2017 నాటి వార్తా కథనం షేర్ చేసి లోక్ సభ ఎన్నికలకి ముందు ‘బీజేపీ ఈవిఏం టాంపరింగ్’ చేస్తున్నదని క్లైమ్ చేశారు

ద్వారా: అనెట్ ప్రీతి ఫుర్తాధో
ఏప్రిల్ 5 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
2017 నాటి వార్తా కథనం షేర్ చేసి లోక్ సభ ఎన్నికలకి ముందు ‘బీజేపీ ఈవిఏం టాంపరింగ్’ చేస్తున్నదని క్లైమ్ చేశారు

బీజేపీ తాజాగా 'ఈవీఏం టాంపరింగ్' చేసింది అని క్లైమ్ చేసిన పోస్ట్స్ స్క్రీన్ షాట్స్ (సౌజన్యం: ఇన్స్టాగ్రామ్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు తప్పుదారి పట్టించేది

ఇది మధ్య ప్రదేశ్ లో జరిగిన ఘటన. ఈవిఏం టాంపరింగ్ జరుగుతున్నదన్న ఆరోపణతో కూడిన క్లిప్ వైరల్ అయ్యాక అధికారులకి శిక్ష కూడా పడింది.

క్లైమ్ ఐడి 82da54b0

క్లైమ్ ఏంటి?

2024 లోక్ సభ ఎన్నికల నేపధ్యంలో సామాజిక మాధ్యమాలలో ఒక హిందీ వార్తా కథనం వైరల్ అయ్యింది. భారతీయ జనతా పార్టీ తాజా ఈవీఏంలని ఎలా “టాంపర్” చేసిందో ఈ కథనంలో ఉందని క్లైమ్ చేశారు. ఏబీపీ న్యూ చానల్ కి సంబంధించిన క్లిప్ ఇది. దీని మీద హిందీలో “ఏనుగు గుర్తు మీద ఓటు వేస్తే కమలానికి వేసినట్టు స్లీప్ వచ్చింది” అని, అలాగే “మొదటి బటన్ నొక్కాను, కమలం గుర్తుకి ఓటు వేసినట్టు స్లీప్ వచ్చింది” అని కూడా ఉంది.

మధ్య ప్రదేశ్ లోని భిండ్ జిల్లాలో డమ్మీ పరీక్ష అప్పుడు ఈవీఏం సరిగ్గా పని చేయలేదు అని, దీని గురించి కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఫిర్యాదు చేశాక కొంత మంది అధికారులని తమ బాధ్యతల నుండి తొలగించారు అని ఈ వీడియోలో ఏబీపీ యాంకర్ చిత్రా త్రిపాఠి చెప్పడం మనం చూడవచ్చు.  భిండ్ జిల్లాలోని అటేర్ నియోజకవర్గంలో ఈవీఏం మీద ఏ బటన్ నొక్కినా కూడా ఈవిఏంలో ఓటు వేశాక వచ్చే ఓటర్ స్లీప్ లో కమలం గుర్తు మీదే ఓటు వేసినట్టు వస్తున్నాదని కూడా ఈ వీడియోలో తను చెప్పడం మనం చూడవచ్చు.

ఇన్స్టాగ్రామ్ లో కూడా ఈ వీడియోని షేర్ చేసి, “ముఖ్యమైన వార్త..ఎన్నికలలో అక్రమాలు బయటపడ్డాయి..” “ఈవీఏంలు సరిగ్గా పని చేయడం లేదు” అనే శీర్షికలు పెట్టి “#loksabha”, “#elections2024” అనే హ్యాష్ ట్యాగ్ లతో షేర్ చేశారు.

ఈ పోస్ట్స్ ఆర్కైవ్ వెర్షన్స్ ఇక్కడ  మరియు ఇక్కడ  చూడవచ్చు. 

ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అయిన పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఇన్స్టాగ్రామ్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)  

ఎక్స్ (పూర్వపు ట్విట్టర్)లో ఈ వీడియోని షేర్ చేసి, “ఈవీఏం అక్రమాలు మళ్ళీ బయటపడ్డాయి. పత్రికా సమావేశంలో మోదీ ప్రశ్నలకి జవాబులు చెప్పలేనట్టే, ఈవీఏంలు లేకుండా మోదీ గెలవలేడు. ఈవిఏం అంటే ఎవ్రీ ఓట్ టు మోదీ” అనే శీర్షిక పెట్టారు. ఈ పోస్ట్ ఆర్కైవ్ ఇక్కడ  చూడవచ్చు. 

