యోగా శిక్షకుని వీడియో షేర్ చేసి న్యూజిలాండ్ హోమ్ మంత్రి హిందూ మతం స్వీకరించారని క్లైమ్ చేశారు

ద్వారా: మహమ్మద్ సల్మాన్
ఫిబ్రవరి 7 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
యోగా శిక్షకుని వీడియో షేర్ చేసి న్యూజిలాండ్ హోమ్ మంత్రి హిందూ మతం స్వీకరించారని క్లైమ్ చేశారు

వైరల్ పోస్ట్ స్క్రీన్ షాట్స్ (సౌజన్యం: ఎక్స్/ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

ఈ వీడియోలో ఉన్న వ్యక్తి అమెరికాలో జన్మించిన బ్రెంట్ గోబ్ల్ అనే యోగా శిక్షకులు. ఈ వ్యక్తి న్యూజిలాండ్ హోమ్ మంత్రి కాదు. ఆ దేశంలో ఆ పదవి లేదు కూడా.

క్లైమ్ ఐడి 0324d849

క్లైమ్ ఏంటి?

హైందవ పూజలు చేస్తున్న ఒక వ్యక్తి వీడియో షేర్ చేసి, తాను న్యూజిలాండ్ హోమ్ మంత్రి అని, తాను ‘సనాతన ధర్మం’ - అంటే హైందవ మతం- పుచ్చుకున్నాడని క్లైమ్ చేశారు.  ఈ వీడియో ఎక్స్ (పూర్వపు ట్విట్టర్), ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాలలో బాగా వైరల్ అయ్యింది. ఈ పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ  చూడవచ్చు. 

వైరల్ పోస్ట్ స్క్రీన్ షాట్స్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

మేము ఎలా తెలుసుకున్నాము?

న్యూజిలాండ్ హోమ్ మంత్రి కనుక హైందవ మతం పుచ్చుకుని ఉంటే అది ప్రపంచ వ్యాప్తంగా వార్తా అయ్యుండేది. అయితే అటువంటి వార్తా కథనమేదీ లేదు.

మరీ ముఖ్యంగా, న్యూజిలాండ్ దేశంలో హోమ్ మంత్రి అనే పదవే లేదు. న్యూజిలాండ్ ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ ప్రకారం అక్కడ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ మాత్రం ఉంది. ఈ శాఖ మంత్రి పేరు హాన్ బ్రూక్ వాన్ వెల్డెన్. తాను పని ప్రదేశపు సంబంధాలు మరియు భద్రత మంత్రి కూడా. ఈ వ్యక్తి మహిళ కాగా, వైరల్ వీడియోలో ఉన్న వ్యక్తి పురుషుడు. 

న్యూజిలాండ్ అంతర్గత వ్యవహారాల శాఖా మంత్రి బ్రూక్ వాన్ వెల్డెన్ (సౌజన్యం: న్యూజిలాండ్ ప్రభుత్వపు అధికారిక వెబ్సైట్)

వైరల్ వీడియోలో ఉన్న వ్యక్తి ఎవరు?

ఈ వీడియోని జాగ్రత్తగా గమనిస్తే కుడి వైపు మూలన IBRENTGOBLE అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పేరు కనిపించింది. బ్రెంట్ గోబ్ల్ అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ యూజర్ నేమ్ ఇది. 

ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుండి ఈ వీడియోని నవంబర్ 2, 2023 నాడు షేర్ చేశారు. “నిన్న రాత్రి అలెక్స్ నామకరణ కార్యక్రమం జరిగినది. నేను హైందవ మతాచారాలలో పెరగకపోయినా కూడా నా భార్య, తన తల్లి తండ్రులు తమకి ముఖ్యమైనవి అనుకున్న కార్యక్రమాలలో పాలుపంచుకోవడం నాకు ఇష్టం. నా కొడుకు జీవితంలో ఆకర్షవంతంగా పెరుగాలని అవసరమైన సవాళ్ళు ఎదుర్కోవాలని, వాటితో ఇష్టంగా పోరాడాలని, నిండైన హృదయంతో ప్రేమించాలని నేను ప్రార్ధించాను,” అనేది ఈ వీడియో శీర్షిక. 

తన ఇన్స్టాగ్రామ్ బయో ప్రకారం బ్రెంట్ గోబ్ల్ యోగా శిక్షకుడు, ‘పీస్ ఆఫ్ బ్లూ యోగా’ అనే యోగా కేంద్రాన్ని నడుపుతున్నాడు. ఈ బయోలోనే తన యోగా బ్లాగ్ లింకు కూడా ఉంది. తన యోగా శిక్షణని మెచ్చుకుంటూ విద్యార్ధులు ఇచ్చిన ప్రశంసలు ఈ బ్లాగ్ లో ఉన్నాయి. 

గోబ్ల్ అమెరికాలో పెరిగాడని, ప్రస్తుతం గోవాలో నివసిస్తూ యోగా శిక్షణ ఇస్తున్నాడని మేము తెలుసుకున్నాము. తాను భారత దేశ టీవీ నటి ఆష్కా గొరాడియా భర్త కూడా. వారిద్దరూ 2017లో పెళ్లి చేసుకున్నారు. వారికి నవంబర్ 2023లో ఒక అబ్బాయి జన్మించాడు. ఆష్కా బ్రెంట్ తో కలిసి దిగిన అనేక ఫొటోలని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది.

తీర్పు

వైరల్ వీడియోలోని వ్యక్తి న్యూజిలాండ్ హోమ్ మంత్రి అని, తాను హైందవం స్వీకరిస్తున్న వీడియో అని చేసిన క్లైమ్ అబద్ధం. ఈ వీడియోలో ఉన్నది అమెరికాలో పుట్టి, ప్రస్తుతం గోవాలో నివసిస్తున్న యోగా శిక్షకుడు బ్రెంట్ గోబ్ల్. తాను టీవీ నటి ఆష్కా గొరాడియా భర్త. అలాగే న్యూజిలాండ్ లో హోమ్ మంత్రి అన్న పదవే లేదు. ఆలాగే హోమ్ మంత్రి లాంటి పదవైన అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి మహిళ. కాబట్టి ఈ క్లైమ్ అబద్ధం అని మేము నిర్ధారించాము. 

(హిందీ నుండి ఆంగ్లం అనువాదం- అజ్రా అలీ)

(తెలుగు అనువాదం- గుత్తా రోహిత్)

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , हिंदी , తెలుగు , ಕನ್ನಡ

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.