న్యూస్ 18 వారు చేసిన ఒపీనియన్ పోల్ ఫొటో ఎడిట్ చేసి ఆంధ్రాలో వై ఎస్ ఆర్ సి పి ముందంజలో ఉందని క్లైమ్ చేశారు

ద్వారా: రోహిత్ గుత్తా
మార్చి 15 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
న్యూస్ 18 వారు చేసిన ఒపీనియన్ పోల్ ఫొటో ఎడిట్ చేసి ఆంధ్రాలో వై ఎస్ ఆర్ సి పి ముందంజలో ఉందని క్లైమ్ చేశారు

లోక్ సభ ఎన్నికలలో ఆంధ్ర ప్రదేశ్ లో వై ఎస్ ఆర్ సి పి ముందంజలో ఉందని న్యూస్ 18 వారి ఒపీనియన్ పోల్ తెలిపిందని క్లైమ్ చేసిన పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు ఫేక్

న్యూస్ 18 వారి కార్యక్రమం స్క్రీన్ షాట్ ని ఎడిట్ చేశారు. ఎన్ డి ఏ, వై ఎస్ ఆర్ సి పి ఓట్ల శాతాన్ని మార్చి వై ఎస్ ఆర్ సి పి ముందంజలో ఉన్నట్టు చేశారు.

క్లైమ్ ఐడి ba2f9be8

క్లైమ్ ఏంటి?

లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపధ్యంలో న్యూస్ 18 చానల్ వారి ఒపీనియన్ పోల్ స్క్రీన్ షాట్ ఒకటి షేర్ చేసి ఆంధ్ర ప్రదేశ్ లో వై ఎస్ ఆర్ సి పి ఎన్నికలలో ముందంజలో ఉన్నదని క్లైమ్ చేశారు. జరగబోయే లోక్ సభ ఎన్నికలలో వై ఎస్ ఆర్ సి పి కి 50 శాతం ఓట్లు వస్తాయని, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి (ఎన్ డి ఏ) 41 శాతం ఓట్లు వస్తాయని ఈ స్క్రీన్ షాట్ లో ఉంది. ఆర్కైవ్ చేసిన ఇటువంటి పోస్ట్స్ ఇక్కడ  మరియు ఇక్కడ  చూడవచ్చు. 

సామాజిక మాధ్యమ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

మేము ఏమి తెలుసుకున్నాము?

లోక్ సభ నియోజకవర్గాలకి సంబంధించి న్యూస్ 18 చేపట్టిన ‘మెగా ఒపీనియన్ పోల్స్’ ఫలితాలని నిన్న విడుదల చేశారు. ఈ పోల్స్ ప్రకారం మొత్తం 543 సీట్లలో, బిజేపి నాయకత్వం వహిస్తున్న ఎన్ డి ఏ కూటమికి 411 సీట్లు వస్తాయని, కాంగ్రెస్ నాయకత్వం వహిస్తున్న ఇండియా కూటమికి 105 సీట్లు వస్తాయని తెలిపారు.

ఆంధ్ర ప్రదేశ్ ఫలితాల కోసం మేము ఈ చానల్ వారు ప్రసారం చేసిన కార్యక్రమం, అలాగే వారి ఎక్స్ (పూర్వపు ట్విట్టర్) అకౌంట్ చూశాము.

న్యూస్ 18 వారి ఫలితాల ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్ డి ఏ కూటమికి 50 శాతం ఓట్లు, 18 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఆలాగే వై ఎస్ ఆర్ సి పి కి 41 శాతం ఓట్లు, 7 సీట్లు వచ్చే అవకాశం ఉంది. వైరల్ స్క్రీన్ షాట్ లో వై ఎస్ ఆర్ సి పి పేరు రెండవ వరుసలో ఉంది. అయితే ఒరిజినల్ వీడియోలో మొదటి వరుసలో ఉంది. పార్టీల వరుసలు మార్చటమే కాక, వారి ఓట్ల శాతాన్ని కూడా మార్చారు. మెయిన్ స్క్రీన్ లోనూ, టికర్ లోనూ అలాగే ఎడిట్ చేశారు. 

వైరల్ స్క్రీన్ షాట్, ఒరిజినల్ కార్యక్రమం స్క్రీన్ షాట్ మధ్య పోలికలు (సౌజన్యం: ఎక్స్/న్యూస్ 18/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

మార్చ్ 14, 2024 నాడు తమ వెబ్సైట్ లో ప్రచురించిన ఒక కథనం ప్రకారం, న్యూస్ 18 వారి ఒపీనియన్ పోల్స్ లో ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్ డీ ఏ కి 50 శాతం ఓట్లు, 18 సీట్లు; వై ఎస్ ఆర్ సి పి కి 41 శాతం ఓట్లు, 7 సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

తీర్పు

న్యూస్ 18 వారు నిర్వహించిన ఒపీనియన్ పోల్ కి సంబంధించిన కార్యక్రమం స్క్రీన్ షాట్ ని ఎడిట్ చేసి, ఆంధ్ర ప్రదేశ్ లో లోక్ సభ ఎన్నికలలో వై ఎస్ ఆర్ సి పి ముందంజలో ఉందని క్లైమ్ చేశారు. కాబట్టి ఈ క్లైమ్ ఫేక్ అని మేము నిర్ధారించాము. 

(అనువాదం- గుత్తా రోహిత్)

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , తెలుగు , ಕನ್ನಡ

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.