చెట్లు నరేంద్ర మోదీ ముఖాకృతిలో ఏర్పడ్డాయి అంటూ షేర్ చేస్తున్న ఫొటో కృత్రిమ మేధ ద్వారా సృష్టించిన ఫొటో

ద్వారా: వివేక్ జె
అక్టోబర్ 5 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
చెట్లు నరేంద్ర మోదీ ముఖాకృతిలో ఏర్పడ్డాయి అంటూ షేర్ చేస్తున్న ఫొటో కృత్రిమ మేధ ద్వారా సృష్టించిన ఫొటో

కర్ణాటకలోని గోకర్ణలో ఫ్రెంచ్ పర్యాటకులు తీసిన ఫొటో అంటూ సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసిన క్లైమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/స్క్రీన్ షాట్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

కృత్రిమ మేధ వాడి నరేంద్ర మోదీ ఫొటో ఇలా తయారు చేశానని ఈ ఫొటో సృష్టికర్త లాజికల్లీ ఫ్యాక్ట్స్ కి ధృవీకరించారు.

క్లైమ్ ఐడి 9d02e04d

క్లైమ్ ఏంటి?

ప్రధాన మంత్రి మోదీ మొహాన్ని పోలీనట్టున్న ఒక చెట్ల తోపు ఫొటో ఒకటి ఎక్స్, ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యింది. ఈ ఫొటోని కర్ణాటకలోని గోకర్ణలో ఫ్రెంచ్ పర్యాటకులు తీశారని అర్థం వచ్చేలా కొన్ని పోస్టుల శీర్షిక ఉంది. “వాహ్! ప్రకృతి కూడా మోదీ గారితోనే ఉంది.”, అని ఒక పోస్ట్ ఎక్స్ లో ఒక యూజర్ ఈ ఫొటోతో పాటుగా పోస్ట్ చేశారు. ఇదే పోస్ట్ ని ఇదే యూజర్ రీషేర్ చేసి, “ఈ ఫొటోని కర్ణాటకలోని గోకర్ణ దగ్గర ఫ్రెంచ్ పర్యాటకులు తీశారు”, అని రాశారు. హర్యాణలోని పంచకుల  భారతీయ జనతా పార్టీ  అధికారిక ఎక్స్ అకౌంట్ లో కూడా ఇదే క్లైమ్ ని షేర్ చేశారు. ఈ పోస్ట్ ఆర్కైవ్ ఇక్కడ చూడవచ్చు. ఇటువంటి క్లైమ్ తో ఉన్న ఇతర పోస్ట్స్ ఆర్కైవ్ ఇక్కడ  మరియు ఇక్కడ  చూడవచ్చు. 

చెట్ల తోపు మోదీ ముఖాకృతిలో ఉన్నదని చెబుతూ సామాజిక మాధ్యమాలలో పెట్టిన పోస్ట్స్ స్క్రీన్ షాట్స్ (సౌజన్యం: ఎక్స్/ఫేస్బుక్/స్క్రీన్ షాట్/లాజికల్లీ  ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే ఇది కృత్రిమ మేధ ద్వారా సృష్టించిన ఫొటో. ఇది నిజమైన ఫొటో కాదు.

మేము ఏమి కనుగొన్నాము?

ఈ ఫొటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతికితే ఇది కృత్రిమ మేధ ద్వారా సృష్టించిన ఫొటో అని చెబుతూ వచ్చిన అనేక వార్తా కథనాలు మాకు దొరికాయి.

హిందుస్థాన్ టైమ్స్ లో సెప్టెంబర్ 23 నాడు వచ్చిన ఒక కథనం శీర్షిక, “కృత్రిమ మేధ ద్వారా సృష్టించిన ఈ ఫొటోలో ప్రధాన మంత్రి మోదీ ముఖం మీకు కనిపిస్తున్నదా?”, అని ఉంది. “వివిధ కృత్రిమ మేధ సాధనాలు వాడి కళాకారులు సృజనకు ఉన్న హద్దులను చెరిపివేస్తున్నారు, అలాగే మనం అబ్బురపోయే ఫొటోలను సృష్టిస్తున్నారు. ఇలాంటి ఫొటోలు సృష్టించి తమ సామాజిక మాధ్యమాలలో షేర్ చేసే వారిలో మాధవ్ కోహ్లి ఒకరు. ఈ మధ్య ఆయన చేసిన ఒక ఫొటో ఒక దీవికి సంబంధించినది. అయితే తన సృజనాత్మకతకి సాంకేతిక జోడించి నరేంద్ర మోదీ ముఖాకృతి ఇందులో కనపడేటట్టు చూపించడం ఇక్కడ బాగా ఆసక్తికరమైన విషయం”, అని ఈ కథనంలో రాశారు. 

వైరల్ పోస్ట్స్ లో ఉన్న ఫొటోనే ఉన్న వార్తా కథనం (సౌజన్యం: స్క్రీన్ షాట్/హిందుస్థాన్ టైమ్స్/లైవ్ మింట్)

మాధవ్ కోహ్లిని మేము ఇన్స్టా గ్రామ్ ద్వారా సంప్రదించాము. “స్టేబుల్ డిఫ్యూషన్ అనే కృత్రిమ మేధ సాఫ్ట్వేర్” ద్వారా ఈ ఫొటో తానే సృష్టించానని ఆయన మాకు తెలిపారు. “ఏ ఇన్పుట్ ఇచ్చినా సరే నిజమైన ఫొటో అనిపించే ఫొటోలని సృష్టించగలిగే ఇమేజ్ డిఫ్యూషన్ మోడల్”, అని ఈ స్టేబుల్ డిఫ్యూషన్ వివరణలో ఉంది. 

మాధవ్ కోహ్లి పోస్ట్, దాని కింద ఒక యూజర్ ప్రశ్నకి సమాధానం స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/మాధవ్ కోహ్లి/స్క్రీన్ షాట్)

కృత్రిమ మేధ ద్వారా సృష్టించిన ఇతర ఫొటోలని కూడా మాధవ్ కోహ్లి తన ఎక్స్ అకౌంట్ లో షేర్ చేశారు. 

కృత్రిమ మేధ ద్వారా సృష్టించిన మాధవ్ కోహ్లి ఇతర ఫొటోల స్క్రీన్ షాట్స్ (సౌజన్యం: ఎక్స్/మాధవ్ కోహ్లి/స్క్రీన్ షాట్)

తీర్పు

మోదీ ముఖాకృతిలో ఉన్న చెట్ల తోపు అంటూ సామాజిక మాధ్యమాలలో వైరల్ అయిన ఫొటో కృత్రిమ మేధ ద్వారా సృష్టించిన ఫొటో. ఫ్రెంచ్ పర్యాటకులు తీసిన నిజమైన ఫొటో కానే కాదిది. కాబట్టి ఈ క్లైమ్ అబద్ధం అని మేము నిర్ధారించాము. 

(అనువాదం- గుత్తా రోహిత్) 

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , অসমীয়া , हिंदी , తెలుగు

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.