ఏడుస్తున్న ఒక బాలుని వీడియో షేర్ చేసి కేరళ ప్రభుత్వం శబరిమల భక్తులని ఇబ్బంది పెడుతున్నదని క్లైమ్ చేశారు

ద్వారా: ఉమ్మే కుల్సుం
డిసెంబర్ 14 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
ఏడుస్తున్న ఒక బాలుని వీడియో షేర్ చేసి కేరళ ప్రభుత్వం శబరిమల భక్తులని ఇబ్బంది పెడుతున్నదని క్లైమ్ చేశారు

శబరిమల భక్తుల మీద పోలీసులు చర్యలు తీసుకున్నారని, అందులో భాగంగా ఒక బాలుడిని అదుపులోకి తీసుకున్నారని క్లైమ్ చేస్తూ షేర్ చేసిన వీడియో స్క్రీన్ షాట్స్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

శబరిమల తీర్థయాత్రలో తప్పిపోయిన ఒక పిల్లవాడు తన తండ్రి కోసం ఏడుస్తున్న వీడియో ఇది. ఈ పిల్లవాడిని పోలీసులు అదుపులోకి తీసుకోలేదు.

క్లైమ్ ఐడి 7b280225

శబరిమల అయ్యప్ప తీర్థయాత్ర ఈ సంవత్సరం నవంబర్ 17 నాడు మొదలయ్యింది. ఇది డిసెంబర్ 26 వరకు కొనసాగుతుంది. 

క్లైమ్ ఏంటి?

శబరిమల తీర్థయాత్రకి లక్షల మంది భక్తులు వెళ్తున్నారు. ఈ నేపధ్యంలో శబరిమలలో ఏడుస్తున్న ఒక పిల్లవాని వీడియో షేర్ చేసి కేరళ ప్రభుత్వం భక్తులని ఇబ్బంది పెడుతున్నది అనే అర్థం వచ్చేటట్టు క్లైమ్ చేస్తున్నారు.

హిందూ మితవాద వర్గానికి చెందిన సామాజిక మాధ్యమ యూజర్లు ఈ వీడియో షేర్ చేసి సిపిఎం అధికారంలో ఉన్న కేరళ ప్రభుత్వం హిందూ భక్తులని ‘ఇబ్బందులు పెడుతున్నదని’ క్లైమ్ చేశారు. మిస్టర్ సిన్హా అనే ఎక్స్ (పూర్వపు ట్విట్టర్) యూజర్ ఈ వీడియో షేర్ చేసి, “కేరళలో హిందువుల పరిస్థితి. పిల్లలని కూడా వదిలిపెట్టడం లేదు..#sabarimala,” అనే శీర్షిక పెట్టారు (ఆర్కైవ్ ఇక్కడ). రిషీ బాగ్రీ అనే ఇంకొక యూజర్ ఈ వీడివ షేర్ చేసి,”భక్తులతో నిరంకుశంగా ప్రవర్తిస్తున్న కేరళలో హిందువుల పరిస్థితి. కేరళ ప్రభుత్వం పిల్లలని కూడా వదలటం లేదు,” అనే శీర్షిక పెట్టారు (ఆర్కైవ్ ఇక్కడ).  వీరిద్దరూ కూడా గతంలో తప్పుడు సమాచారం షేర్ చేసిన చరిత్ర కలవారు. 

ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ సమన్వయకర్త సునీల్ దేవ్ ధర్ కూడా ఈ వీడియోని తన ఎక్స్ ఎకౌంట్ లో షేర్ చేశారు. ఈ పోస్ట్ ఆర్కైవ్ మరియు ఇటువంటి ఇతర పోస్ట్ ఆర్కైవ్ ఇక్కడ  మరియు ఇక్కడ  చూడవచ్చు. 

ఆన్లైన్ లో షేర్ చేసిన తప్పుడు క్లైమ్స్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

తప్పుడు క్లైమ్స్ తో, మతం రంగు పులిమి ఈ వీడియోని షేర్ చేస్తున్నారు. 

మేము ఏమి తెలుసుకున్నాము?

వైరల్ వీడియోలో ఆసియా నెట్ న్యూస్ అనే మలయాళం చానల్ లోగో ఉంది. ఆ చానల్ ఈ వీడియోని డిసెంబర్ 12 నాడు ప్రచురించింది. “శబరిమలలో జనసందోహం: తన తండ్రి కోసం వెతుకుతూ ఏడుస్తున్న ఒక బాలుని హృదయ విదారక వీడియో. చూడండి,” అనేది ఈ వీడియో శీర్షిక. ఈ వీడియోలో బాలుడు చేతులు జోడించి ‘అప్ప, అప్ప’ (అంటే, నాన్న) అంటూ ఏడవటం మనం చూడవచ్చు. వాహనం బయట నుంచుని ఉన్న ఒక పోలీసు అధికారి ఈ బాలుడిని సముదాయించటం కూడా మనం ఇందులో చూడవచ్చు. 

