ఎడిట్ చేసిన వీడియో షేర్ చేసి రాహుల్ గాంధీ బీజేపీకి ఓటు వేయమని అన్నారని క్లైమ్ చేశారు

ద్వారా: రాజేశ్వరి పరస
మే 22 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
ఎడిట్ చేసిన వీడియో షేర్ చేసి రాహుల్ గాంధీ బీజేపీకి ఓటు వేయమని అన్నారని క్లైమ్ చేశారు

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీజీపీకి మద్దతు తెలపమని ప్రజలకు పిలుపునిచ్చారు అని క్లైమ్ చేసిన పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

ఒరిజినల్ వీడియోలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ కి ఓటు వేయమని అంటున్నారు. అలాగే కాంగ్రెస్ ని ఆయన విమర్శించలేదు.

క్లైమ్ ఐడి f31d49d6

క్లైమ్ ఏంటి?

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి చెందిన ఒక వీడియోని సామాజిక మాధ్యమాలలో షేర్ చేసి, ఇందులో రాహూల్ గాంధీ కాంగ్రెస్ ని విమర్శిస్తున్నారు అని క్లైమ్ చేశారు. ఇందులో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి “ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి” అని అంటునట్టు ఉంది.

“నమస్కారం. నేను రాహుల్ గాంధీ. ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామ్య విలువులని కాపాడటానికే ఈ ఎన్నికలు. ఒక పక్కేమో కాంగ్రెస్, ఇండియా కూటమి ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తుండగా, మరొక పక్క ఆర్ఎస్ఎస్, బీజేపీ వాటిని పరిరక్షించడానికి ప్రయత్నిస్తున్నాయి,” అని రాహుల్ గాంధీ హిందీలో అంటున్నట్టు ఈ వీడియోలో ఉంది.

“కాంగ్రెస్ పార్టీ 22-25 మందిని కోటీశ్వరులని చేసింది. అయితే, బీజేపీ మాత్రం కోట్ల మంది మహిళలని, యువతని కోటీశ్వరులని చేయడానికి ప్రయత్నిస్తున్నది. ఆర్ఎస్ఎస్, బీజేపీ లకు మద్దతు పలకండి, రాజ్యాంగాన్ని కాపాడండి, నరేంద్ర మోదీకి ఓటు వేయండి,” అని కూడా అంటునట్టు ఉంది. ఇటువంటి పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ  మరియు ఇక్కడ  చూడవచ్చు. 

వైరల్ వీడియో స్క్రీన్ షాట్స్ (సౌజన్యం: ఎక్స్/యూట్యూబ్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే, ఇది ఎడిటెడ్ వీడియో. ఒరిజినల్ వీడియోలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ కి ఓటు వేయమని చెబుతున్నారు.

మేము ఏమి తెలుసుకున్నాము?

రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా ఒరిజినల్ వీడియోని కనుగొన్నాము. ఈ వీడియోని రాహుల్ గాంధీ అధికారిక ఇన్స్టాగ్రామ్ (ఆర్కైవ్ ఇక్కడ), ఎక్స్ (ఆర్కైవ్ ఇక్కడ) అకౌంట్లలో ఏప్రిల్ 25 నాడు షేర్ చేశారు. 

“ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి జరుగుతున్న ఈ ఎన్నికలలో, ‘భారత ప్రజల ప్రభుత్వాన్ని’ ఎన్నుకోవడానికి జరుగుతున్న ఈ ఎన్నికలలో, ‘మిత్ర కాలం’ పరిపాలనని వదిలించుకోవడానికి జరుగుతున్న ఈ ఎన్నికలలో, మీ ప్రజాస్వామిక బాధ్యతని నిర్వహించండి. కాంగ్రెస్ కి మద్దతు పలకండి. హస్తం గుర్తు మీద నొక్కండి! జి హింద్,” అని హిందీలో ఈ పోస్ట్ ల శీర్షిక ఉంది. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఈ పోస్ట్ ని పిన్ చేశారు.

ఈ వీడియోలో రాహుల్ గాంధీ, “నమస్కారం. నేను రాహుల్ గాంధీ. ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామ్య విలువులని కాపాడటానికే ఈ ఎన్నికలు. ఒక పక్కేమొ ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తుండగా, మరొక పక్క కాంగ్రెస్, ఇండియా కూటమి వాటిని పరిరక్షించడానికి ప్రయత్నిస్తున్నాయి,” అని చెప్పడం మనం వినవచ్చు.

ఇందులో కొన్ని పదాలని మార్చి వీడియోని ఎడిట్ చేశారు. ఉదాహరణకు, 0:07- 0:13 టైమ్ స్టాంప్ దగ్గర “బీజేపీ మరియు ఆర్ఎస్ఎస్ “ అనే పదాల చోట “కాంగ్రెస్ మరియు ఇండియా కూటమి” అనే పదాలు జేర్చారు.

అలాగే, 0:37 దగ్గర రాహుల్ గాంధీ, “నరేంద్ర మోదీ  22-25 మందిని కోటీశ్వరులని చేశారు. అయితే, కాంగ్రెస్ పార్టీ మాత్రం కోట్ల మంది మహిళలని, యువతని కోటీశ్వరులని చేయడానికి ప్రయత్నిస్తున్నది,” అని రాహుల్ గాంధీ అంటున్న చోట ఎడిట్ చేసి తను “కాంగ్రెస్ పార్టీ 22-25 మందిని కోటీశ్వరులని చేసింది. అయితే, బీజేపీ మాత్రం కోట్ల మంది మహిళలని, యువతని కోటీశ్వరులని చేయడానికి ప్రయత్నిస్తున్నది.” అన్నట్టుగా మార్చారు.

‘బీజేపీ’, ‘ఆర్ఎస్ఎస్’, ‘రాజ్యాంగం’, ‘కాంగ్రెస్’, ‘నరేంద్ర మోదీ’ లాంటి పదాలని ఎంచుకుని, ఎడిట్ చేసి, రాహుల్ గాంధీ పాలక బీజేపీ, దాని సైద్ధాంతిక మాతృ సంస్థ అయిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కి మద్దతు తెలపమని అంటున్నట్టు ఎడిట్ చేశారు. 

ఒరిజినల్ వీడియోలో విషయాలని ది ఎకనామిక్ టైమ్స్ ఏప్రిల్ 25 నాడు ప్రచురించిన ఒక కథనంలో కూడా పేర్కొంది. రెండవ దఫా ఎన్నికలకి ముందు రాహుల్ గాంధీ ఈ వీడియో విడుదల చేశారని, హస్తం గుర్తుకి ఓటు వేయమని చెప్పారనిఈ కథనంలో ఉంది.

రాహుల్ గాంధీ బీజీపీ, ఆర్ఎస్ఎస్, నరేంద్ర మోదీలని అనేక సార్లు విమర్శించారు

తీర్పు

రాహుల్ గాంధీ వీడియోలో కొన్ని భాగాలని ఎడిట్ చేసిణ వీడియోని షేర్ చేసి, తను బీజేపీకి మద్ధతు ఇవ్వమని ప్రజలకి చెప్పారని క్లైమ్ చేశారు. కాబట్టి ఈ క్లైమ్ అబద్ధం అని మేము నిర్ధారించాము. 

(అనువాదం - గుత్తా రోహిత్)

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , অসমীয়া , తెలుగు , ಕನ್ನಡ

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.