కర్ణాటక పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ కు మతం రంగు పులిమి షేర్ చేస్తున్నారు

ద్వారా: రాహుల్ అధికారి
ఫిబ్రవరి 8 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
కర్ణాటక పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ కు మతం రంగు పులిమి షేర్ చేస్తున్నారు

వైరల్ పోస్టు స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

అదే రోజు ఇంటర్మీడియట్ పరీక్ష ఉండటంతో మార్చ్ 1 ఉదయం పూట జరగవలసిన పదవ తరగతి పరీక్షను మధ్యాహ్నంకి వాయిదా వేశారు.

క్లైమ్ ఐడి 299135ad

క్లెయిమ్ ఏమిటి?

సామాజిక మాధ్యమాలలో చాలా మంది యూజర్లు, ముస్లింలు ప్రార్ధన చేసుకోడానికి అనుగుణంగా కర్ణాటక ప్రభుత్వం పదవ తరగతి  పరీక్షల షెడ్యూల్ ను మార్చింది అంటూ షేర్ చేసారు.

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎస్ ఎస్ ఎల్ సి టైం టేబుల్ కి సంబంధించిన ఒక ఫొటోని షేర్ చేస్తూ, అన్ని పరీక్షలు ఉదయం 10 గంటలకు ఉంటే, శుక్రవారం జరగవలసిన సామాన్య శాస్త్ర పరీక్ష మాత్రం మధ్యాహ్నం 2 గంటలకు పెట్టారు అని తెలిపారు.

ఒక ఎక్స్ (పూర్వపు ట్విట్టర్) యూజర్, టైం టేబుల్ ఫొటో షేర్ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం పదవ తరగతి పరీక్షల టైం టేబుల్ విడుదల చేసింది. అన్ని పరీక్షలు ఉదయం నిర్వహిస్తుంటే, శుక్రవారం నాడు మాత్రం ఆలా చేయలేదని, ఎందుకంటే ఆ రోజు నమాజ్ చేసుకోడానికి సమయం కోసం అన్నట్టుగా షేర్ చేసారు. మేము ఈ కథనం రాసే సమయానికి ఈ పోస్ట్ కి దాదాపుగా 3,14,000 వ్యూస్ మరియు 4,500 లైక్స్ ఉన్నాయి. ఇటువంటి పోస్ట్ల ఆర్కైవ్స్ ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. 

పరీక్షల టైం టేబుల్ కి ఇలాంటి మతం రంగు పులిమిన పోస్ట్ ని భారతీయ జనతా పార్టీ కర్ణాటక రాష్ట్ర విభాగం కుడా షేర్ చేసింది. (కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా, భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షంలో ఉంది). ఈ పోస్టులో రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య ముస్లింలను ఆకట్టుకోవడానికి కావాలనే ఇలాంటివి చేస్తున్నారని రాసుకొచ్చారు. ప్రస్తుతం డిలీట్ చేసిన ఆ పోస్ట్ ఆర్కైవ్ ఇక్కడ చూడవచ్చు. 

కర్ణాటక భారతీయ జనతా పార్టీ తమ ఎక్స్ అకౌంట్లో కన్నడ వార్త సంస్థ అయిన విస్తార న్యూస్ వారు రాసిన కథనాన్ని కుడా రి-షేర్ చేసింది, (ఆర్కైవ్ ఇక్కడ). పదవ తరగతి పరీక్ష సమయాన్ని ముస్లింల నమాజ్ కోసం మార్చారు అనే శీర్షికతో ఈ కథనాన్ని ప్రచురించారు. ఆర్కైవ్ చేసిన ఆర్టికల్ ఇక్కడ చూడవచ్చు. ఈ కథనంలో కూడా వైరల్ అవుతున్న టైం టేబుల్ స్క్రీన్ షాట్ కుడా ఉంది. కేవలం ముస్లింలను ఆకట్టుకోవడానికే మార్చ్ 1 నాడు పరీక్ష సమయాన్ని మార్చారు అని వివిధ హిందూ సంస్థలు ఆరోపిస్తున్నాయి అని ఈ కథనంలో పేర్కొన్నారు. 

వైరల్ పోస్టు స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్ ) 

అయితే  ఇది నిజం కాదు ఎందుకంటే, మార్చ్ 1 నాడు మరో ఇంటర్మీడియట్ పరీక్ష ఉండటంతో పదవ తరగతి పరీక్షను మధ్యాహ్ననికి వాయిదా వేశారు. దీనిలో మతపరమయిన ఉద్దేశం ఏమీ లేదు. 

మేము ఏమి కనుగొన్నము?  

లాజికల్లీ ఫ్యాక్ట్స్ నిర్ధారణ మేరకు, వైరల్ అవుతున్న టైం టేబుల్, 2023-2024కి సంబంధించిన పదవ తరగతి పరీక్షల టైం టేబులే. దీని ప్రకారం పరీక్షలు ఫిబ్రవరి 26 నాడు మొదలయ్యి, మార్చ్ 2 నాడు ముగియనున్నాయి. అన్ని పరీక్షలు కుడా ఉదయం 10:15 మొదలవుతున్నాయి, కానీ మార్చ్ 1, శుక్రవారం నాడు జరగాల్సిన సామాన్య శాస్త్ర పరీక్ష మాత్రం మధ్యాహ్నం రెండు గంటలకు మొదలవుతుంది. 

