కాంగ్రెస్ పార్టీ సమావేశంలో జరిగిన గొడవ వీడియోని ఆంధ్రాలో పాలక పార్టీ కార్యకర్తల మధ్య గొడవగా షేర్ చేశారు

ద్వారా: రోహిత్ గుత్తా
నవంబర్ 15 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
కాంగ్రెస్ పార్టీ సమావేశంలో జరిగిన గొడవ వీడియోని ఆంధ్రాలో పాలక పార్టీ కార్యకర్తల మధ్య గొడవగా షేర్ చేశారు

సామాజిక మాధ్యమ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

కూకట్ పల్లిలో ఎన్నికలకి సంబంధించి జరిగిన సమావేశంలో కాంగ్రెస్ కార్యకర్తల మధ్య జరిగిన గొడవ వీడియో ఇది.

క్లైమ్ ఐడి 81f5266e

క్లైమ్ ఏమిటి?

వై ఎస్ ఆర్ సి పి పార్టీ సామాజిక సాధికార యాత్రలో ఆ పార్టీ కార్యకర్తలు మద్యం, ఆహారం కోసం కొట్టుకుంటున్న వీడియో అంటూ ఒక నలుపు-తెలుపు  వీడియోని ఒక యూజర్ ఎక్స్ (పూర్వపు ట్విట్టర్) లో షేర్ చేశారు. 

1:42 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో ఒక పెద్ద బృందం డైనింగ్ హాల్ లాగా కనిపిస్తున్న ఒక ప్రదేశంలో తమలో తాము కొట్టుకోవటాన్ని మనం చూడవచ్చు. ఈ వీడియోని నవంబర్ 6, 2023, నాడు షేర్ చేసి “కాకినాడ సామాజిక సాధికార యాత్రలో ఆహారం, మద్యం కోసం కొట్టుకుంటున్న వై ఎస్ ఆర్ సి పి కార్యకర్తలు” అని శీర్షిక పెట్టారు. ఈ పోస్ట్ ఆర్కైవ్ ఇక్కడ  చూడవచ్చు. 

సామాజిక మాధ్యమాలలో పెట్టిన పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే ,ఇది హైదరాబాద్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక సమావేశంలో కార్యకర్తలు కొట్టుకుంటున్న వీడియో.

మేము ఏమి తెలుసుకున్నాము?

ఈ వీడియో ఫ్రేమ్స్ ని జాగ్రత్తగా గమనిస్తే 1:40-1:42 మధ్య ఒక వ్యక్తి వేసుకున్న కండువా మీద చేయి గుర్తుని పోలిన చిన్న గుర్తు ఒకటి  మసకగా కనిపించింది. అలాగే ఈ పోస్ట్ కింద ఒక కామెంట్ లో ఒక యూజర్ ఇది కూకట్ పల్లిలో జరిగిన కాంగ్రెస్ సమావేశానికి సంబంధించిన వీడియో అని కామెంట్ చేశారు. 

వైరల్ వీడియో స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్)

అప్పుడు మేము కూకట్ పల్లి కాంగ్రెస్ సమావేశంలో గొడవ గురించిన వార్తా కథనాలు వెతికాము. అప్పుడు ఈ నలుపు-తెలుపు వీడియో ఒరిజినల్ కలర్ వెర్షన్ మాకు లభించింది. ‘తెలుగు స్క్రైబ్’ అనే ఒక ఎక్స్ యూజర్ ఈ వీడియోని నవంబర్ 6, 2023 నాడు పోస్ట్ చేశారు. కూకట్ పల్లిలో భోజనాల కోసం కొట్టుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు”, అనేది ఈ వీడియో శీర్షిక.

ఈ ఘటన గురించి ఈటీవీ భారత్ తెలుగు, టి న్యూస్ కథనాలు కూడా మాకు లభించాయి. కూకట్ పల్లి కాంగ్రెస్ అభ్యర్ధి ఎన్నికలకి సంబంధించి ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో భోజనానికి సంబంధించిన వరుసలో ఇరు బృందాల మధ్య మొదలయ్యిన గొడవ చినికి చినికి గాలి వానయ్యిందని ఈటీవీ భారత్ తన కథనంలో పేర్కొంది.

ఈ వార్తా కథననానికి ఒరిజినల్ వీడియోని జోడించారు. టి న్యూస్ కూడా వేరే వైపు నుండి తీసిన ఇదే వీడియోని తమ యూట్యూబ్ చానల్ లో నవంబర్ 6, 2023 నాడు అప్లోడ్ చేశారు. “కూకట్ పల్లిలో కాంగ్రెస్ సమావేశం జరుగుతుండగా ఇరు వర్గాల మధ్య మొదలయ్యిన గొడవ వారి మధ్య కొట్లాటకి దారి తీసింది”, అని యాంకర్ ఈ వీడియోలో తెలిపారు. 

వైరల్ వీడియో, ఒరిజినల్ వీడియో మధ్య పోలిక (సౌజన్యం: ఎక్స్/ ఈటీవీ భారత్/స్క్రీన్ షాట్స్)

తీర్పు 

హైదరాబాద్ లో కాంగ్రెస్ కార్యకర్తల మధ్య జరిగిన గొడవ వీడియోని వై ఎస్ ఆర్ సి పి కార్యకర్తలు మద్యం, ఆహారం కోసం కొట్టుకుంటున్న వీడియోగా షేర్ చేశారు. కాబట్టి ఈ క్లైమ్ అబద్ధం అని మేము నిర్ధారించాము. 

(అనువాదం- గుత్తా రోహిత్)

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , తెలుగు , ಕನ್ನಡ

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.