ఈవీఎం పగలగొట్టి కెమెరాకి చిక్కిన వైఎసార్సీపి నాయకుడి లాయర్ గా పాత్రికేయుడు ఫొటోని షేర్ చేశారు

ద్వారా: రాజేశ్వరి పరస
మే 28 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
ఈవీఎం పగలగొట్టి కెమెరాకి చిక్కిన వైఎసార్సీపి నాయకుడి లాయర్ గా పాత్రికేయుడు ఫొటోని షేర్ చేశారు

పిన్నెల్లి లాయర్ నిరంజన్ రెడ్డి అంటూ షేర్ చేసిన పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

వైరల్ ఫొటోలో ఉన్నది, తెలుగు పోస్ట్ ఎడిటర్. ఎంఎల్ఏ పిన్నెల్లి రామకృష్ణకి సంబందించిన ఈవీఎం కేసు న్యాయవాది కాదు.

క్లైమ్ ఐడి 5a468a12

క్లెయిమ్ ఏమిటి?

సామాజిక మాధ్యమాలలో కొంత మంది యూజర్లు ఒక ఫొటోల సమూహాన్ని షేర్ చేసి (ఆర్కైవ్ ఇక్కడ మరియు ఇక్కడ) అందులో నీలం రంగు చొక్కా ధరించిన వ్యక్తి ఎంఎల్ఏ పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి న్యాయవాది నిరంజన్ రెడ్డి అని పేర్కొన్నారు. పిన్నెల్లి రామ కృష్ణ రెడ్డి, వైఎసార్సీపి చెందిన మాచర్ల నియోజకవర్గం శాసన సభ్యుడు. మే 13 నాడు, ఆంధ్ర ప్రదేశ్ లో శాసన సభ మరియు లోక్ సభ ఎన్నికలు జరిగాయి, ఆ సమయం లో పిన్నెల్లి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను ధ్వంసం చేస్తున్నట్టుగా ఒక వీడియో వైరల్ అయింది.

వైరల్ అవుతున్న ఫొటోల సమూహంలో తెల్ల దుస్తులు ధరించిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సలహా దారుడు సజ్జల రామకృష్ణ రెడ్డి మరియు తెలుగు సినిమా అయిన అతడు నుంచి ఒక సన్నివేశం ఫొటో ఉన్నాయి.  ఆన్లైన్లో ఒక యూసర్ ఈ ఫొటోని షేర్ చేసి, పిన్నెల్లి లాయర్ కోర్ట్ లో ఈవీఎం ను ధ్వంసం చేస్తున్న వీడియో ఫేక్ అంటూ వాదించారు అని తెలిపారు. 


ఆన్లైన్ లో వైరల్ అవుతున్న క్లెయిమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

కానీ వైరల్ అవుతున్న ఫొటోలో ఉన్నది పిన్నెల్లి లాయర్ కాదు. ఈయన తెలుగు కు చెందిన ఒక సీనియర్ పాత్రికేయుడు.

వాస్తవం ఏమిటి ? 

వైరల్ అవుతున్న ఫొటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఈ ఫొటో ఒక తెలంగాణ ఆధారిత వార్త మరియు నిజ నిర్ధారణ చేసే సంస్థ అయిన తెలుగు పోస్ట్ వెబ్సైటు ఎడిటర్ కి చెందినది అని అర్థమైంది. ఇక్కడ అచ్చం వైరల్ అవుతున్న ఫొటోనే, స్టాఫ్ సెక్షన్ లో ఉంది, ఆ వెబ్సైటు ప్రకారం, ఫొటోలో ఉన్న వ్యక్తి తెలుగు పోస్ట్ ఎడిటర్, రవి బట్చలి అని ఆయన గత 30 సంవత్సరాలుగా పాత్రికేయుడిగా ఉన్నారని అర్ధమయింది.

