హైదరాబాద్ లో జరిగిన ఒక గొడవని ముస్లింలు హిందువులపై జరిపిన దాడిగా తప్పుగా క్లైమ్ చేశారు

ద్వారా: రోహిత్ గుత్తా
జనవరి 24 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
హైదరాబాద్ లో జరిగిన ఒక గొడవని ముస్లింలు హిందువులపై జరిపిన దాడిగా తప్పుగా క్లైమ్ చేశారు

హైదరాబాద్ లోని బోరబండలో ఒక ముస్లిం గుంపు హిందువులపై దాడి చేసిందంటూ క్లైమ్ చేసిన సామాజిక మాధ్యమ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు తప్పుదారి పట్టించేది

ఈ గొడవకి సంబంధించిన ఎఫ్ఐఆర్ లని లాజికల్లీ ఫ్యాక్ట్స్ సంపాదించింది. అందులో ఇరు మతాలకి చెందిన వారు నిందితులుగా ఉన్నారు.

క్లైమ్ ఐడి dbbc8597

(సూచన- ఈ కథనంలో దాడికి, కుల దూషణకి  సంబంధించిన విజువల్స్, వివరణ ఉన్నాయి. పాఠకులు గమనించగలరు.)

క్లైమ్ ఏంటి?

భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ లీగల్ సెల్ కి చెందిన నీలం భార్గవ రామ్ ఎక్స్ (పూర్వపు ట్విట్టర్)లో కొన్ని పోస్ట్స్ పెట్టారు. వీటిలో హైదరాబద్ లోని బోరబండలో జరిగిన గొడవకి సంబంధించినది అంటూ ఒక వీడియో కూడా ఉంది. భార్గవ రామ్ పోస్ట్స్ ప్రకారం జనవర్ 14, 2024 నాడు రాత్రి పూట ఒక ముస్లిం గుంపు హిందువులపై దాడి చేసిన ఘటనకి సంబంధించిన వీడియో ఇది.

ఈ పోస్టులలో రాత్రి పూట జరిగిన ఒక గొడవకి సంబంధించిన వీడియో, సీసీటీవీ ఫుటేజీ, గాయాలపాలయ్యిన వారి ఫొటోలు ఉన్నాయి. ముస్లిం సమాజానికి చెందిన వారికి, ఒక హిందూ దళిత సమాజానికి చెందిన వ్యక్తికి మధ్య జరిగిన గొడవ హిందూ కుటుంబాల మీద దాడికి దారితీసిందని భార్గవ రామ్ ఆరోపించారు. ఈ ఫ్యాక్ట్ చెక్ రాసే సమయానికి ఈ పోస్ట్ కి 3 లక్షల వ్యూస్ వరకు ఉన్నాయి. ఈ పోస్ట్, ఇటువంటి ఇతర పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ  మరియు ఇక్కడ  చూడవచ్చు. 

వైరల్ సామాజిక మాధ్యమ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే ఈ ఘటనలో ఎటువంటి మత కోణం లేదు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో నిందితులుగా హిందువులూ, ముస్లింలూ ఉన్నారు.

మేము ఏమి తెలుసుకున్నాము?

ఈ ఘటన గురించిన వార్తా కథనాలు మాకు లభించాయి. ఈటీవీ భారత్ తెలుగులో జనవరి 15, 2024 నాడు “మద్యం మత్తులో గొడవ పడిన యువకులు- భయాందోళనలో బస్తీవాసులు” అనే శీర్షికతో ఒక కథనం వచ్చింది. ఈ కథనం ప్రకారం హైదరాబాద్ లోని బోరబండ ప్రాంతంలో హరినగర్ లో మద్యం మత్తులో ఇరు వర్గాల యువకులు ఒకరి మీద ఒకరు రాళ్ళతో, కర్రలతో  జనవరి 14, 2024, దాడికి పాల్పడ్డారు. ఇది ఇరు మతాల ప్రజల మధ్య ఘర్షణ అని ఇందులో లేదు.

