2022 నాటి వీడియో షేర్ చేసి తెలంగాణ కాంగ్రెస్ విజయం తరువాత ఇస్లాం మత వ్యాఖ్యలతో కూడిన త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారని క్లైమ్ చేశారు

ద్వారా:
డిసెంబర్ 11 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
2022 నాటి వీడియో షేర్ చేసి తెలంగాణ కాంగ్రెస్ విజయం తరువాత ఇస్లాం మత వ్యాఖ్యలతో కూడిన త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారని క్లైమ్ చేశారు

తెలంగాణలో కాంగ్రెస్ గెలవగానే జాతీయ జెండా మీద ఇస్లామిక్ మత వ్యాఖ్యలు రాశారని క్లైమ్ చేసిన సామాజిక మాధ్యమ పోస్ట్స్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

ఇది తెలంగాణలో 2022 లో జరిగిన ఒక నిరసనకి సంబంధించిన వీడియో. ఆ నిరసనలో జాతీయ జెండాలో అశోక చక్రం ప్రదేశంలో ఇస్లామిక్ మత వ్యాఖ్యలు జొప్పించారు.

క్లైమ్ ఐడి 490675c1

క్లైమ్ ఏంటి?

ఎన్నికల జరిగిన ఐదు రాష్ట్రాలలో తెలంగాణలో కాంగ్రెస్ గెలిచి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎన్నికల ఫలితాల నేపధ్యంలో ఒక వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యింది. కాంగ్రెస్ తెలంగాణలో గెలుపొందగానే జాతీయ జెండా మీద ఇస్లామిక్ మత వ్యాఖ్యలు ప్రింట్ చేశారని క్లైమ్ చేశారు.

ఈ 48 సెకన్ల వీడియోలో మనం ఒక నిరసనకారుల బృందాన్ని చూడవచ్చు. అందులో ఒకరు జాతీయ జెండాలో అశోక చక్రాన్ని తొలగించి దాని స్థానంలో ఇస్లామిక్ మత వ్యాఖ్యలు ఉన్న ఒక జెండాని ఊపటం మనం చూడవచ్చు. ఈ వీడియో జీ న్యూస్ వార్తా కథనం లాగా ఉంది. ఈ ఘటన మీద యాంకర్ సుధీర్ చౌధరీ మాట్లాడుతున్నట్టు ఈ వీడియోలో ఉంది. “ఈ రోజు జరిగిన అటువంటి ఒక నిరసనలో నిరసనకారులు జాతీయ జెండాలో ఉన్న అశోక చక్రాన్ని తొలగించి దాని స్థానంలో ఇస్లామిక్ మత వ్యాఖ్యలని జొప్పించారు (హిందీ నుండి అనువాదం),” అని సుధీర్ చౌధరీ చెప్పటం మనం వినవచ్చు.

ఈ వీడియోని సామాజిక మాధ్యమాలలో హిందూ మితవాద వర్గానికి చెందిన ఎంతో మంది “తెలంగాణలో కాంగ్రెస్ గెలవగానే భారతదేశ జెండా మీద ఇస్లామిక్ మత వ్యాఖ్యలు రాశారు. అయినా కూడా మీరు మళ్ళీ కాంగ్రెస్ నే గలిపించదాలుచుకున్నారా..(హిందీ నుండి అనువాదం),” అనే శీర్షికతో షేర్ చేశారు. అటువంటి ఒక పోస్ట్ కి ఈ ఫ్యాక్ట్ చెక్ ప్రచురించే సమయానికి లక్షనర్రకి పైగా వ్యూస్ ఉన్నాయి. అటువంటి పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ  చూడవచ్చు. 

ఎక్స్ లో వైరల్ అయిన పోస్ట్స్ స్క్రీన్ షాట్స్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే ఇది 2022 నాటి వీడియో. 2022లో తెలంగాణలో జరిగిన ఒక నిరసనలో నిరసనకారులు జాతీయ జెండాలో అశోక చక్రం స్థానంలో ఇస్లామిక్ మత వ్యాఖ్యలు ఉన్న జెండాని ఎగరవేశారు. 

మేము ఎలా తెలుసుకున్నాము?

ఇక్కడ గుర్తించాల్సిన మొదటి విషయం ఏమిటంటే సుధీర్ చౌధరీ జీ న్యూస్ లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి జూలై 2022 లో ఆజ్ టాక్ చానల్ లో చేరారు.

రెండవది, దీని గురించి కీవర్డ్స్ వాడి వెతకగా ఈ క్లిప్ జీ న్యూస్ ‘డిఎన్ఏ’ కార్యక్రమానికి చెందినదని తెలుసుకున్నాము. ఇంతకముందు ఈ కార్యక్రమాన్ని సుధీర్ నిర్వహించేవారు. ఈ కార్యక్రమాన్ని జీ న్యూస్ యూట్యూబ్ చానల్ లో జూన్ 10, 2022 నాడు అప్లోడ్ చేశారు.

