రాహుల్ గాంధీని ఎల్. కే. అడ్వాణీ మెచ్చుకున్నారన్న వార్త అబద్ధం

ద్వారా: రాహుల్ అధికారి
మే 13 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
రాహుల్ గాంధీని ఎల్. కే. అడ్వాణీ మెచ్చుకున్నారన్న వార్త అబద్ధం

బిజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అడ్వాణీ రాహుల్ గాంధీని పొగిడారు అని క్లైమ్ చేసిన సామాజిక మాధ్యమ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

ఎల్. కే. అడ్వాణీ అనుంగ శిష్యుడు దీపక్ చోప్రా లాజికల్లీ ఫ్యాక్ట్స్ తో మాట్లాడుతూ ఈ క్లైమ్ ఫేక్ అని స్పష్టం చేశారు.

క్లైమ్ ఐడి f0f93e82

క్లైమ్ ఏంటి?

భారతీయ జనతా పార్టీ నాయకుడు లాల్ కృష్ణ అడ్వాణీ రాహుల్ గాంధీని “భారత రాజకీయాల భవిష్యత్తు” అని అన్నారని ఒక క్లైమ్ సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యింది.

అరుణాచల్ కాంగ్రెస్ అధికారిక అకౌంట్ సహాయ అనేక మంది ఈ క్లైమ్ ని షేర్ చేశారు. “రాహుల్ గాంధీ భారత రాజకీయాల హీరో: లాల్ కృష్ణ అడ్వాణీ (ఎల్. కే. అడ్వాణీ),” అని శీర్షిక అరుణాచల్ కాంగ్రెస్ తన పోస్ట్ కి పెట్టింది. ఈ పోస్ట్ తో పాటు avadhbhoomi.com అనే లింకు ఇచ్చారు. ఇటువంటి పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ  చూడవచ్చు. 

సామాజిక మాధ్యమాలలో వైరల్ అయిన పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే ఈ క్లైమ్ తప్పు. విశ్వసనీయత లేని ఒక వెబ్సైట్ ప్రచురించిన ఒక కథనం నుండి ఈ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అడ్వాణీ ఈ వ్యాఖ్యలు చేశారు అనేదానికి ఏ ఆధారం లేదు.

మేము వాస్తవం ఎలా తెలుసుకున్నాము?

వైరల్ పోస్ట్ లో శీర్షికలో ఈ వ్యాఖ్యలు avadhbhoomi.com నుండి తీసుకున్నాము అని ఉంది. ఈ వెబ్సైట్ లో చూడగా “రాహుల్ గాంధీ భారత రాజకీయాల హీరో: ఎల్. కే. అడ్వాణీ” అనే శీర్షికతో ఈ కథనం ఉంది. మే 8 నాడు ఈ కథనాన్ని ప్రచురించారు. అయితే తరువాత తొలగించేశారు. ఈ కథనం ఆర్కైవ్  ఇక్కడ చూడవచ్చు. 

రాహుల్ గాంధీని పొగిడి, తన లాంటి నాయకుడిని ఇప్పటివరకు చూడలేదు అని అడ్వాణీ అన్నారని ఈ కథనంలో ఉంది. అయితే అడ్వాణీ ఈ వ్యాఖ్యలు ఎప్పుడు, ఎక్కడ చేశారు అనే వివరాలు మాత్రం ఇందులో లేవు. అదే కాక ఈ వెబ్సైట్ లో సూచన  (ఆర్కైవ్ ఇక్కడ) అంటూ “ఇందులో ఉండే సమాచారం విశ్వసనీయత గురించి కానీ, ఇందులో సమాచారం నిజమే అని కానీ avadhbhoomi.com మాట ఇవ్వడం లేదు,” అని ఉంది.

 ఆ తరువాత ఈ వెబ్సైట్ సామాజిక మాధ్యమ ఖాతాలని మేము చూశాము. వారి ఫేస్బుక్  అకౌంట్ లో మార్చ్ 3, 2024 తరువాత పోస్ట్ లు లేవు. వారి ఇన్స్టా గ్రామ్  అకౌంట్ లో సంబంధం లేని, వ్యక్తిగత వీడియోలు ఉన్నాయి. వారి యూట్యూబ్  అకౌంట్ ని యూట్యూబ్ మార్గదర్శకాలని ఉల్లంఘించారని చెబుతూ తొలగించారు.

ఈ వెబ్సైట్ వారిని మేము సంప్రదించాము. వారు జవాబు ఇస్తే ఇక్కడ అప్డేట్ చేస్తాము.

అడ్వాణీ అనుంగ శిష్యుడు దీపక్ చోప్రాని లాజికల్లీ ఫ్యాక్ట్స్ సంప్రదించింది. ఈ క్లైమ్ ని కొట్టిపారేస్తూ, “ఇది పూర్తిగా ఫేక్. అడ్వాణీ గారికి దీనికి సంబంధం లేదు,” అని తెలిపారు. అలాగే అడ్వాణీ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని కూడా నమ్మదగిన వార్తా కథనాలు ఏవీ మాకు లభించలేదు.

తీర్పు

రాహుల్ గాంధీ భారత రాజకీయాల భవిష్యత్తు అని సీనియర్ బిజేపీ నాయకుడు ఎల్. కే. అడ్వాణీ అనలేదు. ఈ క్లైమ్ avadhbhoomi.com అనే ఒక వెబ్సైట్ లో ప్రచురించిన ఒక కథనం నుండి వచ్చింది. కాబట్టి ఈ క్లైమ్ అబద్ధం అని మేము నిర్ధారించాము. 

(అనువాదం- గుత్తా రోహిత్ )

ఈ వాస్తవ తనిఖీని చదవండి

অসমীয়া , తెలుగు , ಕನ್ನಡ

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.