తెలుగు పోస్ట్ వెబ్సైటు లో రవి బట్చలి ప్రొఫైల్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : తెలుగు పోస్ట్)

లాజికల్లీ ఫ్యాక్ట్స్ రవి బట్చలిని సంప్రదించింది, ఆయన మాతో మాట్లాడుతూ, తప్పుగా ఆయన ఫొటో ప్రచురించారు అని తెలిపారు. “నేను ఎప్పుడు లా స్కూల్ కి వెళ్ళటం కానీ, ఏదైనా లా కి సంబంధించిన చదువులు చదవటం కుడా చెయ్యలేదు. నేను గత 30 సంవత్సరాలుగా పాత్రికేయుడుగానే ఉన్నాను. మేము ఎక్స్ (పూర్వపు ట్విట్టర్) కి కుడా దీని గురించి తెలియజేశాము,” అని తెలిపారు.

టైమ్స్ అఫ్ ఇండియా లాంటి కొన్ని వార్త సంస్థలు, నిరంజన్ రెడ్డి అనే న్యాయవాది పేరును ఈ కేసులు ప్రచురించాయి, కానీ ఆయనకు చెందిన ఫొటోలు లభించలేదు. మేము కోర్టు రికార్డులను చూసి ఈ కేసులో అధికారికంగా అడ్వకేట్ రామలక్ష్మణ రెడ్డి సానెపల్లి అనే వ్యక్తి ఉన్నారని తెలుసుకున్నాము.

లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఆంధ్ర ప్రదేశ్ హై కోర్ట్ న్యాయవాది ఆర్ యెల్లా రెడ్డి ని సంప్రదించింది, ఈయన వైఎసార్సీపి కి చెందిన కేసులను చూస్తుంటారు. ఆయన మాతో మాట్లాడుతూ, ప్రస్తుతం వైరల్ వీడియోలో ఉన్న వ్యక్తి నిరంజన్ రెడీ కానీ రామలక్ష్మణ రెడ్డి సానెపల్లి కానీ కాదు అని తెలియజేసారు.

ఈ కేసు గురించి మాట్లాడుతూ, యెల్లా రెడ్డి, “సీనియర్ కౌన్సెల్ అయిన టి నిరంజన్ రెడ్డి ఈ కేసులో వాదనలను వినిపించారు. ఒక్కోసారి ఒక అడ్వకేట్ పిటిషన్ దాఖలు చేస్తే, మరో సీనియర్ కౌన్సెల్ కోర్టులో వాదనలు చేస్తారు,” అని కుడా వివరించారు.

ఈవీఎం ధ్వంసం కేసు 

మాచెర్ల నియోజకవర్గానికి చెందిన  వైఎసార్సీపి ఎంఎల్ఏ పిన్నెల్లి రామకృష్ణ మే 13 నాడు ఒక గదికి వెళ్లి ఈవీఎం లు పగలగొడుతున్నట్టుగా వీడియో వైరల్ అయింది. ఎన్నికల సంఘం ఆ ఎంఎల్ఏ పైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది, ఆయన ఈ ఘటన తరువాత పరారీలో ఉన్నట్టు కుడా ప్రచురించారు. ది హిందూ కథనం ప్రకారం, వెంటనే, ఎంఎల్ఏ తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయవలసిందిగా కోరగా, ఆంధ్ర హై కోర్ట్ జూన్ 6 వరకు మంజూరు చేసింది.

హిందుస్థాన్ టైమ్స్ ప్రకారం, ఇంటెరిమ్ బెయిల్ పెటేషన్ వాదనలో పిన్నెల్లి లాయర్ నిరంజన్ రెడ్డి వాదిస్తూ, ఎన్నికల సంఘం తెలుగు దేశం పార్టీ నాయకుడు ఫిర్యాదు మేరకు ఈ విధంగా చర్యలు తీసుకుంది అని, కానీ ప్రతిపక్షాలకు మోసపూరితమైన ఆలోచనలు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి, దానిని ఎడిట్ చేసి ఉండవచ్చు అని వాదించారు అని పేర్కొంది.

తీర్పు

సీనియర్ పాత్రికేయుడు రవి బట్చలిని పిన్నెల్లి రామకృష్ణ లాయర్ నిరంజన్ రెడ్డి గా గుర్తించారు.  కనుక మేము దీనిని అబద్ధం అని పేర్కొన్నాము.

(అనువాదం : రాజేశ్వరి పరసా)

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , తెలుగు , ಕನ್ನಡ

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.