దీని ద్వారా ఈ వీడియో తెలంగాణలో కాంగ్రెస్ గెలుపొందిన తరువాతది కాదని, ఒక సంవత్సరం క్రిందటి క్లిప్ అని మనకి అర్థమవుతున్నది. 

 

ఈ ‘డిఎన్ఏ’ కార్యక్రమంలో సుధీర్ ప్రోఫేట్ మహమ్మద్ కి సంబంధించి బీజేపీ నాటి అధికార ప్రతినిధి నుపుర్ శర్మ చేసిన అభ్యంతరకార్య వ్యాఖ్యలకి వ్యతిరేకంగా జరుగిన నిరసనలని తను ‘విశ్లేషించారు’. ఈ కార్యక్రమ వీడియోలో 33:14 టైమ్ స్టాంప్ నుండి వైరల్ వీడియో మొదలవుతుంది. ఇందులో సుధీర్ నిరసనలలో చోటుచేసుకున్న హింసలో ఏంఐఏం పార్టీ పాత్ర ఉందని ఆరోపించారు. దానికి ఉత్తర ప్రదేశ్ లోని సహరన్పూర్ లో జరిగిన నిరసనాలకి లంకె పెట్టారు.

దాని తరువాత “అటువంటి నిరసనలే నేడు తెలంగాణలో..” అని సుధీర్ అంతం మనం వినవచ్చు. తను జూన్ 10, 2022 నాడు తెలంగాణలోని మహబూబ్ నగర్ లో జరిగిన ఒక నిరసనలో జాతీయ జెండాలో అశోక చక్రం తొలగించి ఇస్లామిక్ మత వ్యాఖ్యలని జోడించిన  సంఘటన గురించి ప్రస్తావించారు.

జాతీయ జెండా మీద ఇస్లామిక్ మత వ్యాఖ్యలని జోడించి ఎగరవేసిన సంఘటన గురించి జూన్ 10, 2022 నాడు ఇండియా టుడే, టైమ్స్ నౌ, ది ఎకనామిక్ టైమ్స్ వార్తా కథనాలు కూడా ప్రచురించాయి.

టైమ్స్ నౌ కథనం ప్రకారం మహబూబ్ నగర్ లో ముస్లిం లు శుక్రవారం ప్రార్ధనలు అవ్వగానే నిరసనకు పూనుకున్నారు. వందల మంది ఈ నిరసనలో పాల్గొన్నారు. అందులో ఒకరు ఇస్లామిక్ మత వ్యాఖ్యలు ఉన్న జాతీయ జెండాని ఊపారు. ఈ నివేదిక ప్రకారం ఈ ఘటనకి సంబంధించిన వీడియో బయటకి రాగానే జాతీయ జెండాని అవమానించిన వారి మీద చర్యలు ఉంటాయని పోలీసులు తెలిపారు.

లాజికల్లీ ఫ్యాక్ట్స్ మహబూబ్ నగర్ మొదటి పట్టణం పోలీసులని దీని గురించి సంప్రదించింది. వారు జవాబివ్వగానే ఈ ఫ్యాక్ట్ చెక్ ని అప్డేట్ చేస్తాము. 

భారతదేశ జెండాకి సంబంధించి నియమ నిబంధనలు ఏమిటి? 

జాతీయ గౌరవానికి అవమానాన్ని నిరోధక చట్టం, 1971 ప్రకారం జాతీయ - జాతీయ జెండాతో సహా- అగౌరవపరచటం నేరం. ఎవరైనా కానీ బహిరంగ ప్రదేశంలో జాతీయ చిహ్నాలని అవమానించినా, తగలబెట్టినా, మార్పులు చేసినా, ధ్వంసం చేసినా, మాటల ద్వారా లేదా రాతల ద్వారా లేదా చేతల ద్వారా ధిక్కారానికి పాల్పడినా మూడు సంవత్సరాలు పాటు కారాగార శిక్ష లేదా జరిమానా లేదా రెండూ కూడా విధించబడుతుంది. 

తీర్పు

తెలంగాణలో కాంగ్రెస్ గెలవగానే జాతీయ జెండా మీద ఇస్లామిక్ మత వ్యాఖ్యలు రాశారని చేసిన క్లైమ్ అబద్ధం. ఇది జూన్ 2022 లో మహబూబ్ నగర్ లో జరిగిన ఒక నిరసనకి సంబంధించిన వీడియో. కాబట్టి ఈ క్లైమ్ అబద్ధం అని మేము నిర్ధారించాము. 

(అనువాదం- గుత్తా రోహిత్) 

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , অসমীয়া , తెలుగు , ಕನ್ನಡ

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.