‘భారత దేశానికి వ్యతిరేకంగా’ నినాదాలు ఇస్తున్నందుకుగానూ బిజెపి పార్లమెంట్ సభ్యులు గౌతం గంభీర్ అసహనం చెందారు అంటూ ఎడిట్ చేసిన వీడియో షేర్ చేస్తున్నారు

ద్వారా: అనురాగ్ బారువా
సెప్టెంబర్ 8 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
‘భారత దేశానికి వ్యతిరేకంగా’ నినాదాలు ఇస్తున్నందుకుగానూ బిజెపి పార్లమెంట్ సభ్యులు గౌతం గంభీర్ అసహనం చెందారు అంటూ ఎడిట్ చేసిన వీడియో షేర్ చేస్తున్నారు

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

అక్కడ నిజంగానే ‘భారత దేశానికి వ్యతిరేకంగా’ నినాదాలు చేశారా లేదా తను తన మధ్య వేలు ఎందుకు చూపించారు అనే దాంట్లో లేదు కానీ ఇది మాత్రం ఎడిటెడ్ వీడియో.

క్లైమ్ ఐడి befa656c

“కోహ్లీ- కోహ్లీ” అంటూ నినాదాలు చేస్తున్న ఒక బృందానికి మాజీ క్రికెటర్, నేటి బిజెపి పార్లమెంట్ సభ్యులు మధ్య వేలు చూపిస్తున్న ఒక వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యింది. ఇది కాండీలో సెప్టెంబర్ 2 నాడు భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన ఆసియా కప్పు మ్యాచ్ అప్పటి వీడియో అని చెబుతున్నారు. పాకిస్థాన్ కి చెందిన సామాజిక మాధ్యమ యూజర్ ఒకరు ఈ వీడియోని  ఎక్స్ (పూర్వపు ట్విట్టర్) లో సెప్టెంబర్ 4, 2023 నాడు పోస్ట్  చేశారు. ఈ ఫ్యాక్ట్ చెక్ ప్రచురించే సమయానికి ఈ వీడియోకి 237000 వ్యూస్ ఉన్నాయి. ఈ వీడియోకి కాంగ్రెస్ పార్టీ యువ విభాగం అధ్యక్షులు బివి శ్రీనివాస్ లాంటి ప్రతిపక్ష నాయకులు ప్రాచుర్యం  కలిపించారు. 

క్లైమ్ ఏంటి?

భారతదేశ న్యూస్ ఏజెన్సీ అయిన ఏఎన్ఐ తో సెప్టెంబర్ 4, 2023 నాడు మాట్లాడుతూ కాండీలో ప్రేక్షకులు- అందులో పాకిస్థాన్ ప్రేక్షకులు కూడా ఉన్నారు- ‘భారతదేశ వ్యతిరేక’ నినాదాలు ఇచ్చారు అని, అందుకే తాను అసహనానికి గురయ్యి వీడియో ఉన్నట్టు మధ్య వేలు చూపించాల్సి వచ్చింది అని బిజెపి లోక్ సభ సభ్యుడైన గౌతం గంభీర్ తెలిపారు

అయితే ఈ వీడియోలో “కోహ్లీ-కోహ్లీ” అనే నినాదం తప్ప ఇంకేమీ  స్పష్టంగా లేవు. 

ఏన్ఐ తో గౌతం గంభీర్ మాట్లాడాక ఇదే వీడియో క్లిప్ మరొక వెర్షన్ సామాజిక మాధ్యమాలలో సర్కులేట్ అవ్వటం మొదలయ్యింది. గౌతం గంభీర్ చెప్పినది నిజమేనేమో అనిపించేటట్టే ఈ వీడియోలో నినాదాలు ఉన్నాయి. “అల్లా దయతో భారతదేశాన్ని ముక్కలు ముక్కలు చేస్తాము”, అని అందులో నినాదాలు ఇస్తునట్టు ఉంది. ఈ వీడియోని పోస్ట్  చేసిన ఒక ఎక్స్ యూజర్ పోస్ట్ కి ఈ ఫ్యాక్ట్ చెక్ ప్రచురించే సమయానికి 123900 వ్యూస్ ఉన్నాయి. 