ఎక్స్ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే, ఇది ఏడు సంవత్సరాల మునుపు జరిగిన ఘటన. ప్రస్తుతం జరగబోయే ఎన్నికలకి దీనికి సంబంధం లేదు.

మేము ఏమి తెలుసుకున్నాము?

దీని గురించి గూగుల్ సెర్చ్ చేయగా మరింత నిడివి ఉన్న పూర్తి వీడియో మాకు దొరికింది. “ఈవీఏం వివాదం:  భిండ్ ఎస్ పి, కలెక్టర్ తొలగింపు” అనేది ఈ వీడియో శీర్షిక. ఏప్రిల్ 1, 2017 నాడు ఈ వీడియోని ఏబీపీ న్యూస్ అధికారిక యూట్యూబ్ చానల్ లో అప్లోడ్ చేశారు (ఆర్కైవ్ ఇక్కడ). 

ఈ ఒరిజినల్ వీడియో నిడివి 10 నిమిషాల 32 సెకన్లు. అయితే వైరల్ వెర్షన్ లో ఒరిజినల్ వీడియోలో 1:30 టైమ్ స్టాంప్ వరకు ఉన్న భాగమే ఉంది. మధ్య ప్రదేశ్ లోని  భిండ్ జిల్లాలో ఈవీఏం వివాదం కారణంగా ఆ జిల్లా కలెక్టర్, ఎస్ పి లని విధుల నుండి తొలగించిన విషయం గురించిన వార్తా కథనం ఇది.

ఈ వార్తని ఇతర ప్రధాన స్రవంతి మీడియా సంస్థలు కూడా ప్రచురించాయి.

అదే విధంగా వైరల్ క్లిప్ లో ఉన్న యాంకర్ చిత్రా త్రిపాఠి ఇప్పుడు ఏబీపీ న్యూస్ చానల్ లో పనిచేయడం. సెప్టెంబర్ 2022 నుండి ఆజ్ తక్ చానల్ లో పని చేస్తున్నది.

2017 ఈవీఏం వివాదం ఏమిటి?

భిండ్ జిల్లాలో అటేర్ నియోజకవర్గం, ఉమరియా జిల్లాలో బాంధవ్ఘడ్ నియోజకవర్గం ఉప ఎన్నిక ఏప్రిల్ 7, 2017 నాడు జరగనున్నాయని తేదీలు ప్రకటించారు. ఈ ఎన్నికలకి ముందు ఈవీఏం లో ఏ బటన్ నొక్కిన కూడా బటన్ నొక్కక వచ్చాక స్లీప్ లో బీజేపీ గుర్తు అయిన కమలానికే ఓటు వేస్తునట్టు వస్తునట్టున్న వీడియో ఒకటి వైరల్ అయ్యింది.

దీనితో భారత ఎన్నికల సంఘం  భిండ్ జిల్లాలో 21 మంది అధికారుల నుండి నివేదిక అడిగినది. ఆలాగే కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు మధ్య ప్రదేశ్ ముఖ్య ఎన్నికల నిర్వహణాధికారి షలీనా సింగ్ ని విధుల నుండి తొలగించమని డిమాండ్ చేశారు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో కథనం ప్రకారం, మధ్య ప్రదేశ్ ప్రభుత్వం భిండ్ జిల్లా కలెక్టర్ ని, ఎస్ పి ని తొలగించి, మిగతా 19 మంది మీద చర్యలు తీసుకుంది.

ఇండియన్ ఎక్స్ప్రెస్ లో కథనం ప్రకారం, విచారణ సంఘం వీరి మీద ఉన్న ఆరోపణలని కొట్టిపారేసింది.   

తీర్పు

ఈవీఏం టాంపరింగ్ ఆరోపణలకి సంబంధించి రేగిన వివాదం గురించిన ఏడు సంవత్సరాల క్రితం నాటి వార్తా కథనాన్ని షేర్ చేసి, ఇది తాజాగా జరిగిన ఘటన అని షేర్ చేశారు. కాబట్టి ఈ క్లైమ్ తప్పుదారి పట్టించేటట్టు ఉందని మేము నిర్ధారించాము.  

(అనువాదం- గుత్తా రోహిత్)

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , తెలుగు , ಕನ್ನಡ

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.