ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా ఒక హిందూ పూజారితో వర్చువల్ గా సమావేశమైన వీడియో అంటూ షేర్ చేసింది ఎడిటెడ్ వీడియో

ద్వారా: రాజేశ్వరి పరస
డిసెంబర్ 18 2023

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా ఒక హిందూ పూజారితో వర్చువల్ గా సమావేశమైన వీడియో అంటూ షేర్ చేసింది ఎడిటెడ్ వీడియో

వైరల్ క్లైమ్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

ఈ సంవత్సరం జూన్ నెలలో జరిగిన బాలాసోర్ రైలు ప్రమాదం మీద మోదీ సమీక్ష నిర్వహిస్తున్న వీడియో ఇది

క్లైమ్ ఐడి cfa39efe

క్లైమ్ ఏంటి?

ప్రధాన మోదీ, అమిత్ షా, ఇతర అధికారులు హిందూ పూజారైన ప్రేమానంద్ గోవింద్ మహారాజ్ తో వర్చువల్ సమావేశం జరుపుతున్న వీడియో అంటూ ఒక వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యింది. ఒక యూజర్ ఈ వీడియో షేర్ చేసి, “అందరూ ఈ వీడియోని పూర్తిగా విని దేశ హితం కోసం షేర్ చేయండి. మహారాజ్ గారి మాటలు జాగ్రత్తగా వినండి. మోదీతో సహా అందరూ వింటున్నారు. జై శ్రీ రామ్,” అని హిందీలో శీర్షిక పెట్టారు.

డిసెంబర్ 14 నాటికి ఈ వీడియోకి 3, 48,000 వ్యూస్, 2700 రీపోస్ట్స్ ఉన్నాయి. ఇటువంటి క్లైమ్స్ తోనే ఇతరులు కూడా ఇదే వీడియోని షేర్ చేశారు. అటువంటి పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ  మరియు ఇక్కడ  చూడవచ్చు. 

వైరల్ క్లైమ్స్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఫేస్బుక్/స్క్రీన్ షాట్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే ఈ క్లైమ్ తప్పుదోవ పట్టించేటట్టు ఉంది. ఎందుకంటే ఇది ఎడిటెడ్ వీడియో. 

వాస్తవం ఏమిటి?

ఈ వీడియోలోని కీ ఫ్రేమ్స్ ని రివర్స్ ఇమేజ్ లో వెతికితే ఇటువంటి ఆల్ ఇండియా రేడియో వారు జూన్ 3 నాడు పోస్ట్ చేసిన ఇటువంటిదే 19 సెకన్ల వీడియో మాకు దొరికింది. #OdishaTrain Accident: బాలసోర్ రైలు ప్రమాదం మీద అత్యున్నత సమీక్ష సమేవసానికి ప్రధాని మోదీ అధ్యక్షత వహించారు. మోదీ ఈ రోజు బాలాసోర్ సందర్శిస్తారు అని వర్గాలు తెలిపాయి. #BalasoreTrainAccident,” అనేది ఈ వీడియో శీర్షిక.

ఈ ఒరిజినల్ వీడియోలో టీవీలో వైరల్ వీడియోలో ఉన్నట్టు హిందూ పూజారి ఫొటో కాకుండా రైలు సిగ్న్నళ్ళ డిజిటల్ రిప్రజెంటేషన్ మనం చూడవచ్చు. 

సమీక్ష సమావేశం గురించి ఆల్ ఇండియా రేడియో  చేసిన పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం:ఎక్స్)

ఏబీపీ లైవ్ కూడా ఈ సమావేశం గురించి రిపోర్ట్ చేసింది. “కోరమండల్ ఎక్స్ప్రెస్ ప్రమాదం: పరిస్థితిని సమీక్షించడానికి అత్యున్నత సమావేశం ఏర్పాటు చేసిన ప్రధాని మోదీ,” అనేది ఈ రిపోర్ట్ శీర్షిక. జూన్ 3 నాడు ఈ రిపోర్ట్ చేశారు. ఆల్ ఇండియా రేడియో వారు పెట్టిన ఫొటో లాంటిదే వీళ్ళు తమ రిపోర్ట్ లో పెట్టారు. 

ఏబీపీ లైవ్ వారి వార్తా కథనం స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఏబీపీ న్యూస్ లైవ్) 

మోదీ, అమిత్ షా ప్రేమానంద్ గోవింద్ మహరాజ్ తో సమావేశం అయ్యారంటూ ఎటువంటి వార్తా కథనాలు కూడా లేవు.

అలాగే వైరల్ వీడియోని జాగ్రత్తగా గమనిస్తే 2:14 దగ్గర ప్రేమానంద్ మొహం ఆర్ ఎస్ ఎస్ అధ్యక్షులు మోహన్ భగవత్ వేపు తిరిగి ఉన్నారు. ప్రధానితో సమావేశం అయ్యుంటే తన వైపు తిరిగి ఉండాలి వాస్తవంగా. 

ఆర్ఎస్ఎస్ అధ్యక్షులు మొహం భగవత్ టీవీలో ఉన్న వైరల్ వీడియో స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

కీ వర్డ్స్ వాడి సెర్చ్ చేస్తే ఈ మోహన్ భగవత్ వీడియో మాకు దొరికింది. భజన్ మార్గ్ అనే యూట్యూబ్ చానల్ ఈ వీడియోని నవంబర్ 29, 2023 నాడు అప్లోడ్ చేశారు. వైరల్ వీడియోలో ఉన్న భగవత్ ఫొటోనే ఈ వీడియోలో కూడా మనం చూడవచ్చు.

తీర్పు 

రెండు వేర్వేరు సంఘటనలకు సంబంధించిన ఫొటోలని వాడి ఎడిట్ చేసిన వీడియో సృష్టించారు. కాబట్టి ఈ క్లైమ్ అబద్ధం అని మేము నిర్ధారించాము. 

(అనువాదం- గుత్తా రోహిత్)

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , অসমীয়া , తెలుగు , ಕನ್ನಡ

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.