‘భారతదేశ వ్యతిరేక’ నినాదాలు ఇస్తున్నట్టున్న వీడియో షేర్ చేసిన పోస్ట్స్ స్క్రీన్ షాట్స్ (సౌజన్యం: ఎక్స్)

420000 ఫాలోవర్స్ ఉన్న ‘నరేంద్ర మోదీ ఫ్యాన్’ అనే ఒక ఎక్స్ యూజర్ ఈ వీడియోకి  ప్రాచుర్యం కలిపించారు. ఉత్తర్ ప్రదేశ్ బిజెపి యువ విభాగం సోషల్ మీడియా హెడ్ రిచా రాజ్ పుట్ కూడా ఈ వీడియో షేర్  చేశారు. 

నరేంద్ర మోదీ ఫ్యాన్, రిచా రాజ్ పుట్ ఎక్స్ లో షేర్ చేసిన పోస్ట్స్ స్క్రీన్ షాట్స్ (సౌజన్యం:ఎక్స్/@narendramodi177,@doctorrichabjp)

అయితే ‘భారత దేశ వ్యతిరేక’ నినాదాలు వినిపిస్తున్నట్టున్న వీడియో ఎడిటెడ్ వీడియో. దిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జెఎన్యూ) లో 2016లో కొంత మంది చేసిన నినాదాలని ఆరోపణలు ఉన్న నినాదాలని ఈ వీడియోలోకి ఇన్సర్ట్ చేశారు. 

మేము ఏమి కనుగొన్నాము?

ఫిబ్రవరి 15, 2016 నాడు ఆజ్ తక్ హిందీ ఛానల్ తమ అధికారిక యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసిన వీడియో ఒకటి మాకు దొరికింది. జెఎన్యూలో ఆ సమయంలో జరిగిన ఒక నిరసనలో ‘భారత దేశ వ్యతిరేక’ నినాదాలు చేశారు అని మితవాద విద్యార్ధి సంఘమైన అఖిల భారతీయ విద్యార్ధి పరిషద్ (ఏబివిపి) ఆరోపించింది. ఈ యూట్యూబ్ వీడియో వివరణలో ఆజ్ తక్ ఇలా రాసుకొచ్చింది, “ఈ వీడియోలో కొంతమంది జెఎన్యూ విద్యార్ధులు ‘భారత దేశ వ్యతిరేక’ నినాదాలు ఇస్తున్నారని ఆరోపిస్తూ ఏబివిపి ఒక వీడియో విడుదల చేసింది”. ఈ వీడియోలో 33 సెకన్ల దగ్గర “భారత దేశామా నిన్ను ముక్కలు చేస్తాము..” అని వినిపిస్తుంది. ఇదే మనకి పైన పేర్కొన్న వైరల్ వీడియోలో కూడా వినిపిస్తుంది. 

2016లో వైరల్ అయిన ఈ ఆజ్ తక్ వీడియోలో ఇస్తున్న నినాదాల స్వరం, శృతి కూడా వైరల్ వీడియోలో వాటి లెక్కనే ఉన్నాయి. అలాగే ఈ రెండు వీడియోలలో ఈ నినాదాలు ఇస్తున్న వారి స్వరం కూడా ఒకటే. దీనిబట్టి ఈ 2016 నాటి క్లిప్ ని గౌతం గంభీర్ మధ్య వేలు చూపిస్తున్నట్టు ఉన్న వీడియోలోకి ఇన్సర్ట్ చేశారని స్పష్టంగా తెలుస్తున్నది. 

మ్యాచ్ లో ‘భారత దేశ వ్యతిరేక నినాదాలు’ చేశారా?

ఏఎన్ఐ తో తను మాట్లాడిందే కాక మ్యాచ్ లో ‘భారత దేశ వ్యతిరేక’ నినాదాలు చేశారు అని గౌతం గంభీర్ తన ఎక్స్ లో సెప్టెంబర్ 4, 2023 నాడు పోస్ట్ చేశారు. “మనకి కనిపించేదే వాస్తవం కాదు. మన దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న సందర్భంలో ఏ భారతీయలైనా ఎలా స్పందిస్తారో నేను అలాగే స్పందించాను”, అని ఆయన పోస్ట్ చేశారు. 

