ఒక్క ముస్లింలనే కాదు, కాంగ్రెస్ మేనిఫెస్టోలో అన్ని మైనారిటీ వర్గాలకు చెందిన జడ్జిల సంఖ్య పెంచుతామని హామీ ఉంది

ద్వారా: రాజేశ్వరి పరస
ఏప్రిల్ 23 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
ఒక్క ముస్లింలనే కాదు, కాంగ్రెస్ మేనిఫెస్టోలో అన్ని మైనారిటీ వర్గాలకు చెందిన జడ్జిల సంఖ్య పెంచుతామని హామీ ఉంది

ఆన్లైన్ లో ప్రచారం అవుతున్న క్లెయిమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/ ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు తప్పుదారి పట్టించేది

కాంగ్రెస్ మేనిఫెస్టోలో అధిక శాతం మహిళా వర్గం నుండి, బడుగు బలహీన వర్గానికి చెందిన వారిని, మైనారిటీల నుంచి ఎక్కువ మంది న్యాయమూర్తులను నియమిస్తామని ఉంది.

క్లైమ్ ఐడి df4b0d7f

క్లెయిమ్ ఏమిటి ?

2024 సాధారణ ఎన్నికల నేపధ్యంలో కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోలో హై కోర్ట్ మరియు సుప్రీం కోర్టులలో ముస్లిం వర్గానికి చెందిన వారినే ఎక్కువుగా  న్యాయమూర్తులను నియమిస్తాము అని ఉంది అనే క్లెయిమ్ ఫేస్బుక్ మరియు యూట్యూబ్ లలో అప్లోడ్ చేసిన షార్ట్ వీడియో రూపం లో ప్రచారం అవుతుంది. వీడియోలోని వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ జాతులు, మైనారిటీ మరియు వెనుకబడిన వర్గాలవారికి చెందిన కమిషన్లను బలపరుస్తామని తెలిపినట్టుగా కుడా ఉంది. 

దీనిని ప్రశ్నిస్తూ హిందూ వర్గానికి చెందిన వారు దీని గురించి పట్టించుకోవాలి అని తెలిపారు. ఈ కథనం రాసే సమయానికి, ఆ వీడియోకి దాదాపుగా 39,000 వేల వ్యూస్ వచ్చాయి. ఆర్కైవ్ చేసిన పోస్టులను ఇక్కడ చూడవచ్చు. ఈ క్లెయిమ్ ఫేస్బుక్ మరియు ఎక్స్ లో కుడా షేర్ చేసారు. వాటి ఆర్కైవ్ పోస్ట్స్ ఇక్కడ చూడవచ్చు. 


ఆన్లైన్ లో ప్రచారం అవుతున్న క్లెయిమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/ ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్) 

అయితే, ఇది తప్పుదోవ పట్టించేటట్టుగా ఉంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏ ఒక్క వర్గానికి ప్రత్యేకంగా అలాంటి హామీ ఇవ్వలేదు. 


వాస్తవం ఏమిటి ? 

మేము కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోను చూశాము. న్యాయ పత్రం అని విడుదల చేసిన ఈ మేనిఫెస్టోలో కీ వర్డ్ సెర్చ్ చేసి వెతుకగా, జ్యుడీషియరీ సెక్షన్ లో న్యాయమూర్తులకు సంబంధించిన హామీల గురించి చూసాము.

ఇందులో అయిదో పాయింట్లో “అధిక సంఖ్యలో మహిళలను మరియు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు, ఇతర వెనుకబడిన వర్గాలకు మరియు మైనారిటీ వర్గాలకు చెందిన న్యాయమూర్తులను  హై కోర్ట్ మరియు సుప్రీం కోర్ట్ లో ఎక్కువగా నియమిస్తాము” అనే హామీ ఉంది.


న్యాయమూర్తుల నియామకం గురించి మేనిఫెస్టో లో ఉన్న పాయింట్. (సౌజన్యం : కాంగ్రెస్ మ్యానిఫెస్టో)

మేనఫెస్టోలో మేము ముస్లిం మరియు న్యాయమూర్తులు అనే కీ వర్డ్స్ వాడి వెతికాము, కానీ వైరల్ క్లెయిమ్ లో ఉన్న మాదిరి వ్యాఖ్యలు ఎక్కడ మాకు కనిపించలేదు. పైగా ఏ ఇతర కాంగ్రెస్ నాయకులు దీని గురించి మాట్లాడిన దాఖలాలు మాకు కనపడలేదు.

ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో ఏప్రిల్ 6 నాడు వచ్చిన కథనంలో కుడా ఈ విషయాన్ని గురించిన ప్రస్తావన ఉంది, ఇందులో కుడా కేవలం ముస్లిం మతానికి చెందిన వారినే అధిక సంఖ్యలో న్యాయమూర్తులుగా నియమిస్తామని తెలుపినట్టు ఎక్కడా లేదు. మేనిఫెస్టోలో అధిక సంఖ్యలో మహిళలని, మరియు ఇతర బడుగు బలహీన వర్గాలకు చెందిన వారిని నియమిస్తామని ఉంది.

మైనార్టీ అఫైర్స్ మంత్రిత్వ శాఖ ప్రకారం, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, భౌద్ధులు, జైనులు, పార్సీలను మైనారిటీలగా భారత దేశంలో గుర్తిస్తారు. నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ చట్టం 1992 ప్రకారం, ఈ వర్గాలన్నీ సెక్షన్ 2 కింద పొందుపరిచారు. 

తీర్పు

కాంగ్రెస్ మేనిఫెస్టోలో కేవలం ముస్లిం మతానికి చెందిన వారినే అధిక సంఖ్యలో నియమిస్తామని ఎక్కడా తెలుపలేదు. మేనిఫెస్టోలో అధిక శాతం మహిళలని, మరియు ఇతర బడుగు బలహీన వర్గాలకు చెందిన వారిని నియమిస్తారని ఉంది. కాబట్టి ఈ క్లైమ్ తప్పుదోవ పట్టించేటట్టు ఉందని మేము నిర్ధారించాము.

(అనువాదం : రాజేశ్వరి పరస )

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , తెలుగు , ಕನ್ನಡ

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.