ఎడిట్ చేసిన వార్తా కథనం షేర్ చేసి ‘మహాసేన’ రాజేష్ దొంగతనం చేస్తూ పట్టుబడ్డారని క్లైమ్ చేశారు

ద్వారా: రోహిత్ గుత్తా
ఫిబ్రవరి 29 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
ఎడిట్ చేసిన వార్తా కథనం షేర్ చేసి ‘మహాసేన’ రాజేష్ దొంగతనం చేస్తూ పట్టుబడ్డారని క్లైమ్ చేశారు

తమిళనాడులో ఒక ఇంట్లో దొంగతనం చేస్తూ తెలుగుదేశం- జనసేన ఉమ్మడి అభ్యర్ధి ఒకరు పట్టుబడ్డారని క్లైమ్ చేసిన సామజిక మాధ్యమ పోస్ట్స్ స్క్రీన్ షాట్స్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

వార్తా కథనం క్లిప్ లో నిందితుని పేరు ఎడిట్ చేసి, తెలుగుదేశం- జనసేన ఉమ్మడి అభ్యర్ధి అయిన ‘మహాసేన’ రాజేష్ పేరు జొప్పించారు.

క్లైమ్ ఐడి 43dc5e57

క్లైమ్ ఏంటి?

రానున్న ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో పి. గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం- జనసేన ఉమ్మడి అభ్యర్ధి అయిన దళిత కులానికి చెందిన సరిపెళ్ల రాజేష్ ఫోటోతో కూడిన ఆంధ్రజ్యోతి దినపత్రిక వార్తా కథనం ఒకటి షేర్ చేసి తమిళనాడులో ఒక ఇంట్లో దొంగతనం చేస్తూ తను పట్టుబడ్డాడని సామాజిక మాధ్యమాలలో క్లైమ్ చేశారు.

తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో ఒక ఇంట్లో ఒక వ్యక్తి దొంగతనానికి వెళ్ళగా, అక్కడ నగదు కానీ బంగారం కానీ లభించకపోవటంతో వెనక్కి తిరిగి వస్తున్నప్పుడు వంటింట్లో నుండి చేపల పులుసు వాసన రావటంతో, ఆ పులుసు తిని, ఇంటి టెర్రాస్ మీద నిద్రపోయాడని, ఆ తరువాత రోజు ఉదయం ఇంటి యజమానికి నిద్రపోతు పట్టుబడ్డాడని ఈ వార్తా కథనంలో ఉంది. ఈ కథనంలో చివరి వ్యాఖ్యలో సరిపెళ్ల రాజేష్ ఈ నిందితుడు అని ఉంది. అటువంటి పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ  చూడవచ్చు. 

ఆంధ్రజ్యోతి వార్తా కథనం అని చెబుతూ షేర్ చేసిన సామాజిక మాధ్యమ పోస్ట్స్ స్క్రీన్ షాట్స్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఈ ఘటన గురించి వచ్చిన వార్తా కథనాన్ని ఎడిట్ చేసి, ‘మహాసేన’ రాజేష్ పేరు జొప్పించారని లాజికల్లీ ఫ్యాక్ట్స్ కనుగొంది.

మేము ఏమి తెలుసుకున్నాము?

ఈ స్క్రీన్ షాట్ ని జాగ్రత్తగా గమనిస్తే అందులో సరిపెళ్ల రాజేష్ పేరు ఉన్న చివరి రెండు వ్యాఖ్యల ఫాంట్ ఆ కథనంలో ఉన్న ఇతర వ్యాఖ్యల ఫాంట్ కంటే భిన్నంగా ఉందని అర్థంఅవుతున్నది. ఈ రెండు వ్యాఖ్యల ఫాంట్ కొంచం పెద్దగా, ప్రకాశవంతంగా, ఒక పక్కకి ఒరుగుతున్నట్టుగా ఉంది. దీని బట్టి ఈ రెండు వ్యాఖ్యలని జొప్పించారు అనేది తెలుస్తున్నది. 

వైరల్ వార్తా కథనంలో చివరి రెండు వ్యాఖ్యలలో వాడిన ఫాంట్ లోని లొసుగులు (సౌజన్యం: ఎక్స్)

కీ వర్డ్స్ వాడి వాస్తవమైన కథనాన్ని మేము సెర్చ్ చేశాము. ఈ ఘటన గురించి ఆంధ్రజ్యోతి జూన్ 16, 2020 నాడు ఒక కథనాన్ని ప్రచురించింది. చివరి రెండు వ్యాఖ్యలు తప్ప, ఈ కథనంలో ఉన్న సమాచారం, పైన పేర్కొన్న సమాచారం ఒకటే. ఈ కథనంలో దొంగతనానికి యత్నించిన వ్యక్తి పేరు సతీష్ అని ఉంది. ఇంట్లో ఉన్న సీసీటీవీ కెమెరా ఈ ఘటనని రికార్డ్ చేసిందని, ఈ ఫుటేజీ వాడి దొంగని పట్టుకున్నారని కూడా ఈ కథనంలో ఉంది.

టైమ్స్ ఆఫ్ ఇండియా వారికి చెందిన సమయం వెబ్సైట్ కూడా ఈ ఘటన గురించి జూన్ 16, 2020 నాడు రిపోర్ట్ చేసింది. ఆంధ్రజ్యోటి కథనంలో ఉన్న వివరాలే ఇందులో కూడా ఉన్నాయి. ఈ కథనంలో కూడా నిందితుని పేరు సతీష్ అని ఉంది. అలాగే సీసీటీవీ ఫుటేజీ నుండి తీసుకున్న అతని ఫొటో కూడా ఈ కథనంలో జతపరిచారు. ఈ ఘటన గురించి ఈటీవీ భారత్ లో జూన్ 17, 2020 నాడు వచ్చిన కథనంలో పోలీసు అధికారులని ఉటంకిస్తూ నిందితుడు కేరళలోని తిరువనంతపురం జిల్లాకి చెందిన నెడుంకాడు చెందిన వ్యక్తి అని తెలిపారు. 

తమిళనాడులో జరిగిన దొంగతనం యత్నం కేసులో నిందితుని ఫొటో (సౌజన్యం: ఈటీవీ భారత్/స్క్రీన్ షాట్)

వీటి బట్టి తమిళనాడులో దొంగతనం యత్నానికి సంబంధించిన ఘటనలో నిందితుడు ‘మహాసేన’ రాజేష్ కాదని స్పష్టమవుతున్నది.

తీర్పు

ఎడిట్ చేసిన వార్తా కథనం షేర్ చేసి రానున్న ఎన్నికలలో పి. గన్నవరం నియోకావర్గం నుండి తెలుగుదేశం- జనసేన ఉమ్మడి అభ్యర్ధి అయిన సరిపెళ్ల రాజేష్ తమిళనాడులో ఒక ఇంట్లో దొంగతనం చేస్తూ పట్టుబడ్డారని క్లైమ్ చేశారు. కాబట్టి ఈ క్లైమ్ అబద్ధం అని మేము నిర్ధారించాము. 

(అనువాదం- గుత్తా రోహిత్)

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , తెలుగు , ಕನ್ನಡ

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.