అయితే మ్యాచ్ అయిపొగానే వచ్చిన మొట్టమొదటి వీడియోలో గౌతం గంభీర్ చుట్టూ ఉన్న జనం “కోహ్లీ-కోహ్లీ” అని అరుస్తూ ఉన్న వీడియో.ఈ వీడియోని మొదటిసారి ఎక్స్ లో పోస్ట్ చేసింది సెప్టెంబర్ 4, 2023 నాడు సాయంత్రం 6:30కి. అదే రోజు గౌతం గంభీర్ ఏఎన్ఐ తో మాట్లాడాక, ఒక రెండు గంటల తరువాత అంటే దాదాపు 8:30 కి ఈ ‘భారత దేశ వ్యతిరేక’ నినాదాలు ఉన్న వీడియో సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొట్టడం మొదలుపెట్టింది. ఇదే ఆ సంఘటన “నిజమైన” వీడియో అంటూ కొంతమంది యూజర్లు రాసుకొచ్చారు. 

ఆ మ్యాచ్ లో ఆ రోజు అసలు ఏమయ్యింది అనే దాంట్లో ఇప్పటికీ స్పష్టత లేదు. ఆ రోజు ప్రేక్షకులు “కోహ్లీ-కోహ్లీ” అని నినాదాలు ఇచ్చారా లేదా ప్రేక్షకులు ఇస్తున్న ‘భారత దేశ వ్యతిరేక’ నినాదాలలో ఒక భాగాన్ని గౌతం గంభీర్ విన్నారా అనే విషయాన్ని లాజికల్లీ ఫ్యాక్ట్స్ చెప్పలేకున్నది. 

శ్రీలంక కి చెందిన క్రీడా విలేఖరి నిబ్రాజ్ రంజాన్ సెప్టెంబర్ 5, 2023 నాడు తన ఎక్స్ లో ఒక పోస్ట్ పెట్టారు. ఆ రోజు మ్యాచ్ లో ‘భారత దేశ వ్యతిరేక’ నినాదాలు ఇచ్చారు అనే విషయాన్ని ఆ పోస్ట్ లో ఆయన తోసిపుచ్చారు. “కోహ్లీ-కోహ్లీ” అంటూ ప్రేక్షకులు నినాదాలు ఇస్తున్నట్టు ఉన్న వీడియో తీసిన శ్రీలంక ప్రేక్షకుని పక్కనే తన ఇద్దరు కజీన్స్ కూర్చుని ఉన్నారని, భారత దేశ ప్రేక్షకులు కేవలం “కోహ్లీ-కోహ్లీ” అని మాత్రమే నినాదాలు ఇచ్చారని తన కజిన్స్ విన్నారని ఆయన తన పోస్ట్ లో రాశారు.   

నిబ్రాజ్ రంజాన్ ఎక్స్ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/@nibraz88cricket)

గౌతం గంభీర్ విరాట్ కోహ్లీ మధ్య మైదానంలో గొడవలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. గౌతం గంభీర్ ని వెక్కిరించడానికి కోహ్లీ అభిమానులు “కోహ్లీ-కోహ్లీ” అని తన దగ్గర అరిసిన సందర్భాలు ఉన్నాయి. ఇద్దరి మధ్య తీవ్ర విబేధాలు పొడచూపిన సందర్భాలూ ఉన్నాయి. మొదటిసారిగా 2013 లో ఐపిఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ -రాయల్ ఛాలంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగుతున్న సందర్భంలో ఒకరిని ఒకరు తోసుకున్నారు. 

తీర్పు

మ్యాచ్ జరుగుతున్నప్పుడు ‘భారత్ దేశ వ్యతిరేక’ నినాదాలు చేశారా లేదా, లేకపోతే ఏ కారణంగా గౌతం గంభీర్ అసహనానికి గురయ్యారు అనే విషయాల మీద స్పష్టత లేదు కానీ “భారత్ దేశమా నిన్ను ముక్కలు చేస్తాము..” అని అన్నప్పుడు గౌతం గంభీర్ మధ్య వేలు చూపిస్తున్నాడు అంటూ వైరల్ అయిన వీడియో మాత్రం ఎడిటెడ్ వీడియో. కాబట్టి ఈ క్లైమ్ అబద్ధం అని మేము నిర్ధారిస్తున్నాము. 

 

అనువాదం- గుత్తా రోహిత్ 

ఈ వాస్తవ తనిఖీని చదవండి

অসমীয়া , हिंदी , తెలుగు

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.