వైరల్ క్లిప్ లో కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ, మొహర్రం ఊరేగింపు లో పాల్గొనలేదు

ద్వారా: మహమ్మద్ సల్మాన్
అక్టోబర్ 9 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
వైరల్ క్లిప్ లో కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ, మొహర్రం ఊరేగింపు లో పాల్గొనలేదు

సామాజిక మాధ్యమలలో వైరల్ అవుతున్న క్లైమ్స్ (సౌజన్యం: ఎక్స్/స్క్రీన్ షాట్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

ఆ వీడియో రాహుల్ గాంధీ తెలంగాణ లో పర్యటిస్తున్నప్పుడు, పోతరాజు సంప్రదాయంలో భాగంగా తనపై తాను కొరడాను ఉపయోగించిన సంధర్బం లోనిది.

క్లైమ్ ఐడి ada85333

క్లెయిమ్ ఏమిటి?

కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ మొహర్రం వేడుకలలో పాలు పంచుకున్నాడంటూ తనను తాను కొరడాతో కొట్టుకుంటున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యింది. అలాంటి పోస్ట్ల ఆర్కైవ్ వెర్షన్ ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. 


సామాజిక మాధ్యమలలో వైరల్ అవుతున్న క్లైమ్స్ (సౌజన్యం: ఎక్స్/స్క్రీన్ షాట్)

సామాజిక మాధ్యమలలో యూసర్లు ఈ వీడియో ని షేర్ చేస్తూ, గాంధీ ముహర్రం ఊరేగింపు లో పాల్గొన్నారు అని పర్కున్నారు. మొహర్రం అనేది, ఇస్లామిక్ కాలెండర్ లో మొదటి మాసం. ఇదే మొహర్రం మాసం లో 680 AD లో పదవ రోజున, ప్రోఫేట్ ముహమ్మద్ మనవడు అయిన ఇమామ్ హుస్సైన్ ను వారి కుటుంబ సభ్యులతో సహ కర్బాలా పొలాల్లో హతమార్చటం జరిగింది.  కనుక ప్రతీ సంవత్సరం, అదే రోజున ముస్లింలు, ప్రత్యేకంగా షియా తెగ వారు, తమని తాము కోరాడాతో కొట్టుకుని ఒక ఊరేగింపు గా చేసి వారు సంతాపం తెలియజేస్తారు. 

అయినప్పటికీ ఇది అబద్దం ఎందుకంటే, ఆ వీడియో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర లో భాగంగా 2022 లో తెలంగాణ లో పోతురాజు సంప్రదాయం లో పాల్గొన్న సంధర్భం లోనిది. 

వాస్తవం ఏమిటి?

వీడియో లోని కి ఫ్రేమ్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా వెతికితే నవంబర్ 3, నాడు ది హిందూ లో ప్రచురించిన ఒక కథనం లభించింది. వైరల్ క్లిప్ లో మాదిరిగానే రాహుల్ గాంధీ కొరడాతో కొట్టుకుంటున్న ఫోటో ఇందులో ప్రచురించారు. ది హిందూ కథనం ప్రకారం, రాహుల్ గాంధీ, తెలంగాణ లోని బోనాలు పండుగ లో భాగమైన, పోతారాజుల సంప్రదాయంలో పాల్గొన్నట్టు పేర్కొని ఉంది. ఆ కథనంలో ఇది బుడగ జంగాల జాతి వారు అనుసరించే సంప్రదాయమని, దీనిలో భాగంగా వారు  పల్లెటూర్లలో ఇళ్ల మధ్య  తిరుగుతూ తమని తాము కొరడాతో కొట్టుకుంటూ వారి జీవనాధారానికి డబ్బులు సంపాదించుకుంటారు అని కూడా రాసి ఉంది. మరియు కథనం ప్రకారం, ఆ తెగకి చెందిన వారు, తమని తాము కొరడాతో కొట్టుకున్నప్పుడు గాంధీ అది చూసి తాను కూడా చేస్తాను అని ఆ సందర్భం లో అలా చేయటం జరిగింది.