సనత్ నగర్ పోలీస్ స్టేషన్ లో దీనికి సంబంధించి ఫైల్ చేసిన రెండు ఎఫ్ఐఅర్ ల ప్రతులు మాకు లభించాయి. బి. జయంత్ ధర్మ తేజ ఒక ఎఫ్ఐఆర్ ఫిర్యాది. జనవరి 14, 2024 నాడు తను, తన స్నేహితుడు గాలిపటం కొనడానికి వెళ్లామని, అక్కడ రాహుల్, అబ్బాస్ అనే ఇద్దరితో వారి బైక్స్ పక్కన ఉమ్మివేయడం గురించి గొడవ అయ్యిందని, ఆ సాయంత్రం రాహుల్, అబ్బాస్ తమ స్నేహితులతో (హిందువులూ, ముస్లింలూ) కలిసి తమ అత్త ఇంటి దగ్గర తమని కొట్టారని ఇందులో ఉంది. ఈ ఎఫ్ఐఆర్ లో రాహుల్, అబ్బాస్, జై, నిఖిల్, ఇమ్రాన్, ఇతరులు నిందితులుగా ఉన్నారు. ముస్లింలు హిందువుల మీద దాడి చేశారని చెప్పిన క్లైమ్ తప్పని ఇది నిరూపిస్తున్నది. 

ఎఫ్ఐఆర్ లో నిందితుల పేర్ల స్క్రీన్ షాట్ (సౌజన్యం: tspolice.gov.in)

లాజికల్లీ ఫ్యాక్ట్స్ ధర్మ తేజని సంప్రదించింది. తమ మీద దాడి చేసినవారు తమ ప్రాంతం వారేనని, తమకి తెలిసిన వారేనని మాకు తెలిపారు. ఇందులో మత కోణం లేదని, తమ మీద దాడి చేసినవారిలో అత్యధికులు హిందువులేనని తెలిపారు. “మా మీద దాడి చేసిన వారిలో అత్యధికులు ఒక బిసి కులానికి చెందినవారు. మమ్మల్ని కులం పేరుతో దూషించారు,” అని తను మాకు తెలిపారు. తాము దళితులమని తేజ మాకు తెలిపారు.

ఎఫ్ఐఆర్ ప్రకారం నిందితుల మీద భారతీయ శిక్షా స్మృతిలో వివిధ సెక్షన్ల కింద, ఆలాగే ఎస్ సి/ఎస్ టి అత్యాచారాల నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు కట్టారు. 

లాజికల్లీ ఫ్యాక్ట్స్ సనత్ నగర్ పోలీసులని సంప్రదించింది. సనత్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ. పురేంద్ర రెడ్డి మాతో మాట్లాడుతూ గొడవ జరిగిన మాట వాస్తవమేనని, అయితే ఇందులో మత కోణం లేదని, ఇరు మతాలకి చెందిన వారు ఇందులో ఉన్నారని తెలిపారు. మొత్తం 8 మంది మీద కేసు కట్టామని, అందులో నలుగురిని అరెస్ట్ చేశామని మాకు తెలిపారు.

ఇంకొక ఎఫ్ఐర్ ఆ వేరే బృందం ఫైల్ చేసింది. ఇందులో ఒక ‘గుర్తు తెలియని వ్యక్తి’ మీద భారతీయ శిక్షా స్మృతి కింద కేసు కట్టారు.

తీర్పు

హైదరాబాద్ లో ఇరు వర్గాల మధ్య జరిగిన దాడిని హిందూ-ముస్లిం గొడవగా క్లైమ్ చేశారు. అయితే ఈ గొడవలో మత కోణం లేదు. కాబట్టి ఈ క్లైమ్ తప్పుదారి పట్టించేటట్టు ఉందని మేము నిర్ధారించాము. 

(అనువాదం- గుత్తా రోహిత్) 

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , తెలుగు

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.