ఆసియా నెట్ లో ప్రచురించిన ఒక కథనం- ఈ కథనంలో మనం వైరల్ వీడియోలో ఉన్న విజువల్స్ చూడవచ్చు- ప్రకారం, నిలక్కల్ లో ఒక బాలుడు తప్పిపోయాడు. నిలక్కల్ అనేది కొండ పైన ఉన్న అయ్యప్ప గుడికి ఎక్కే ముందు వచ్చే బేస్ క్యాంప్.  ఈ కథనాన్ని డిసెంబర్ 12 నాడు ప్రచురించారు. తమ ఎక్స్ అకౌంట్ లో షేర్ చేసిన వీడియోనే ఆసియా నెట్ వారు ఇందులో కూడా పొందుపరిచారు. “చేతులు కట్టుకుని పోలీసుల ఎదుట ఏడుస్తున్న బాలుడు తన తండ్రిని చూడగానే చేతులు ఊపాడు,” అని ఈ కథనంలో ఉంది. 

ఆసియా నెట్ న్యూస్ ఎక్స్ పోస్ట్ స్క్రీన్ షాట్. వైరల్ వీడియోలో, ఆసియా నెట్ న్యూస్ వీడియోలో వాహనం రిజిస్ట్రేషన్ సంఖ్య, లోగో మనం చూడవచ్చు. (సౌజన్యం: ఎక్స్/ఆసియా నెట్ న్యూస్ ఇంగ్లీష్)

ఆసియా నెట్ న్యూస్ లో పేర్కొన్న వివరాలకి సంబంధించి లాజికల్లీ ఫ్యాక్ట్స్ కేరళ పోలీసులని సంప్రదించింది. వైరల్ క్లైమ్ ని ఖండిస్తూ పంపా పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్. మహేష్ కుమార్ మాతో మాట్లాడుతూ, “ఈ ఘటన నిలక్కల్ బేస్ క్యాంప్ దగ్గర చోటు చేసుకుంది. శబరిమల వెళ్ళటానికి నిలక్కల్ ప్రధాన ద్వార మార్గం. వీడియోలో ఉన్న బాలుని తండ్రి బాలూడ్ ఎక్కిన బస్సు ఎక్కలేకపోయాడు. దానితో ఆ పిల్లవాడు తండ్రి కోసం వెతుకుతూ ఏడుస్తున్నాడు,” అని చెప్పారు. 

కేరళ పోలీస్ ప్రజా సమాచార అధికారి ప్రమోద్ కుమార్ కూడా లాజికల్లీ ఫ్యాక్ట్స్ తో మాట్లాడుతూ మతం రంగు పులిమి ప్రచారం చేస్తున్న ఈ క్లైమ్ అబద్ధం అని స్పష్టం చేశారు. “భారీ జన సందోహాన్ని నియంత్రించడానికి నిలక్కల్-పంపా మార్గం తిరిగే బస్సుల సంఖ్యని అధికారులు కట్టడి చేశారు. ఈ మార్గం ద్వారానే భక్తులు సాధారణంగా శబరిమలకి వస్తుంటారు. బాగా రద్దీ ఉండటంతో ఈ బాలుడు తప్పిపోయాడు. అయితే నిమిషాలలోనే తన తండ్రికి చేరుకున్నాడు,” అని తను తెలిపారు.

ఈ వీడియో కేరళదేనని నిర్ధారించుకోవడానికి ఆ బస్సు రిజిస్ట్రేషన్ కోడ్ అయిన KL-15 వివరాలు చూశాము. వార్తా సంస్థ ఓఎన్ మనోరమ కథనం ప్రకారం, ఈ కోడ్ ని కేరళ లో ప్రభుత్వ నడిపే బస్సుల కోసమే వాడతారు. ఈ బస్సు మీద లోగో కూడా ఉంది. దీనిని రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతికితే ఈద్ కేరళ స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లోగో అని తెలిసింది. తీర్థయాత్ర కోసం కే ఎస్ టీ సీ ప్రత్యేక బస్సులు నడుపుతుంది. ఈ సమాచారం మనకి శబరిమల గుడి అధికారిక వెబ్సైట్ లో కూడా దొరుకుతుంది. 

బస్సు మీద ఉన్న లోగో కే ఎస్ టీ సీ లోగో మధ్య పోలిక (సౌజన్యం: ఎక్స్/keralartc.com/స్క్రీన్ షాట్)

తీర్పు

శబరిమల తీర్థయాత్ర సమయాలో ఒక బాలుడు తప్పిపోయి, తన తండ్రి కోసం ఏడుస్తున్న వీడియోని కేరళ పోలీసులు ఈ బాలుడిని అదుపులోకి తీసుకున్నారని, కేరళ ప్రభుత్వం భక్తులని ఇబ్బంది పెడుతుందని చెబుతూ క్లైమ్ చేశారు. కాబట్టి ఈ క్లైమ్ అబద్ధం అని మేము నిర్ధారించాము. 

(పోలీసు అధికారుల పేర్లు చేర్చటం జరిగింది)

(అనువాదం- గుత్తా రోహిత్)

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , অসমীয়া , తెలుగు , ಕನ್ನಡ

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.