భోపాల్ బేగం ఫొటోని షేర్ చేసి షాజహాన్ భార్య ముంతాజ్ మహల్ అని క్లైమ్ చేసారు

ద్వారా: అజ్రా అలీ
మార్చి 7 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
భోపాల్ బేగం ఫొటోని షేర్ చేసి షాజహాన్ భార్య ముంతాజ్ మహల్ అని క్లైమ్ చేసారు

వైరల్ అవుతున్న పోస్ట్స్  స్క్రీన్ షాట్స్ (సౌజన్యం : ఎక్స్/ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

వైరల్ అవుతున్న ఫొటోలో ఉన్నది భోపాల్ రాణి సుల్తాన్ షాజహాన్ బేగం, ముంతాజ్ మహల్ కాదు.

క్లైమ్ ఐడి 8a7e6d86

క్లెయిమ్ ఏమిటి ?

అట్టహాసంగా దుస్తులు ధరించి ఒక పూల కుండీ ఉన్న బల్ల పక్కన నిలబడి ఉన్న మహిళ ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతుంది. ఈ ఫోటోని షేర్ చేస్తూ, ఇందులో ఉన్నది ముంతాజ్ మహల్ అని, ఈవిడ మొఘల్ చక్రవర్తి  షాజహాన్ భార్య అని, ఈవిడ కోసమే 1631లో తాజ్ మహల్ నిర్మాణాన్ని ప్రారంభించారని పేర్కొన్నారు. ఉత్తర్ ప్రదేశ్ లోని ఆగ్రాలో ఉన్న తాజ్ మహల్ యునిస్కో ప్రపంచ వారసత్వ కట్టడాలలో ఒకటి. 

అవహేళనతో కూడిన వ్యాఖ్యానాలతో కూడా ఈ ఫొటోని షేర్ చేశారు. అలాంటి ఆర్కైవ్ చేసిన పోస్ట్స్ ని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. 

వైరల్ అవుతున్న పోస్ట్స్  స్క్రీన్ షాట్స్ (సౌజన్యం : ఎక్స్/ఫేస్బుక్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే, వైరల్ ఫొటోలో ఉన్నది సుల్తాన్ షాజహాన్ బేగం. ఈవిడ భోపాల్ కి మూడో బేగం (బేగం అంటే ముస్లిం మహిళలకి ఇచ్చే అత్యున్నత బిరుదు).

మేము ఎలా కనుగొన్నాము?

మేము వైరల్ ఫొటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతుకగా, చారిత్రక విషయాల గురించి రాసే వెబ్సైట్లు మాకు లభించాయి. ఈ వెబ్సైట్లలో వైరల్ ఫొటోలో ఉన్న మహిళని భోపాల్ కి చెందిన సుల్తాన్ షాజహాన్ బేగంగా గుర్తించారు. ఈవిడ మధ్య ప్రదేశ్ చరిత్రలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి.

ఈ ఫొటోని మేము రాయల్ కలెక్షన్ ట్రస్ట్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ అనే వెబ్సైటులో కూడా చూసాము. రాయల్ కలెక్షన్ ట్రస్ట్ అనేది బ్రిటిష్ రాజ కుటుంబ వ్యక్తిగత కళా ఖండాల ట్రస్ట్. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద వ్యక్తిగత కళాఖండాల ట్రస్ట్.  


ఆ ఫొటోకి ఇచ్చిన వర్ణన ప్రకారం, ఇది భోపాల్ కి చెందిన సుల్తాన్ షాజహాన్ బేగం ఫొటో. ఆవిడ ఒక పూల కుండీ ఉన్న బల్ల పక్కన నిలబడి ఉంది. ఈ ఫొటోని 1875 నుండి 1876 మధ్య తీసి ఉండవచ్చు అని ఈ వర్ణనలో ఉంది.


రాయల్ కలెక్షన్ ట్రస్ట్ యు.కే వెబ్సైట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: రాయల్ కలెక్షన్ ట్రస్ట్, యు.కే)

వేల్స్ నాటి యువరాజైన ఆల్బర్ట్ ఎడ్వర్డ్ భారత ఉపఖండానికి 1875 నుండి 1876 మధ్యలో విచ్చేసినపుడు, ఐక్కడి విశేషాలని, ముఖ్యమైన వ్యక్తుల ఫొటోలని ఈ విధంగా పొందుపరిచారు. సుల్తాన్ షాజహాన్ బేగం ఫొటో కుడా అప్పటిదే. 

ఇదే ఫొటో భారదేశం ప్రభుత్వం నిర్వహించే ఇండియన్ కల్చర్ అనే వెబ్సైటులో కుడా ఉన్నదని తెలుసుకున్నాము. ఇందులో “షాజహాన్ బేగం, భోపాల్ యొక్క మూడో బేగం” అని శీర్షికతో ఈ ఫొటో ఉంది.

భారతదేశంలోని వివిధ ప్రదేశాలలో ఉన్న వివిధ సంస్థల నుండి సేకరించిన సాంస్కృతిక సమాచారం ఈ వెబ్సైట్ లో ఉంటుంది అని ఈ వెబ్సైట్ లో ఉంది. 

ఇండియన్ కల్చర్ వెబ్సైటు ప్రకారం ఈ ఫొటోలో ఉన్నది సుల్తాన్ షాజహాన్ (1838-1901). ఈవిడ భోపాల్ ని 19వ శతాబ్దం లో పాలించింది. ఈవిడ ప్రజల సంక్షేమం కోసం అనేక విధివిధానాలు రూపొందించారు అని కుడా ఈ వెబ్సైటులో ఉంది. 


ఇండియన్ కల్చర్ వెబ్సైట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం : indianculture.gov.in)


ఆగష్టు 11, 2023 నాటి టైమ్స్ అఫ్ ఇండియా కథనం ప్రకారం, బేగం షాజహాన్ 1871లో భోపాల్ లో తాను నివసించడానికి ఒక కట్టడం నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ భవంతిని రాజ్ మహల్ అని పిలిచేవారు. ఆ తరువాత ఈ భవనానికి ముగ్దులైన బ్రిటిష్ వారు ఈ కట్టడానికి తాజ్ మహల్ కోట అని పేరు పెట్టారు.

తీర్పు :

భోపాల్ కి చెందిన సుల్తాన్ షాజహాన్ బేగం ఫొటోని మొఘల్ రాజు షాజహాన్ భార్య ముంతాజ్ మహల్ అని క్లైమ్ చేస్తూ షేర్ చేశారు. కాబట్టి ఈ క్లైమ్ అబద్ధం అని మేము నిర్ధారించాము. 

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , অসমীয়া , తెలుగు , ಕನ್ನಡ

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.