మలేషియాకి చెందిన వీడియోని ఇండియాలో ‘కొత్త రైల్వే టెక్నాలజీ’గా షేర్ చేశారు

ద్వారా: అజ్రా అలీ
ఫిబ్రవరి 6 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
మలేషియాకి చెందిన వీడియోని ఇండియాలో ‘కొత్త రైల్వే టెక్నాలజీ’గా షేర్ చేశారు

సామాజిక మాధ్యమాలలో సర్కులేట్ అవుతున్న వైరల్ పోస్ట్స్ స్క్రీన్ షాట్స్ (సౌజన్యం: ఎక్స్/ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

ఈ వైరల్ వీడియో మలేషియాలో చైనా కమ్యూనికేషన్స్ కన్స్ట్రక్షన్ కంపెనీ వారి రైల్వే ప్రాజెక్టుకి సంబంధించినది.

క్లైమ్ ఐడి 36b205db

క్లైమ్ ఏంటి?

ఒక యంత్రం రైల్వే పట్టాలని ఏర్పాటు చేస్తున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమలలో వైరల్ అయ్యింది. ఇండియాలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన రైల్వే సాంకేతికత అని క్లైమ్ చేస్తూ ఈ వీడియోని షేర్ చేస్తున్నారు. ఎక్స్ (పూర్వపు ట్విట్టర్)లో ఒక యూజర్ ఈ వీడియోని షేర్ చేసి “ప్రస్తుతం భారత ప్రభుత్వం వాడుతున్న సాంకేతికత ఇది. గత అరవై ఏళ్లు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు పన్ను వసూళ్లని స్విస్ బ్యాంకులకి మళ్లించడం కారణంగా నేటి వరకు ఈ సాంకేతికత మనకు అందుబాటులోకి రాలేదు” అనే శీర్షిక హిందీలో పెట్టారు.

ఇటువంటి పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ , ఇక్కడ , మరియు ఇక్కడ చూడవచ్చు. 

సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే ఈ వీడియో మలేషియాకి చెందినది.

మేము ఏమి తెలుసుకున్నాము?

ఈ వీడియోని జాగ్రత్తగా గమనించినప్పుడు అందులో ఉన్న పసుపుపచ్చ యంత్రం మీద ‘చైనా కమ్యూనికేషన్స్ కన్స్ట్రక్షన్’ అనే పదాలు మాకు కనిపించాయి. ఈ వీడియోలోని కీ ఫ్రేమ్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతికితే, ఇదే వీడియోని ఎక్స్ లో జనవరి 9, 2024 నాడు TripinChina అనే అకౌంట్ నుండి పోస్ట్ చేశారని తెలుసుకున్నాము. “మలేషియాలోని తూర్పు కోస్తా రైల్వే పట్టాలు వేయడం మొదలుపెట్టింది,” అని ఈ పోస్ట్ లో రాశారు. 

వైరల్ వీడియో స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

దీని గురించి మరింత పరిశోధించగా, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా వారి అధికారిక వార్తా ఏజెన్సీ అయిన షిన్వా న్యూస్ ఏజెన్సీ దీని గురించి డిసెంబర్ 12, 2024 నాడు ఒక కథనం ప్రచురించింది అని తెలుసకున్నాము. “మలేషియా మెగా రైల్ ప్రాజెక్ట్ లో భాగంగా తొలి పట్టాలు వేయటం జరిగింది” అనేది ఈ కథనం శీర్షిక. వైరల్ వీడియోలో ఉన్న విజువల్స్ ఈ కథనంలో కూడా ఉన్నాయి. వైరల్ వీడియో స్క్రీన్ షాట్ ని, ఈ కథనంలో ఫొటోని పోల్చి చూస్తే రెండిటిలోనూ ఆ పసుపచ్చని యంత్రం మీద ఎర్ర రంగు బోర్డు మనం చూడవచ్చు. ఈ బోర్డు మీద మలేషియా రైల్ లింకు (ఏంఆర్ఎల్) వారి గుర్తు ఉంది. 

వైరల్ వీడియో, షిన్వా వారి 2023 నాటి కథనంలోని ఫొటో మధ్య పోలికలు (సౌజన్యం: షిన్వా న్యూస్/ఎక్స్/స్క్రీన్ షాట్స్)

ఈ యంత్రం మలేషియా ఈస్ట్ కోస్ట్ రైల్ లింకు అనే మెగా రైల్ ప్రాజెక్టులో భాగం అని ఈ కథనంలో ఉంది. ఈ ప్రాజెక్టుని నిర్మిస్తుంది చైనా కమ్యూనికేషన్స్ కన్స్ట్రక్షన్ కంపెనీ అనే సంస్థ. ఈ యంత్రం ద్వారా తొలి పట్టాలని డిసెంబర్ 11, 2023 నాడు మలేషియా రాజు కింగ్ సుల్తాన్ అబ్దుల్లా సుల్తాన్ అహ్మద్ షా సమక్షంలో వేశారు.

అదే విధంగా, china.org.cn అనే ఆన్లైన్ చైనీస్ వార్తా సంస్థ డిసెంబర్ 12, 2023 నాడు ఈ యంత్రం ఫొటోలని తమ ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. “చైనా కమ్యూనికేషన్స్ కన్స్ట్రక్షన్ కంపెనీ మలేషియాలో నిర్మిస్తున్న ఈస్ట్ కోస్ట్ రైల్ లింకు అనే మెగా రైల్ ప్రాజెక్టులో భాగంగా తొలి పట్టాలని సోమవారం నాడు వేశారు” అని ఈ పోస్ట్ లో పేర్కొన్నారు. 

దీని ద్వారా ఈ వీడియో భారత దేశానికి సంబంధించినది కాదని సుస్పష్టం.

తీర్పు

మలేషియాలో ఒక యంత్రం రైల్ పట్టాలు నిర్మిస్తున్న వీడియోని భారత దేశంలో అందుబాటులోకి వచ్చిన కొత్త రైల్వే సాంకేతికత వీడియోగా క్లైమ్ చేశారు. కాబట్టి ఈ క్లైమ్ అబద్ధం అని మేము నిర్ధారించాము. 

(అనువాదం- గుత్తా రోహిత్)

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , हिंदी , తెలుగు

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.