కానీ దీనికి నిజమైన కారణం ఏంటంటే, అదే రోజున మరో పరీక్ష ఉండటం. ఈ కారణాన్ని స్పష్టంగా టైం టేబుల్ లో ఒక నోట్ లాగా కుడా రాశారు. ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం వాళ్లకు పరీక్ష ఉందని, ఈ పరీక్షకు చాలా పాఠశాలలు సెంటర్ గా ఉండటంతో పదవ తరగతి పరీక్షను అదే రోజు, అనగా మార్చ్ 1, మధ్యాహ్నానికి వాయిదా వేశారు అని ఆ నోట్ లో రాసి ఉంది. “ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం వారి రెండవ పరీక్ష ఇదే మార్చ్ 1 నాడు ఉండటం, ఆ పరీక్ష సెంటర్లుగా ఇంటర్ కళాశాలలు, పాఠశాలలు ఉండటం కారణంగా, మార్చ్ 1 నాడు జరగవలసిన పదవ తరగతి సామన్య శాస్త్ర పరీక్షని మధ్యాహ్నం పెట్టడం జరిగింది” అని ఈ నోట్ లో ఉంది. 

ఈ టైం టేబుల్ కర్ణాటక పాఠశాల పరీక్షల మరియు అస్సేస్మెంట్ బోర్డు వారి వెబ్సైట్ లో ఇంగ్లీష్ మరియు కన్నడ భాషలలో ఉంది. 

పదవ తరగతి పరీక్షల టైం టేబుల్ (సౌజన్యం : కర్ణాటక పాఠశాలల పరీక్షల మరియు అస్సేస్మెంట్ బోర్డు)


విస్తార న్యూస్ కుడా కర్ణాటక పరీక్షల బోర్డు వారు ఇచ్చిన వివరణను తమ కథనంలో పేర్కొన్నారు. 

లాజికల్లీ ఫ్యాక్ట్స్  కుడా ఇంటర్మీడియట్ పరీక్షల టైం టేబుల్ ని బోర్డు అధికారిక వెబ్సైటులో చూసి, మార్చ్ 1 నుండి మార్చ్ 22 వరకు పరీక్షలు జరగనున్నాయి అని నిర్దారించింది. ఇందులో అన్ని పరీక్షలు ఉదయం 10:15 కి ప్రారంభం కానున్నాయి, శుక్రవారం పరీక్షతో సహా. పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ (కన్నడ/అరబిక్ పరీక్షలు) సంబంధించిన ఒక పరీక్ష మాత్రం ఒకే రోజు జరగనున్నాయి. 

ఇంటర్మీడియట్ టైం టేబుల్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : కర్ణాటక పాఠశాల పరీక్షల మరియు అస్సేస్మెంట్ బోర్డు)


కర్ణాటక కాంగ్రెస్ కుడా వారి ఎక్స్ అకౌంట్ లో ఇంటర్మీడియట్ పరీక్ష మార్చ్ 1 నాడు ఉండటం తో పదవ తరగతి పరీక్షను ఆ రోజు మధాహ్ననానికి మార్చారు అని పేర్కొన్నారు. ఆ మర్నాడు ఇంటర్మీడియట్ పరీక్ష లేనందువల్ల ఆ పరీక్ష మాత్రం యధావిధిగా ఉదయం జరుగుతుంది అని చెప్పారు. ఇలాంటి నిర్ణయం తీసుకోడానికి, పరీక్ష సెంటర్ల కొరత కారణం అని పేర్కొన్నారు.


పైగా కర్ణాటక కాంగ్రెస్ ఎక్స్ పోస్ట్ లో, “భాజపా గంపుర్, శుక్రవారం నమాజ్ చేసుకోడానికి పదవ తరగతి పరీక్షను మార్చారు అన్నారు కదా, మరి అదే రోజు ఇంటర్మీడియట్ పరీక్ష కుడా ఉంది, వారు నమాజ్ చేసుకోవాల్సిన అవసరం లేదా,” అని రాస్తూ, రెండు టైం టేబుళ్లను షేర్ చేసారు.

టీవీ9 కన్నడ వారి ప్రకారం, పాఠశాల విద్యా శాఖ మంత్రి అయిన మధు బంగారప్ప కుడా ఈ విషయం పై స్పందించారు.. ఆ కథనం ప్రకారం, బంగారప్ప మాట్లాడుతూ మార్చ్ 1 నాడు, ఇంటర్మీడియట్ పరీక్షకు అడ్డు అవటంతోనే  పదవ తరగతి పరీక్షను మార్చాము అని చెప్పారు. విద్యార్థులకు సౌకర్యంగా ఉండడానికి ఈ విధమయిన మార్పు చేశామని, ఏ ఒక్క మతం కోసం కాదని తెలియజేసారు.

తీర్పు :

మార్చ్ 1 శుక్రవారం ఉదయం జరగాల్సిన పదవ తరగతి  పరీక్షని అదే రోజు ఇంటర్మీడియట్ పరీక్ష ఉండటం తో మధ్యాహ్నానికి వాయిదా వేశారు. దీనిలో ఏ మతపరమయిన కోణం లేదు. కాబట్టి మేము దీనిని అబద్దం అని నిర్ధారించాము.

(అనువాదం: రాజేశ్వరి పరస)

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , हिंदी , తెలుగు , ಕನ್ನಡ

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.