కుదించిన వీడియో క్లిప్ షేర్ చేసి G 7 శిఖరాగ్ర సమావేశం లో భారత ప్రధాన మంత్రి మోదీని నిర్లక్ష్యం చేశారంటూ ప్రచారం చేశారు

ద్వారా: రోహిత్ గుత్తా
ఆగస్టు 10 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
కుదించిన వీడియో క్లిప్  షేర్ చేసి G 7 శిఖరాగ్ర సమావేశం లో భారత ప్రధాన మంత్రి మోదీని నిర్లక్ష్యం చేశారంటూ ప్రచారం చేశారు

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు తప్పుదారి పట్టించేది

మరింత నిడివి గల ఇదే వీడియో చూస్తే కనుక సమావేశానికి వచ్చినప్పుడు ఫ్రెంచ్ ప్రధాన మంత్రితోనూ, సమావేశం నుండి వెళుతున్నప్పుడు జపాన్ ప్రధాన మంత్రితోనూ ప్ర

క్లైమ్ ఐడి 134be1b3

నేపధ్యం

ఫ్రాన్స్, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డం, జర్మనీ, జపాన్, ఇటలీ, కెనడా, అలాగే ఐరోపా సమాఖ్య ఇందులో సభ్యులు. ఐరోపా సమాఖ్య అనేది ఒక దేశం కాకుండా దేశాల సమాఖ్య అయిన కారణంగా ఈ కూటమి పేరు G8 కాకుండా G7 అయ్యింది. ఈ కూటమి తాజా శిఖరాగ్ర సమావేశం మే 19-21, 2023 నాడు జపాన్ లోని హీరోషిమాలో జరిగింది. 

భారత దేశం కూడా ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నది. భారత దేశం తరుపున ప్రధాన మంత్రి మోదీ ప్రాతినిధ్యం వహించారు. దానితో ఈ సమావేశంలో మోదీ ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొట్టాయి. మే 21, 2023 నాడు విపక్ష తృణమూల్ కాంగ్రెస్ నాయకులు, పార్లమెంట్ సభ్యులు జవహర్ సర్కార్ ఈ శిఖరాగ్ర సమావేశానికి చెందిన ఒక వీడియో ట్వీట్ చేసి “హిరోషిమాలో జరుగుతున్నG7 శిఖరాగ్ర సమావేశంలో మన ప్రధాన మంత్రి ఒంటరివాడిగా ఉన్నట్టు ఉన్నారు. ఆలాగే అందరూ దూరం పెట్టినట్టున్నారు” అని రాసుకొచ్చారు. 

ఇతర ప్రపంచ దేశాల అధినేతలతో పాటు నుంచుని, ఫ్రాన్స్ ప్రధాన మంత్రి ఎమ్మాన్యూయెల్ మాక్రోన్ అమెరికా అధ్యక్షులు జో బైడెన్ తో మాట్లాడటాన్ని మోదీ గమణిస్తునట్టు ఈ 12 సెకన్ల వీడియోలో ఉంది. ఎవరితోనూ మాట్లాడకుండా వేదిక దిగి వెళ్ళిపోవటం కూడా ఈ వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియోని అనేక మంది షేర్ చేశారు. అలా షేర్ చేసిన వారిలో కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు జైరాం రమేష్, న్యాయవాది మరియు సామాజిక కార్యకర్త ప్రశాంత్ భూషణ్ ఉన్నారు. భారత ప్రధాన మంత్రిని ఇతర దేశాల నాయకులు పట్టించుకోలేదు అనే క్లైమ్ తో వీళ్ళు ఈ వీడియోని షేర్ చేశారు.  

అయితే ఇది కుదించిన వీడియో. మరింత నిడివి ఉన్న ఇదే వీడియో చూస్తే కనుక G7 శిఖరాగ్ర సమావేశంలో ఇతర దేశాల నాయకులు మోదీని పలకరించారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. 

