నటి రష్మిక మందన్న బాడీ సూట్ లో ఉన్నట్టన్న వైరల్ వీడియో డీప్ ఫేక్

ద్వారా: అంకిత కులకర్ణి
నవంబర్ 8 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
నటి రష్మిక మందన్న బాడీ సూట్ లో ఉన్నట్టన్న వైరల్ వీడియో డీప్ ఫేక్

సామాజిక మాధ్యమాలలో వచ్చిన పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు ఫేక్

ఒరిజినల్ వీడియోలో ఉన్న మహిళ పేరు జారా పటేల్. ఈ వీడియో క్లిప్ లో ఉన్నది రష్మిక మందన్న అన్నట్టు కృత్రిమ మేధ ద్వారా ఎడిట్ చేశారు.

క్లైమ్ ఐడి e212f91b

క్లైమ్ ఏంటి?

నల్లని యోగా వస్త్రాలు ధరించి ఎలివేటర్ లోకి వస్తున్న రష్మిక మందన్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్నది. ఈ వీడియోని షేర్ చేస్తూ ఫేస్బుక్ లో ఒక యూజర్ “దేవుడా. రష్మిక మందన్న నమ్మలేకునట్టు ఉంది” అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్ ఆర్కైవ్ ఇక్కడ  చూడవచ్చు.  ఇటువంటి పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ  మరియు ఇక్కడ  చూడవచ్చు. 

వైరల్ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే ఈ వీడియో డీప్ ఫేక్ అని, కృత్రిమ మేధ ద్వారా ఈ వీడియొ తయారుచేశారని లాజికల్లీ ఫ్యాక్ట్స్ కనుగొంది.

మేము ఏమి తెలుసుకున్నాము?

ఈ వీడియోని నిశితంగా గమనిస్తే ఇందులో అనేక లొసుగులు మాకు కనిపించాయి. ఉదాహరణకి, వీడియో మొదటలో వేరే మహిళా మొహం మనకి కనిపిస్తుంది. నెమ్మదిగా మొహం కాస్త రష్మిక మొహంగా మారటం మనం చూడవచ్చు. అలాగే వీడియోలో మహిళ “నేను ఎలివేటర్ మిస్ అవ్వదలుచుకోలేదు” అని అంటున్నప్పుడు వైరల్ వీడియోలో పెదాలు సింక్ అవ్వటం లేదు.

ఈ వీడియోలోని ఒక కీఫ్రేమ్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతికితే ఈ వీడియోని ‘జారా పటేల్’ అనే యూజర్ ఇన్స్టాగ్రామ్ లో అక్టోబర్ 9, 2023 నాడు పోస్ట్ చేశారని తెలిసింది. “పాయింట్ ఆఫ్ వ్యూ: నువ్వు ఎలివేటర్ తలుపుని మళ్ళీ నా మొహం మీదే మూసేశావు..” , అని ఈ పోస్ట్ శీర్షిక ఉంది. తన ఇన్స్టాగ్రామ్ బయోలో తను “బ్రిటిష్ ఇండియన్ పాప” అని పేర్కొని ఉంది. 

ఇన్స్టాగ్రామ్ లో అక్టోబర్ లో అప్లోడ్ చేసిన ఒరిజినల్ వీడియో (సౌజన్యం: ఇన్స్టాగ్రామ్/స్క్రీన్ షాట్/zarapatelll)

వైరల్ వీడియో, ఒరిజినల్ వీడియో మధ్య పోలికలు చూసినప్పుడు జారా పటేల్ వీడియోని ఎడిట్ చేసి రష్మిక ముఖం తగిలించారు అని అర్థమయ్యింది.

ఈ వైరల్ వీడియోని ఉద్దేశించి రష్మిక తన అధికారిక సామాజిక మీడియా అకౌంట్లలో ఒక ప్రకటన చేశారు. “నాకు సంబంధించిన డీప్ ఫేక్ వీడియోని ఆన్లైన్ లో వ్యాప్తి చేయడం గురించి మాట్లాడాల్సి రావటం నాకు చాలా బాధాకరంగా ఉంది. నిజాయితీగా చెప్పాలంటే ఇది చాలా భయం గొలిపే పరిస్థితి. నాకు మాత్రమే కాదు అనేక మందికి. మాలాంటి వాళ్ళందరం కూడా సాంకేతికత దుర్వినియోగానికి బాధితులమే”, అని తను రాశారు. “ఈ విషయాన్ని మనమందరం ఒక సమూహంగా ఎదుర్కోవాలి. ఇలాంటి అస్థిత్వ చోరీకి మరింత మంది బాధితులు అవకముందే ఈ పని చేయాలి”, అని తను రాశారు. 

ఇన్స్టాగ్రామ్, ఎక్స్ లో రష్మిక పోస్ట్ చేసిన ప్రకటన (సౌజన్యం: ఇన్స్టాగ్రామ్/ఎక్స్/స్క్రీన్ షాట్)   

లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఇంతకమునుపు కూడా ఇటువంటి డీప్ ఫేక్ వీడియోలని డీబంక్ చేసింది. వాటిని ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ  చదవవచ్చు.  కృత్రిమ మేధ ద్వారా సృష్టించే డీప్ ఫేక్ ఫొటోలని, వీడియోలని ఎలా గుర్తించవచ్చో అని లాజికల్లీ ఫ్యాక్ట్స్ రాసిన వ్యాసాన్నిఇక్కడ  చదవొచ్చు. 

తీర్పు 

ఆన్లైన్ లో సర్కులేట్ అవుతున్న రష్మిక మందన్న వీడియో డీప్ ఫేక్. కాబట్టి ఈ క్లైమ్ ఫేక్ అని మేము నిర్ధారించాము.  

(అనువాదం- గుత్తా రోహిత్)

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , తెలుగు , ಕನ್ನಡ

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.