ఇస్రో చీఫ్ నాట్యం చేస్తున్న పాత వీడియోని చంద్రయాన్-3 ల్యాండింగ్ తరువాత సంబరాలు చేసుకుంటున్నట్టుగా చూపించారు

ద్వారా: రాజేశ్వరి పరస
ఆగస్టు 25 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
ఇస్రో చీఫ్ నాట్యం చేస్తున్న పాత వీడియోని చంద్రయాన్-3 ల్యాండింగ్ తరువాత సంబరాలు చేసుకుంటున్నట్టుగా చూపించారు

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

ఈ వీడియో జులైలో బెంగళూరులో ఇస్రో నిర్వహించిన ఒక కార్యక్రమానికి చెందిన వీడియో. దీనికి చంద్రుడి మీద లాండ్ అయిన చంద్రయాన్-3కి సంబంధం లేదు.

క్లైమ్ ఐడి e1f10cee

నేపధ్యం

చంద్రయాన్- 3 చంద్రుడి మీదకి విజయవంతంగా ప్రయోగించబడిన తరువాత అదే రోజు, ఆగస్టు 23 సాయంత్రం, ఈ విజయం సాధించిన సందర్బంగా ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ నాట్యం చేస్తున్నట్టుగా సామాజిక మాధ్యమాలలో ఒక వీడియో వైరల్ అయ్యింది. చాలా మంది ఈ వీడియోని X లో షేర్ చేయగా, లక్షల కొద్ది వ్యూస్ వచ్చాయి. కొంతమంది ఈ వీడియోని ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ఛైర్మన్ ని, వారి బృందాన్ని పొగుడుతూ షేర్ చేశారు. వీరి కష్టం, శ్రమ వలనే ఈరోజు చంద్రుడి దక్షిణ ధృవం మీదకి భారతదేశం మొట్టమొదటిగా అడుగుపెట్టగలిగింది అంటూ రాసుకొచ్చారు. 



ఈ క్లెయిమ్ తో సామాజిక మాధ్యమలలో షేర్ అవుతున్న ఫోటో (సౌజన్యం: X/@aestheticayush6)

అయితే ఈ వైరల్ వీడియో పాతది. చంద్రయాన్- 3 చంద్రుడి మీద లాండ్ అవ్వకముందే తీసినది. 

వాస్తవం

ఈ వీడియోని మొట్టమొదటి సారిగా వియోన్ అనే భారత దేశ ఆంగ్ల భాష ఛానల్ పాత్రికేయుడు, సిద్ధార్థ్ ఎం పి,  X (ఇంతకుమునుపు ట్విటర్) లో పోస్ట్ చేశారు. ఆయన ఈ వీడియోని ఈ శీర్షికతో షేర్ చేశారు, “డా. ఎస్ సోమనాథ్ మరియు వారి ఇస్రో బృందం. ఈరోజు మనసారా సంబరాలు చేసుకుంటూ నాట్యం చేయండి. 1.4 బిలియన్ పైగా మనసులని గర్వంతో మరియు సంతోషంతో నింపగలిగే ఆ శక్తి మరియు విజ్ఞానం ఎంత మందికి ఉంటుంది ఈ ప్రపంచంలో.”

కొంతసేపటికి ఈ వీడియో వైరల్ అవుతుంటే, దీనికి జవాబుగా, ఈ వీడియో ఇప్పటిది కాదు అని రాశారు. “దయచేసి గమనించండి, ఈ వీడియో ఈ ఏడాది మొదట్లో తీసింది. నేను ఈ కార్యక్రమానికి అధికారికంగా హాజరుకావటం వలన తీయగలిగాను. ఈ వీడియో ఈరోజుది కాదు.” సిద్ధార్థ్ X ప్రొఫైల్ ఆధారంగా ఆయన ఇస్రో, రక్షణ రంగం, సాంకేతికత, అంకుర సంస్థలు, ఫీచర్స్, మరియు ఆకడమియా విశేషాల మీద రిపోర్టింగ్ చేస్తుంటారు. 

లాజికల్లీ ఫ్యాక్టస్ సిద్ధార్థ్ ఎం పి ని మరింత సమాచారం కొరకు సంప్రదించింది. ఆయన మాకు ఈ వీడియో 2023 జులై మొదటి వారంలో తీసిన వీడియో అని తెలిపారు. పిటిఐ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడుతూ“ ఇది ఒక కార్యక్రమంలో బెంగళూరులో జులై మొదటి వారం లో తీసినది. అది జి 20 స్పేస్ ఎకానమీ సమావేశం తరువాత ఆ రోజు సాయంత్రం జరిగిన సాంస్కృతిక కార్యక్రమానికి చెందిన వీడియో. 
ఇస్రో అధికారిక వెబ్సైట్ ప్రకారం, ఇండియా G20 ప్రెసిడెన్సీ ఆధ్వర్యంలో స్పేస్ ఎకానమీ లీడర్స్ మీటింగ్ నాలుగో విడత సమావేశం బెంగళూరులో జులై 6వ తేదీన జరిగింది.

వెబ్సైట్ లో పొందుపరిచిన సమాచారం ప్రకారం, 18 G 20 దేశాల స్పేస్ ఏజెన్సీ సీనియర్ ప్రతినిధులు, మరో 8 ఆహ్వానించిన దేశాలతో మరొక ఇంటర్నేషనల్ సంస్థతో పాటుగా ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. అలాగే ఆ రోజుని ముగించే మునుపు భారత దేశ సాంప్రదాయ మర్యాదలు ప్రతిబింబించేలా ఒక ఆహ్లాదకరమయిన సాంస్కృతిక కార్యక్రమాన్ని మరియు ఒక గాలా డిన్నర్ ఈవెంట్ ని ఏర్పాటు చేశారు అని కూడా వెబ్సైట్ లో ఉంది. 



చంద్రయాన్-3 విజయవంతమయిన రోజు మరియు వైరల్ వీడియోలో నాట్యం చేస్తున్నప్పుడు ఎస్ సోమనాథ్ వేసుకున్న దుస్తుల పోలిక.  (సౌజన్యం : యూట్యూబ్/ఇస్రో, X/@aestheticayush6/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ చే మార్చబడినది)


ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే చంద్రయాన్-3 విజయం తరువాత మాట్లాడుతున్నప్పుడు ఇస్రో చీఫ్ ఒక నల్ల రంగు కోట్ వేసుకున్నారు కానీ వైరల్ వీడియోలో లాగా బ్లేజర్ వేసుకోలేదు.

తీర్పు 

ఇస్రో చీఫ్ నాట్యం చేస్తూన్న వీడియో ఇప్పటిది కాదు, జులైలో ఇస్రో G20 ఈవెంట్లోనిది. కనుక మేము దీనిని ఆబద్ధం అని నిర్ధారించాము. 

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , অসমীয়া , తెలుగు , ಕನ್ನಡ

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.