వాస్తవం

G7 శిఖరాగ్ర సమావేశ అధికారిక వెబ్సైట్ ని పరిశోధించాక ఈ వైరల్ వీడియో ని మే 20, 2023  నాడు హిరోషిమాలోని గ్రాండ్ ప్రిన్స్ హోటల్ లో తీశారాని మేము తెలుసుకున్నాము. ఈ వెబ్సైట్ లో ఈ వీడియో లేదు. అయితే “G7 కుటుంబ ఫొటో, సంప్రదింపులు” అనే శీర్షికతో మోదీవి రెండు ఫొటోలు ఉన్నాయి. ఈ ఫొటోలో మోదీ ఫ్రాన్స్ ప్రధాన మంత్రి ఎమ్మాన్యూయెల్ మాక్రోన్ తో మాట్లాడుతున్నారు. 

ఈ వీడియో కోసం మేము అప్పుడు వెతికాము. మరింత నిడివి ఉన్న ఇదే వీడియోని మోదీ తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో 0:11 దగ్గర ఎమ్మాన్యూయెల్ మాక్రోన్ మోదీని పలకరించి, తనతో పాటు వేదిక మీదకి నడుచుకుంటూ వెళ్ళటం చూడవచ్చు. జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్, ఐరోపా కౌన్సిల్ అధ్యక్షులు ఛాల్స్ మైఖెల్ , మరి ఇంకొంతమంది వీరిని వెనుకాల వెళ్ళటం చూడవచ్చు. 2:39 దగ్గర ఫొటో సెషన్ అయిపోయాక, వేదిక దిగి తిరిగి వెళ్లేటప్పుడు జపాన్ ప్రధాన మంత్రి ఫ్యుమియో కిషిడా తో మోదీ మాట్లాడటం, ఇద్దరు కరచాలనం చెయ్యడం కూడా చూడవచ్చు. 

ది ఇండిపెండెంట్ వార్త సంస్థ వారి యూట్యూబ్ ఛానల్ లో ఈ సమావేశం లైవ్ స్ట్రీమ్ వీడియోలో కూడా ఈ సంఘటనలని మనం చూడవచ్చు. 

అలాగే జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్, ఐరోపా సమాఖ్య కమీషన్ అధ్యక్షులు ఉర్సులా వోన్ దేర్ లేయెన్, ఐరోపా సమాఖ్య కౌన్సిల్ అధ్యక్షులు ఛాల్స్ మైఖెల్, యు కె ప్రధాన మంత్రి రిషి సునక్, ఇతర నాయకులతో తాను మాట్లాడుతున్న ఫొటోలని మోదీ షేర్ చేశారు. ఈ మూడు రోజుల పర్యటనలో మోదీ ఉక్రెయిన్ అధ్యక్షులు జెలెన్స్కీ తో కూడా సమావేశం అయ్యారు. 

ఎన్ డి టి వి కథనం ప్రకారం హిరోషిమాలో జరిగిన G7 శిఖరాగ్ర సమావేశంలో అమెరికా అధ్యక్షులు జో బైడెన్ మోదీని పొగుడుతూ ఇలా అన్నారు, “మీరు బాగా ప్రసిద్ధులు. మీ ఆటోగ్రాఫ్ నాకు కావాలి.” జూన్ 2023లో మోదీ అమెరికా పర్యటనలో మోదీ సభలకి టికెట్లు తమకి కావాలి తనని అనేకమంది అడిగారు అని బైడెన్ తెలిపారు. 

తీర్పు

జపాన్ లోని హిరోషిమాలో జరిగిన G7 శిఖరాగ్ర సమావేశంలో  ఫొటో ఘాట్ కి సంబంధించిన వీడియోని కుదించి భారత ప్రధాన మంత్రి మోదీని ఇతర దేశాల నాయకులు ‘పట్టించుకోలేదు’ అని, ‘విస్మరించారు’ అని తప్పుడు ప్రచారం చేశారు. 

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , తెలుగు , ಕನ್ನಡ

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.