బీజేపీ ప్రశాంత్ కిషోర్ ను జాతీయ ప్రధాన అధికార ప్రతినిధిగా నియమించింది అంటూ వైరల్ అయిన ప్రకటన ఫేక్

ద్వారా: రోహిత్ గుత్తా
మే 23 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
బీజేపీ ప్రశాంత్ కిషోర్ ను జాతీయ ప్రధాన అధికార ప్రతినిధిగా నియమించింది అంటూ వైరల్ అయిన ప్రకటన ఫేక్

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను బీజేపీ జాతీయ ప్రధాన అధికార ప్రతినిధిగా నియమించింది అని క్లైమ్ చేసిన సామాజిక మాధ్యమ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు ఫేక్

ఈ ప్రకటన ఫేక్ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ తెలిపారు.

క్లైమ్ ఐడి d3de1d78

క్లైమ్ ఏంటి?

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను బీజేపీ తమ జాతీయ ప్రధాన అధికార ప్రతినిధిగా నియమించింది అంటూ మే 22, 2024 తారీఖుతో ఉన్న ఒక ప్రకటన ఎక్స్ (పూర్వపు ట్విట్టర్), ఫేస్బుక్, వాట్స్ ఆప్ లాంటి సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యింది.

ఇటువంటి పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవచ్చు. 

సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న ప్రకటన స్క్రీన్ షాట్స్ (సౌజన్యం: ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

2014లో బీజీపీ పార్టీకి పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఈ ఎన్నికలలో బీజేపీ గెలుస్తుంది అని తన అంచనా అని చెబుతున్నారు. 

అయితే, బీజేపీ ప్రశాంత్ కిషోర్ ను తమ జాతీయ ప్రధాన అధికార ప్రతినిధిగా నియమించలేదు. సర్కులేట్ అవుతున్న ప్రకటన ఫేక్.

మేము ఏమి తెలుసుకున్నాము?

ఈ ప్రకటన కోసం బీజేపీ వెబ్సైట్ లో పత్రికా ప్రకటనలు సెక్షన్, వారి సామాజిక మాధ్యమ అకౌంట్లు చూశాము. అక్కడ ఏమీ లేదు. మే 22 నాడు విడుదల చేసిన పత్రికా ప్రకటనలు అన్నీ కూడా ఎన్నికల ప్రచారానికి సంబంధించినవే. 

రాజకీయ నియామకాల గురించి చివరిగా ఇచ్చిన ప్రకటన మార్చ్ 27 తారీఖున. ఆ రోజు సిఆర్ కేశవన్ ను జాతీయ అధికార ప్రతినిధిగా నియమిస్తూ ప్రకటన విడుదల చేశారు. అదే రోజు పార్లమెంట్ ఎన్నికలకి సంబంధించి రాష్ట్రాల వారీగా నియమించిన ఇన్ ఛార్జ్ ల పేరులతో ఇంకొక ప్రకటన కూడా విడుదల చేశారు. 

బీజేపీ వెబ్సైట్ లో అధికార ప్రతినిధుల సెక్షన్ లో వారి జాతీయ ప్రధాన అధికార ప్రతినిధి, జాతీయ అధికార ప్రతినిధుల వివరాలు ఉన్నాయి. వారి జాతీయ ప్రధాన అధికార ప్రతినిధి అనీల్ బలూనీ కాగా, 29 మంది జాతీయ అధికార ప్రతినిధులు ఉన్నారు. అందులో ప్రశాంత్ కిషోర్ పేరు లేదు. 

ఈ ప్రకటన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ పేరు మీద వచ్చింది. ఈ ప్రకటన కల్పితం అని తను స్పష్టం చేశారు. లాజికల్లీ ఫ్యాక్ట్స్ తో మాట్లాడుతూ, “ఇది ఫేక్. ఇది ఫొటో షాప్ చేసింది,” అని తెలిపారు. ఈ ప్రకటనలో తీవ్రమైన దోషాలు అయితే ఏమీ లేవు కానీ, ప్రశాంత్ కిషోర్ పేరు తప్పుగా ఉంది. ఆయన పేరులో రెండవ భాగం Kishor కాగా ఇందులో Kishore అని ఉంది.

ఈ ప్రకటన గురించి ప్రశాంత్ కిషోర్ ఏమీ మాట్లాడలేదు కానీ, ఆయన రాజకీయ ప్రచార వాహనమైన 'జన్ సురాజ్' ఎక్స్ లో పోస్ట్ (ఆర్కైవ్ ఇక్కడ ) పెట్టి, ఈ వైరల్ ప్రకటనని కాంగ్రెస్ ప్రచారం చేస్తున్నదని ఆరోపించింది 

  జన్ సురాజ్ ఎక్స్ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/జన్ సురాజ్)

ప్రశాంత్ కిషోర్ 2018లో జనతాదళ్ (యునైటెడ్) పార్టీలో చేరారు. తనను అక్కడ ఉపాధ్యక్షుడిని కూడా చేశారు. అయితే 2020లో తనను పార్టీ నుండి బహిష్కరించారు. తను ఇంతక ముందు ఐప్యాక్ అనే ఎన్నికల కన్సల్టింగ్ సంస్థ నడిపేవారు. అయితే 2021లో దాని నుండి బయటకి వచ్చేసి జన్ సురాజ్ స్థాపించారు. 

తీర్పు

ఒక ఫేక్ పత్రికా ప్రకటన షేర్ చేసి, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను బీజేపీ తమ జాతీయ  ప్రధాన అధికార ప్రతినిధిగా నియమించింది అని క్లైమ్ చేశారు. అయితే, బీజేపీ అటువంటి ప్రకటన ఏమీ చేయలేదు. కాబట్టి ఈ క్లైమ్ ఫేక్ అని మేము నిర్ధారించాము.

(అనువాదం - గుత్తా రోహిత్)ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , తెలుగు , ಕನ್ನಡ

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.