ప్రస్తుతం జరుగుతున్న రైతు ఉద్యమంలో పోలీసు అధికారిని ట్రాక్టర్ తో తొక్కించి చంపలేదు

ద్వారా: మహమ్మద్ సల్మాన్
ఫిబ్రవరి 22 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
ప్రస్తుతం జరుగుతున్న రైతు ఉద్యమంలో పోలీసు అధికారిని ట్రాక్టర్ తో తొక్కించి చంపలేదు

వైరల్ పోస్ట్స్ స్క్రీన్ షాట్స్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

ఆగస్ట్ 2023లో ఒక ట్రాక్టర్ కింద పడి చనిపోయిన ఒక వ్యక్తి వీడియో ఇది. తాను పోలీసు అధికారు కాదు. ప్రస్తుతం జరుగుతున్న రైతు ఉద్యమానికి దీనికి సంబంధం లేదు.

క్లైమ్ ఐడి 3a37a501

(గమనిక: ఈ కథనంలో ఇబ్బంది పెట్టే విజువల్స్ ఉన్నాయి. పాఠకులు గమనించగలరు.)

క్లైమ్ ఏమిటి?

ఒక ట్రాక్టర్ ట్రాలీ కింద పడి చనిపోయిన ఒక వ్యక్తి వీడియోని ప్రస్తుతం జరుగుతున్న రైతు ఉద్యమానికి ముడి పెట్టి షేర్ చేస్తున్నారు. ఉద్యమం చేస్తున్న రైతులు- కొంతమంది సామాజిక మాధ్యమ యూజర్లు వీరిని ‘ఖలిస్తానీ తీవ్రవాదులు’ అని పిలుస్తున్నారు- హర్యాణాకి చెందిన ఒక పోలీసు అధికారిని ట్రాక్టర్ ఎక్కించి హత్య చేశారు అనే ఉద్దేశం వచ్చేలా పోస్ట్లు పెట్టారు. ‘ముందస్తు ప్రణాళిక’ తోనే ఇలా చేశారు అని కూడా కొంత మంది క్లైమ్ చేశారు. ఇటువంటి పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ  చూడవచ్చు. 

పంజాబ్ - హర్యాణా సరిహద్దులో ఉన్న శంభు ప్రాంతాన్ని దాటుకుని దిల్లీ వైపు వచ్చే ప్రయత్నాలు చేస్తున్న రైతులపై ఫిబ్రవరి 13 నాడు బాష్పవాయువు ప్రయోగించినాక ఈ క్లైమ్ సర్కులేట్ అవ్వటం మొదలుపెట్టింది. 

వైరల్ పోస్ట్స్ స్క్రీన్ షాట్స్ (సౌజన్యం: ఎక్స్/స్క్రీన్ షాట్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే ఈ వైరల్ వీడియో ప్రస్తుతం జరుగుతున్న రైతు ఉద్యమానికి సంబంధించినది కాదు. ఇది ఆగస్ట్ 2023 నాటిది. ఆ సమయంలో పంజాబ్ లోని సంగ్రూర్ లో రైతులు, పోలీసుల మధ్య జరిగిన ఒక గొడవలో ఒక వ్యక్తి ట్రాక్టర్ కింద పది మరణించాడు. ఇది ఆ వీడియో.

మేము ఏమి తెలుసుకున్నాము?

ఈ వీడియోని జాగ్రత్తగా గమనిస్తే ఈ వీడియోలో ఎడమ పై భాగాన మూలలో ‘’@Gagan4344’ అనే వాటర్ మార్క్ కనిపించింది. గగన్ దీప్ సింగ్ అనే ఎక్స్ యూజర్ ఇదే వీడియోని ఆగస్ట్ 21, 2023 నాడు పోస్ట్ చేశారని తెలుసుకున్నాము. తన బయో ప్రకారం గగన్ దీప్ సింగ్ పాత్రికేయుడు. 

“చండీఘడ్ లో ఒక నిరసనలో పాల్గొనటానికి వెళుతున్న రైతులకి, పంజాబ్ పోలీసులకి సంగ్రూర్ జిల్లాలో లొంగొవాల్ గ్రామంలో ఘర్షణ జరిగినది. ఈ ఘర్షణలో ఒక యువకుడు ట్రాక్టర్ ట్రాలీ కింద ఇరుక్కుపోయి ఒక కాలు కోల్పోయాడు, ఆ తరువాత వైద్యం జరుగుతున్నప్పుడు మరణించాడు. ఒక పోలీసు అధికారి తీవ్రంగా గాయపడ్డాడు”, అనేది ఈ వీడియో పోస్ట్ శీర్షిక.