రాహుల్ గాంధీ బోనాల సంబరాలలో పాల్గొంటునట్టు నవంబర్ 22 నాటి హిందూ కథనం (సౌజన్యం: ది హిందూ/స్క్రీన్షాట్) 

తెలంగాణ కి సంబందించిన విషయాలు కవర్ చేసే, ది హిందూ- హైదరాబాద్ - వారి అధికారిక ఎక్స్ (పూర్వపు ట్విటర్) అకౌంటు లో మరింత నిడివి ఉన్న వీడియో ని పోస్ట్ చేస్తూ, “తెలంగాణ లో జరుగుతున్న భారత్ జోడో యాత్ర సమయం లో బోనాలు సంబరాలో పోతరాజు లాగా రాహుల్ గాంధీ కొరడాతో కొట్టుకుంటున్నారు . సంగారెడ్డి ఏం ఎల్ ఏ, టి జయప్రకాష్ రెడ్డి తమని తాము హాని చేసకోకుండా కొరడాని ఏ విధంగా వాడాలి అని చూపించారు,” అని రాసి ఉంది.

వైరల్ వీడియో మరియు ది హిందూ హైదరాబాద్ ఎక్స్ లో షేర్ చేసిన వీడియో కి మధ్య పోలిక (సౌజన్యం: ఎక్స్/స్క్రీన్ షాట్)

ది ఎకనామిక్ టైమ్స్, హిందుస్థాన్ టైమ్స్ తో సహ మరిన్ని వార్తా సంస్థలు కూడా, గాంధీ కొరడాతో కొట్టుకోవడం గురించి నవంబర్ 2022 లో కథనాలు ప్రచురించారు.

ఈ వీడియో ని, ఎక్స్ లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వారు కూడా నవంబర్ 3, 2022 నాడు కూడా షేర్ చేశారు.

నవంబర్ 22 నాడు కాంగ్రెస్ ఎక్స్ లో షేర్ చేసిన పోస్ట్ (సౌజన్యం: ఎక్స్/స్క్రీన్ షాట్)

బోనాలు సంబరాలు

హైదరాబాద్ జిల్లా అధికారిక వెబ్సైట్ ప్రకారం, బోనాలు సంబరాలు హిందూ దేవత అయిన మహంకాళి మాతకి మొక్కుతూ చేసే పండుగ. “ఇది హైదరాబాద్, సికిందరాబాద్  జంట నాగరాలలోనూ మరియు తెలంగాణ లోని ఇతర ప్రాంతాలలోను ప్రతీ ఏడాది జరుపుకునే పండుగ. ఇది ప్రతి ఆశాడ మాసం, అంటే జులై/ఆగస్టు నెలలో జరుపుకునే పండుగ,” అని రాసి ఉంది. 

మరియు, పోతరాజు లేదా పోతారాజులు అనే వారు పల్లెటూర్లలో ఉండే దేవతలను కాపాడే వారి గా పరిగణిస్తారు. పోతరాజు, అమ్మవారికి సహోదారుడి లాగా పరిగణిస్తారు, ఇతడు మంచి సౌష్టవం తో చిన్న ధోతి మాత్రమే వేసుకుని, కాళ్ళకి గజ్జలు కట్టుకుని, శరీరానికి పసుపు పెట్టుకుని, నూడిటిన కుంకుమ పెట్టుకుని ఉంటారు. కొరడా తో కొట్టుకోవటం అనేది అమ్మవారికి సమర్పించుకోవటం గా భావిస్తారు. 

తీర్పు: 

రాహుల్ గాంధీ ముహర్రం ఊరేగింపు లో పాల్గొంటునట్టుగా వచ్చిన వీడియో అబద్దం. ఆ వీడియో తెలంగాణ బోనాలు పండగ సంధర్బంలో గాంధీ భారత్ జోడో యాత్ర సమయంలో, పోతారాజులు ఆచారం లో భాగంగా తీసినది. కనుక మేము దీనిని అబద్దం అని పేర్కొన్నాము. 

(అనువాదం:  రాజేశ్వరి పరస)

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , हिंदी , తెలుగు , ಕನ್ನಡ

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.