ఇటీవల 2024 ఎన్నికలలో తెలంగాణ లోని బహదూర్ పుర లో ఓటు రిగ్గింగ్ జరిగింది అంటూ పాత వీడియోని షేర్ చేశారు

ద్వారా: రాహుల్ అధికారి
మే 15 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
ఇటీవల 2024 ఎన్నికలలో తెలంగాణ లోని బహదూర్ పుర లో ఓటు రిగ్గింగ్ జరిగింది అంటూ పాత వీడియోని షేర్ చేశారు

బహదూర్ పుర లో ఎం ఐ ఎం రిగ్గింగ్ చేస్తుంది అని షేర్ చేసిన పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

ఈ వీడియో ఫిబ్రవరి 2022 నాటిది, వార్త కథనాల ప్రకారం ఇది 2022 లో కోల్ కత్తాలో మునిసిపల్ ఎన్నికల సమయంలోనిది.

క్లైమ్ ఐడి 590867f7

క్లెయిమ్ ఏమిటి ?

సామాజిక మాధ్యమాలలో ఒక వీడియోలో పోలింగ్ ఏజెంట్ కూర్చుని ఉండగా, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ వద్ద ఒక గీతల టి షర్ట్ వేసుకున్న వ్యక్తి నిలబడి, ఓటర్లను ఆపుతూ, వాళ్ళ బదులు ఇతను ఓట్లు వేస్తున్నట్టుగా ఉంది. ఈ వీడియోని షేర్ చేస్తూ, అల్ ఇండియా మజ్లీస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) వ్యక్తులు పోలింగ్ను రిగ్గింగ్ చేస్తున్నారు అని పేర్కొన్నారు.

వీడియోకి పెట్టిన శీర్షిక లో, ఈ వీడియో దక్షిణ భారతదేశమైన తెలంగాణలోని బహదూర్ పుర నియోజకవర్గం లోనిది అని రాసుకొచ్చారు. ఇక్కడ మే 13 న ఎన్నికలు జరిగాయి. ఆర్కైవ్ చేసిన పోస్టులను ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

ఎం ఐ ఎం రిగ్గింగ్ చేస్తుంది అని షేర్ చేసిన పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

కానీ, ఈ వీడియో తప్పుడు క్లెయిమ్ తో ప్రచారం అవుతుంది అని మేము కనుగొన్నము. ఈ వీడియో 2022 ఫిబ్రవరి నాటిది. వివిధ కధనాల ప్రకారం ఇది భారత దేశానికీ తూర్పున ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ లోని కోల్ కత్తాలో మునిసిపల్ ఎన్నికలలో ఓటు రిగ్గింగ్ జరిగిన సమయం లోనిది. 

వాస్తవం ఏమిటి ?

వైరల్ అవుతున్న వీడియోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఈ వీడియో 2022లో కోల్ కత్తా   లోని మునిసిపల్ ఎన్నికల సమయంలో వార్డ్ నెంబర్ 33లో లేక్ వ్యూ స్కూల్  లోనిది అని తెలిసింది.

ఫిబ్రవరి 27, 2022 నాడు 108 మునిసిపాలిటీలకు వెస్ట్ బెంగాల్ లో ఎన్నికలు జరిగాయి. అధికార పార్టీ అయిన త్రిణమూల్ కాంగ్రెస్, 102 మునిసిపాలిటీలలో ఎన్నికలు గెలిచింది, ప్రతిపక్ష పార్టీలయిన కాంగ్రెస్ మరియు బిజేపి త్రిణమూల్ కాంగ్రెస్ ఎన్నికలను రిగ్గింగ్ చేసింది అని ఆరోపించారు. 

బిజేపి నాయకురాలు అగ్నిమిత్ర పాల్ ఈ వీడియోని షేర్  చేస్తూ, త్రిణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను రిగ్గింగ్ చేసింది అని పేర్కొన్నారు. ఇదే వీడియోని బెంగాల్ బిజేపి తమ ఎక్స్ హ్యాండిల్ కుడా షేర్ చేసింది.

బెంగాలీ న్యూస్ ఛానల్ టివి9 బంగ్లా ఈ వీడియోని తమ యూట్యూబ్ ఛానల్ లో ఫిబ్రవరి 27, 2022 నాడు  పబ్లిష్ చేస్తూ, ఈ ఘటన బూత్ నెంబర్ 108 లో, వార్డ్ నెంబర్ 33 లో, సౌత్ డమ్ డమ్ లో  జరిగింది అని పేర్కొన్నారు, పైగా ఓటరు ఓటు వేయలేదు, ఏజెంటే ఓటు వేశారు అని పేర్కొన్నారు. 

ఎడిటర్జీ అనే వార్త సంస్థ కుడా ఈ వీడియోని పబ్లిష్ చేసి, ప్రతిపక్ష నేతలు సౌత్ డమ్ డమ్ మునిసిపల్ ఎన్నికలలో రిగ్గింగ్ జరిగింది అని పేర్కొన్నారు అని ఉంది.

బెంగాల్ ప్రభుత్వం ఈ వీడియో గురించిన ఎటువంటి స్పష్టతా ఇవ్వలేదు, కానీ, ఈ వీడియో 2022 నాటిది అని, కర్ణాటక ఎన్నికల ముందు నుండే ఉందని మాత్రం తెలుస్తుంది.

2022 లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయం లో కుడా ఇదే వీడియో సూరత్ లోని వారచ్చ ప్రాంతం లో దొంగ ఓట్లు వేస్తున్నారన్న క్లైమ్ మీద వైరల్ అయింది. అప్పుడు కుడా లాజికల్లీ ఫ్యాక్ట్స్ దీని గురించి రాసింది.

తీర్పు :

వైరల్ అవుతున్న వీడియో ఫిబ్రవరి 2022 నుండి ఆన్లైన్ లో ఉంది, ఇది కోల్ కత్తా మునిసిపల్ ఎన్నికలలో ఓటు రిగ్గింగ్ జరిగిన సమయం లోనిది.

(అనువాదం : రాజేశ్వరి పరస)

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , తెలుగు , ಕನ್ನಡ

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.