పాత వీడియో షేర్ చేసి అత్యాచారం ఘటనకి సంబంధించి తెలుగుదేశం నాయకుడుని ప్రజలు చితకబాదారని క్లైమ్ చేశారు

ద్వారా: రోహిత్ గుత్తా
డిసెంబర్ 20 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
పాత వీడియో షేర్ చేసి అత్యాచారం ఘటనకి సంబంధించి తెలుగుదేశం నాయకుడుని ప్రజలు చితకబాదారని క్లైమ్ చేశారు

వైరల్ అవుతున్న క్లెయిమ్ స్క్రీన్ షాట్ ( సౌజన్యం: ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

2021కి చెందిన ఈ వీడియోలో కనిపిస్తున్నది డి చిన్నా రావు, విశాఖపట్టణం వాసి. తను చిన్నా రావు వెల్ఫేర్ ట్రస్ట్ ని నడిపిస్తుంటారు.

క్లైమ్ ఐడి 5a57b2ae

క్లెయిమ్ ఏమిటి? 

కొంతమంది వ్యక్తులు మరొక వ్యక్తిపై అరుస్తు మరియు కొడుతున్న వీడియో ఒకటి ఎక్స్ లో ప్రచారం అవుతుంది. ఈ 39 సెకెన్ల నిడివి గల వీడియోలో ఉన్నది మైలవరం టిడీపీ కన్వీనర్, పూర్ణ చౌదరి అని, ఇతనిని ఒక మైనర్ రేప్ కేసు గురించి కొడుతున్నారు అని క్లైమ్ చేశారు. ఆర్కైవ్ చేసిన పోస్ట్ ఇక్కడ చూడవచ్చు. 

ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం ప్రధాన ప్రతిపక్ష పార్టీ. మైలవరం ఎన్టీఆర్ జిల్లాలో ఒక అసెంబ్లీ నియోజకవర్గం.


వైరల్ అవుతున్న క్లెయిమ్ స్క్రీన్ షాట్ ( సౌజన్యం: ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

కానీ వైరల్ వీడియోలో ఉన్నది చౌదరి కానీ టిడిపి కార్యకర్త కానీ కాదు. 

మేము ఏమి కనుగొన్నము?

వీడియోని పరీక్షిస్తే, అందులో ఉన్న వ్యక్తులు మాస్కులు ధరించి ఉన్నారు. దానితో ఇది ఈ మధ్య కాలంలో జరిగింది కాకపోయి ఉండవచ్చు అని అనుకున్నాము, కోవిడ్-19 సమయంలో  ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తున్న సమయంలోనిది అయిండొచ్చు అనుకున్నాం. 

ఈ వీడియో కీ ఫ్రేమ్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూడగా, ఈ వీడియోలోని విజువల్స్ ఉన్న వార్తా కథనాలు మాకు లభించాయి.  డిసెంబర్ 7, 2021 నాడు ప్రచురితమైన బీబీసీ తెలుగు కథనంలో వైరల్ వీడియోకి సంభంధించిన స్క్రీన్ షాట్ ఉంది. ఈ రిపోర్ట్ ప్రకారం, వీడియోలో ఉన్న వ్యక్తి, డి చిన్నా రావు. ఈయన విశాఖపట్నంలో చిన్నా రావు వెల్ఫేర్ ట్రస్ట్ నిర్వహిస్తుంటారు.  ఈ ట్రస్ట్ ప్రాధమిక పాఠశాలలకు విచ్చేసి చదువుకి సంబంధించిన సామగ్రి పంచుతూ ఉంటుంది. చిన్నా రావు మీద ఒక చిన్న పిల్లతో అసభ్యంగా ప్రవర్తించాడు అనే ఆరోపణలు ఉన్నాయి, దాంతో అక్కడ ఉన్న తల్లిదండ్రులు, ఆ వ్యక్తిని చితకబాది విశాఖపట్నంలోని మల్కాపురం పోలీసులకు అప్పగించారు. 

అదేవిధంగా, డిసెంబర్ 7, 2021 నాడు ఈ వీడియోలోని విజువల్స్ తో కూడిన ఒక కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రచురించింది.. ఈ కథనంలో చిన్నా రావు మల్కాపురంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన వ్యక్తి అని తెలిపారు. చిన్నా రావు పిల్లలతో అసభ్యంగా ప్రవర్తించడంతో పిల్లల తల్లితండ్రులు అతన్ని కొట్టారు అని ఇందులో పేర్కొన్నారు. ది హిందూ మరియు టైమ్స్ అఫ్ ఇండియా రాసిన కథనాలు కూడా ఇదే విషయాన్ని తెలిపాయి.  

వైరల్ అవుతున్న వీడియోలో అతడు పూర్ణ చౌదరి అని ఉన్నప్పటికీ, ఈ కథనాల ద్వారా మనకి అతడు విశాఖపట్నంకి చెందిన చిన్నా రావు అని తెలుస్తుంది. ఏ వార్తా కథనం కుడా ఇతడు ఫలానా రాజకీయ పార్టీకి చెందినవాడని తెలపలేదు.

దీని గురించి మల్కాపురం పోలీసులను సంప్రదించగా, చిన్నా రావుకి టిడీపీ(ప్రతిపక్షం) లేదా వైసిపి (అధికార పక్షం) తో సంబంధం లేదు అని సర్కిల్ ఇన్స్పెక్టర్ జి దేముడు బాబు లాజికల్లీ ఫ్యాక్ట్స్ కి తెలియజేసారు. చిన్నా రావుని పోక్సో చట్టం కింద అరెస్ట్ చేశామని,, ప్రస్తుతం ఈ కేసు న్యాయస్థానంలో ఉందని తను మాకు తెలిపారు.

తీర్పు 

సంబంధం లేని 2021 వీడియోని ఆంధ్ర ప్రదేశ్ లో టిడీపీ నాయకునిపై జరిగిన దాడిగా ప్రచారం చేసారు. కనుక ఇది అబద్దం అని మేము నిర్ధారించాము.

(అనువాదం : రాజేశ్వరి పరస)

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , తెలుగు , ಕನ್ನಡ

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.