రాజస్థాన్ కి చెందిన పాత వీడియోని చూపి నాసిక్ లో భారత్ జోడో యాత్ర మొదలవుతుంది అని షేర్ చేసారు

ద్వారా: ఉమ్మే కుల్సుం
మార్చి 18 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
రాజస్థాన్ కి చెందిన పాత వీడియోని చూపి నాసిక్ లో భారత్ జోడో యాత్ర మొదలవుతుంది అని షేర్ చేసారు

సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు తప్పుదారి పట్టించేది

రాజస్థాన్ లోని దౌసా అనే ప్రాంతంలో భారత్ జోడి యాత్ర సందర్బంగా ఈ వీడియోని 2022 లో తీశారు. ఇది మహారాష్ట్రకి చెందినది కాదు.

క్లైమ్ ఐడి 7bd41be0

నేపధ్యం

భారత్ జోడో న్యాయ యాత్ర అనేది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేపడుతున్న రోడ్డుషో. భారతదేశానికి తూర్పున జనవరి 14 న, 2024 న ఈ యాత్ర మణిపూర్ లోని తౌబాల్ లో మొదలయ్యి పడమరలో ఉన్న ముంబైలో ముగియనుంది.


క్లెయిమ్ ఏమిటి ?

మార్చ్ 15 నాటికి భారత్ జోడో న్యాయ యాత్ర మహారాష్ట్ర లోని నాసిక్ కి చేరుకుంది, ఈ నేపధ్యంలో సామాజిక మాధ్యమాలలో ఒక వీడియో వైరల్ అవుతుంది. వైరల్ అవుతున్న వీడియో నాసిక్ లో భారత్ జోడో న్యాయ యాత్రకు వచ్చిన స్పందన అంటూ షేర్ అవుతుంది. ఎక్స్ (పూర్వపు ట్విట్టర్) లో ఒక యూజర్ షేర్ చేస్తూ, నాసిక్ లోని భారత్ జోడో న్యాయ యాత్రకి లక్షలాది మంది ప్రజలు వచ్చారు అని రాసారు. మారాఠా ప్రజల మద్దతు రాహుల్ గాంధీకి ఉందంటూ రాసారు. ఆర్కైవ్ చేసిన పోస్టులను ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. కాంగ్రెస్ పార్టీకి చెందిన అధికారిక అకౌంట్ ల నుండి కుడా ఈ వీడియోని షేర్ చేసారు. వాటి ఆర్కైవ్ పోస్టులను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. 

సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)


మేము ఏమి కనుగొన్నము?

వైరల్ అవుతున్న వీడియోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా వెతికగా, ఈ వీడియో ఆన్లైన్ లో డిసెంబర్ 2022 నుండి ఉందని అర్ధమయింది. కాంగ్రెస్ పార్టీ వారి అధికారిక ఎక్స్ అకౌంట్ లో ఈ వీడియోని డిసెంబర్ 16 నాడు, 2022 న రాజస్థాన్ లోని భారత్ జోడో యాత్ర దృశ్యాలు అంటూ షేర్ చేసారు. భారత్ జోడో యాత్ర సెప్టెంబర్ 2022 నాడు మొదలయ్యింది.

దైనిక్ భాస్కర్ పాత్రికేయుడు అరవింద్ చోటియా కుడా, ఈ వీడియోని డిసెంబర్ 16, 2022 నాడు వారి ఎక్స్ అకౌంట్ లో షేర్ చేసారు. దీనికి శీర్షిక గా దౌసాలో భారత్ జోడో యాత్రకు వచ్చిన ప్రజలు అని పేర్కొన్నారు.


లాజికల్లీ ఫ్యాక్ట్స్ వైరల్ వీడియోలో కనిపిస్తున్న ప్రదేశం రాజస్థాన్ లోని దౌసా అని గూగుల్ మ్యాప్స్ ద్వారా గుర్తించింది. గూగుల్ స్ట్రీట్ వ్యూ ఫోటోల ద్వారా ఒకేలాగా ఉండే గ్రిల్ డివైడర్లను చూసాము, ఇక్కడ ఒక పసుపు పచ్చ రంగు లో షట్టర్ కుడా ఉంది, వైరల్ వీడియోలో కుడా ఇదే కనిపిస్తుంది. పైగా వైరల్ వీడియో లో 0:12 మార్క్ వద్ద ఒక వైట్ బ్యానర్ వెనక కనపడే బిల్డింగ్ గూగుల్ మ్యాప్స్ లో కుడా కనపడింది, ఇది గూగుల్ మ్యాప్స్ ప్రకారం దౌసా హెడ్ పోస్ట్ ఆఫీస్. వైరల్ వీడియోని మరియు గూగుల్ స్ట్రీట్ వ్యూ కి మధ్య పోలిక (సౌజన్యం : ఎక్స్/ గూగుల్ మ్యాప్స్)

తీర్పు

2022 లో భారత్ జోడి యాత్ర వీడియోని తప్పుగా 2024 లో నాసిక్ కి చెందిన వీడియో గా షేర్ చేసారు. కనుక మేము దీనిని తప్పుదోవ పట్టించేటట్టు ఉందని నిర్ధారించాము.

(అనువాదం : రాజేశ్వరి పరస)

Read this check in English here.

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , অসমীয়া , తెలుగు

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.