చేయగా మాకు సెప్టెంబర్ 23, 2021 నాడు ప్రచురితమయిన ఒక టైమ్స్ అఫ్ ఇండియా కథనం లభించింది. ఈ కథనం, "తెలంగాణ: వికారాబాద్ జిల్లాలో గ్రామస్థుడిని కొట్టినందుకు సర్పంచ్ అరెస్ట్”, అనే శీర్షికతో ప్రచురించబడింది. ఈ కథనం ప్రకారం, దమస్తపూర్ గ్రామానికి చెందిన అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి (ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి) సర్పంచ్ కె జైపాల్ రెడ్డి, శ్రీనివాస్ అనే గ్రామస్థుడిని కొట్టినందుకు పోలీసులు అరెస్టు చేశారు.

పోలీసులను ఉటంకిస్తూ, టైమ్స్ అఫ్ ఇండియాలో సర్పంచ్ తమ బంధువుతో గొడవ పడుతుండగా, తాగిన మత్తులో ఉన్న బాధితుడు శ్రీనివాస్ వారిని అడ్డగించి, గ్రామంలోని నీటి సమస్యలపై దృష్టి సారించాలని తనకు చెప్పినట్లు ఆ కథనం పేర్కొంది. నిందితుడిని స్థానిక మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత బెయిల్ లభించిందని కథనం ద్వారా తెలుస్తుంది. 

సెప్టెంబర్ 25, 2021న ఈటీవీ తెలంగాణ తమ యూట్యూబ్ చానల్‌లో ప్రచురించిన వీడియో కథనం ప్రకారం, వెనుకబడిన తరగతుల కమీషన్ ఆ గ్రామాన్ని సందర్శించి విచారణ చేపట్టింది. కమిషన్ సభ్యులు బాధితుడి ఇంటికి వెళ్లి సర్పంచ్ జైపాల్ రెడ్డితో తనకి క్షమాపణలు చెప్పించారు.

ఈ సంఘటన జరిగిన సమయం లో 2021 లో అనేకమంది పాత్రికేయులు మరియు వార్త సంస్థలు కుడా ఈ వీడియోని తమ సామాజిక మధ్యమ అకౌంట్లలో షేర్ చేశారు. 

పాత్రికేయులు మరియు మీడియా సంస్థలు షేర్ చేసిన వైరల్ క్లెయిమ్ స్క్రీన్‌షాట్‌లు (సౌజన్యం:  ఎక్స్/@revathitweets/XpressHyderabad)

తీర్పు:

2021లో తెలంగాణలోని వికారాబాద్ లో ఒక గ్రామ సర్పంచ్ గ్రామస్థుడిని కొట్టి మరియు దుర్భాషలాడిన వీడియోని తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచార సమయంలో జరిగిన ఘటన వీడియోగా ప్రచారం చేశారు. కనుక మేము దీనిని తప్పుదారి పట్టించేటట్టుగా ఉందని నిర్ధారించాము.

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , తెలుగు

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.