ఈ సంఘటన గురించి నవ భారత్ టైమ్స్, పిటిసి పంజాబ్, ది ట్రిబ్యూన్, ది ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి మీడియా సంస్థలలో వార్తా కథనాలు వచ్చాయి.

ఆగస్ట్ 21, 2023 నాడు పిటిసి పంజాబ్ లో వచ్చిన వార్తా కథనం ప్రకారం, వరదల కారణంగా పంట నష్టపోయిన రైతులకి పరిహారం అందించాలి అనే డిమాండ్ తో చండీఘడ్ లో జరుగుతున్న రైతు సంఘాలు తలపెట్టిన నిరసన కార్యక్రమానికి పంజాబ్ నుండి రైతులు బయలదేరారు. అలా వెళుతున్నప్పుడు సంగ్రూర్ జిల్లాలో లొంగొవాల్ గ్రామంలో రైతులు, పంజాబ్ పోలీసుల మధ్య ఘర్షణ జరిగి, తొక్కిసలాటకి దారి తీసింది. ఈ తొక్కిసలాటలో 70 సంవత్సరాల ప్రీతం సింగ్ అనే వ్యక్తి ట్రాక్టర్ కింద నలిగిపోయారు. ఆ తరువాత మరణించారు. 

వైరల్ వీడియోలో ఉన్న విజువల్స్ పిటిసి వార్తా కథనంలో కూడా ఉన్నాయి (సౌజన్యం: పిటిసి పంజాబ్/స్క్రీన్ షాట్స్)

నిరసన చేస్తున్న రైతులు బర్బర్ టోల్ ప్లాజా, బర్నాలా - సంగ్రూర్ జాతీయ రహదారి వైపు వెళ్లారని, మరింత ముందుకు వెళ్ళకుండా పోలీసులు అడ్డుపడ్డారని ఈ కథనంలో ఉంది. పోలీసు బ్యారికేడ్లను తొలగించి రైతులు తమ ట్రాక్టర్ లతో ముందుకు కదిలినప్పుడు పోలీసులు బల ప్రయోగం చేశారని ఈ కథనంలో ఉంది. 

ఈ గొడవలో ప్రీతం సింగ్ కాలు ట్రాక్టర్ ట్రాలీ కింద ఇరుక్కుపోయింది. తనని పాటియాలాలోని రాజిందర్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ మరణించారు.

భారతీయ కిసాన్ ఆందోళన్ (ఆజాద్) అనే రైతు సంఘం లొంగొవాల్ గ్రామంలో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుందని సంగ్రూర్ సీనియర్ సూపర్ ఇంటెండెంట్ ఆఫ్ పోలీస్ సురేంద్ర లాంబా పేర్కొన్నారని ఈ కథనంలో ఉంది.

వేరే కోణాల నుండి తీసిన ఇదే వీడియో మాకు మరొకటి దొరికింది. సంగ్రూర్ పోలీసు ఆగస్ట్ 21, 2023 నాడు ఈ వీడియోని తమ ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియో పోస్ట్ చేసి, ఈ వీడియో బట్టి నిరసనకారులు తొలుతున్న ట్రాక్టర్ కిందనే ప్రీతం సింగ్ ఇరుక్కున్నారు అనేది స్పష్టం అవుతున్నదని తెలిపారు. ఈ ఘటనలో ఒక పోలీసు ఇన్స్పెక్టర్ లో కూడా తీవ్ర గాయాలపాలయ్యారని, “నుజ్జు నుజ్జు అవ్వకుండా తృటిలో తప్పించుకున్నారు” అని పేర్కొన్నారు. 

తీర్పు

పంజాబ్ లోని సంగ్రూర్ జిల్లాలో ఆగస్ట్ 2023 నాడు జరిగిన ఘటనకి సంబంధించినది. ఈ ఘటనలో ప్రీతం సింగ్ అనే వ్యక్తి రైతుల నిరసన కార్యక్రమంలో ఒక ట్రాక్టర్ కింద ఇరుక్కుని చనిపోయారు. కాబట్టి ఈ క్లైమ్ అబద్ధం అని మేము నిర్ధారించాము. 

(హిందీ నుండి ఆంగ్లం అనువాదం- అజ్రా అలీ)

(తెలుగు అనువాదం- గుత్తా రోహిత్)

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , हिंदी , తెలుగు

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.