‘తాను జనాలని మోసం చేశాను’ అని జగన్ మోహన్ రెడ్డి ‘ఒప్పుకుంటునట్టున్న’ వీడియో ఎడిటెడ్ వీడియో

ద్వారా: రోహిత్ గుత్తా
ఏప్రిల్ 24 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
‘తాను జనాలని మోసం చేశాను’ అని జగన్ మోహన్ రెడ్డి ‘ఒప్పుకుంటునట్టున్న’ వీడియో ఎడిటెడ్ వీడియో

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తాను జనాలని 'మోసం చేశానని ఒప్పుకుంటున్న' వీడియో అని క్లైమ్ చేసిన సామాజిక మాధ్యమ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

ఒరిజినల్ వీడియోలో జగన్ ప్రతిపక్ష కూటమి జనాలని మోసం చేసింది అని విమర్శించారు.

క్లైమ్ ఐడి 11efd348

క్లైమ్ ఏంటి?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వై ఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత  జగన్ మోహన్ రెడ్డి తాను జనాలని మోసం చేశాను అని ఒప్పుకుంటున్న వీడియో అని క్లైమ్ చేస్తూ ఒక 16 సెకన్ల వీడియోని సామాజిక మాధ్యమాలలో షేర్ చేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో శాసనసభ, లోక్ సభ ఎన్నికలు మే 13 నాడు జరగనున్నాయి.

“ఈ ఎన్నికలలో మీ బిడ్డ, మీ బిడ్డ ఒక్కడు, అందరినీ మోసం చేశాడు కాబట్టి, చెప్పుకునేందుకు ఏ మంచీ లేదు కాబట్టి, ఒంటరిగా బయలదేరాడు ఎన్నికలలో యుద్ధానికి,” అని జగన్ అనటం మనం వినవచ్చు. ఈ క్లిప్ షేర్ చేసిన సామాజిక మాధ్యమ పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ  మరియు ఇక్కడ  చూడవచ్చు. 

సామాజిక మాధ్యమ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే ఇది ఎడిటెడ్ వీడియో. ఒరిజినల్ వీడియోలో జగన్ ప్రతిపక్ష కూటమిని విమర్శిస్తున్నారు. ప్రతిపక్ష కూటమిలో తెలుగుదేశం పార్టీ, జన సేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఉన్నాయి.

మేము ఏమి తెలుసుకున్నాము?

ఈ వీడియో కీ ఫ్రేమ్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతుకుగా ఒరిజినల్ వీడియో మాకు లభించింది. ఏప్రిల్ 19, 2024 నాడు కాకినాడలో జరిగిన మేమంతా సిద్ధం సభ వీడియో ఇది. ఈ సభని సాక్షి చానల్ లైవ్ స్ట్రీమ్ చేసింది. వైరల్ వీడియోలో కూడా సాక్షి లోగో చూడవచ్చు.

ఈ ఒరిజినల్ వీడియోలో జగన్ 22:55 నుండి 23:21 మధ్య చేసిన వ్యాఖ్యలని క్రాప్ చేసి, వేరే చోట్ల జొప్పించి వైరల్ వీడియోని చేశారు.

ఈ భాగంలో జగన్, “ఈ ఎన్నికలలో ఇంటింటికీ మీ బిడ్డ మంచి చేశాడు కాబట్టి, మీ బిడ్డ ఒంటరిగా బయలదేరాడు ఎన్నికలలో యుద్ధానికి. అందరినీ మోసం చేశాడు కాబట్టి, చెప్పుకునేందుకు ఏ మంచీ లేదు కాబట్టి, కూటమిగా వారందరూ కూడా ఏకం అయ్యారు. మీ బిడ్డ ఒక్కడు, నక్కలు, తోడేళ్ళు అనేక మంది,” అని చెప్పటం మనం వినవచ్చు.

ఈ భాగంలో నుండి “మోసం చేశాడు కాబట్టి, చెప్పుకునేందుకు ఏ మంచీ లేదు కాబట్టి” అనే భాగాన్ని క్రాప్ చేసి, తన గురించి తాను మాట్లాడుతున్న భాగంలోకి జొప్పించి, తాను ప్రజలని మోసం చేశానని ఒప్పుకుంటున్నట్టుగా వైరల్ వీడియోని చేశారు. అయితే ఒరిజినల్ వీడియోలో, తాను ప్రతిపక్ష కూటమిని విమర్శిస్తున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలకి సంబంధించి ఇటువంటి అనేక ఎడిటెడ్ వీడియోలని లాజికల్లీ ఫ్యాక్ట్స్ డీబంక్ చేసింది. వాటిల్లో కొన్నిటిని ఇక్కడ  మరియు ఇక్కడ  చదవొచ్చు. 

తీర్పు

ఎడిటెడ్ వీడియో క్లిప్ షేర్ చేసి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తాను జనాలని మోసం చేశానని ఒప్పుకున్నారని క్లైమ్ చేశారు. అయితే ఒరిజినల్ వీడియోలో తను ప్రతిపక్ష కూటమి జనాలని మోసం చేసింది అని విమర్శించారు. కాబట్టి ఈ క్లైమ్ అబద్ధం అని మేము నిర్ధారించాము. 

(అనువాదం- గుత్తా రోహిత్)

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , తెలుగు

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.