ఇండియా బ్లాక్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరచలేదు అని డీకే శివకుమార్ అనలేదు

ద్వారా: అంకిత కులకర్ణి
జూన్ 5 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
ఇండియా బ్లాక్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరచలేదు అని డీకే శివకుమార్ అనలేదు

డీకే శివకుమార్ ఇండియా బ్లాక్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరరచలేదు అని క్లెయిమ్ తో వైరల్ అవుతున్న స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/స్క్రీన్ షాట్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు తప్పుదారి పట్టించేది

ఒరిజినల్ వీడియోలో శివకుమార్ తాను ఎగ్జిట్ పోల్స్ ని నమ్మను అని అన్నారు, అంటే దాని అర్ధం ఇండియా బ్లాక్ ప్రభుత్వాన్ని ఏర్పరుస్తునందని వ్యక్తం చేసినట్టే.

క్లైమ్ ఐడి 83052431

క్లెయిమ్ ఏమిటి? 

ఒక ఏడు సెకెన్ల వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతుంది. ఇందులో కర్ణాటక డిప్యూటీ ముఖ్య మంత్రి, డీకే శివ కుమార్ ఇండియా బ్లాక్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరరచలేదు అని అన్నట్టుగా అనిపిస్తుంది.

Mr. Sinha అనే అకౌంట్ ఎక్స్ లో తరచుగా తప్పుడు సమాచారం షేర్ చేసే అకౌంట్. ఈ వీడియో పోస్ట్ చేసి, డి కె శివకుమార్ ఇండియా బ్లాక్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరరచలేదు అని అన్నారని  రాసుకొచ్చారు. ఈ కథనం రాసే సమయానికి ఆ పోస్టుకు 544,000 వ్యూస్ ఉన్నాయి.  అలాంటి పోస్టుల ఆర్కైవ్ ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడచ్చు.

సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న పోస్టు స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్) 

కానీ మా పరిశోధన ప్రకారం, ఇది ఎడిట్ చేసిన వీడియో.  ఒరిజినల్ వీడియోలో శివకుమార్ ఎగ్జిట్ పోల్స్ ని నమ్మను అని చెప్తూ, ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పరుస్తుంది అని తెలిపారు.

అనేక ఎగ్జిట్ పోల్స్ సర్వేలు లోక్ సభ ఎన్నికలలో ఇండియా కూటమి ఓటమికి గురి కాబోతుంది అని, భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అని తెలిపాయి.

మేము ఏమి కనుగొన్నము?

రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతుకగా, మాకు జూన్ 3, 2024 నాడు ఏఎన్ఐ (ఆర్కైవ్ ఇక్కడ) షేర్ చేసిన ఒక వీడియో లభించింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోకి ఇంకాస్త నిడివి జోడించి ఇక్కడ ఉంది. ఇందులో శివకుమార్ ఒక పాత్రికేయుడి కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికలలో గెలుస్తుందా అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ, “అన్ని ఏడు సీట్లు మేము గెలుస్తాము,” అని తెలిపారు, కానీ ఇక్కడ ఏ రాష్ట్రం గురించి అడిగారు అనేది స్పష్టంగా లేదు.

దాని తరువాత ఎగ్జిట్ పోల్స్ అంచనా గురించి పాత్రికేయులు అడిగిన మరో ప్రశ్నకు, ఇంగ్లీష్ లో శివకుమార్ బదులు ఇస్తూ, “నేను నమ్మను . . . మాకు ఇన్ని . . . ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పరుస్తుంది” అని తెలిపారు.

దీని ద్వారా వైరల్ వీడియోలో పాత్రికేయులు అడిగిన ప్రశ్నని తీసేసి, శివకుమార్ సమాధానాన్ని అసంధర్బంగా ఎడిట్ చేసి, ‘ఇండియా కూటమి గెలుస్తుందని నేను నమ్మట్లేదు’ ఆని తను అంటున్నట్టుగా షేర్ చేసారు.

ది ఇండియన్ ఎక్స్ప్రెస్ కుడా తమ యూట్యూబ్ ఛానల్ లో ఒక వీడియోని షేర్ చేసాయి (ఆర్కైవ్ ఇక్కడ), ఇక్కడ ప్రశ్న, సమాధానం సరిగ్గా వినపడుతున్నాయి. ఈ వీడియోకి శీర్షికగా, కర్ణాటక డిప్యూటీ ముఖ్య మంత్రి డీకే శివకుమార్ ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పరుస్తుంది అని అన్నారు అని ఉంది.

పైగా, కూటమి లో భాగమైన శివకుమార్, ఇండియా బ్లాక్ ప్రభుత్వాన్ని ఏర్పరచదు అని అనటం జరిగే పని కాదు, ఆయన కేవలం ఎగ్జిట్ పోల్స్ పైన నమ్మకం లేదు అని అన్నారు. జూన్ 2 నాడు పబ్లిష్ అయినా ఎన్డీటీవీ కథనం కుడా శివకుమార్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలని లెక్కచేయట్లేదని, పైగా గతం లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను ఊహిచటంలో ఎలా విఫలమయ్యాయో, అదే విధంగా జరుగుతుంది అని అన్నారని కథనం పేర్కొంది.

తీర్పు

కర్ణాటక డిప్యూటీ ముఖ్య మంత్రి ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ, తను ఎగ్జిట్ పోల్స్ ని నమ్మను అని, ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పరుస్తుంది అని తెలిపారు. కానీ రిపోర్టర్ ప్రశ్నను తీసేసి, శివకుమార్ సమాధానాన్ని ఎడిట్ చేసి వేరే అర్ధం వచ్చేటట్టు ఎడిట్ చేశారు. కాబట్టి ఈ క్లైమ్ తప్పుదోవ పట్టించేటట్టు ఉందని మేమి నిర్ధారించాము. 

(అనువాదం : రాజేశ్వరి పరసా)

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , తెలుగు , ಕನ್ನಡ

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.