మయన్మార్ కి చెందిన వీడియోని మణిపూర్ లో కుకీ మహిళను చంపిన ఘటన వీడియోగా షేర్ చేస్తున్నారు

ద్వారా: రజిని కె జి
మే 30 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
మయన్మార్ కి చెందిన వీడియోని మణిపూర్ లో కుకీ మహిళను చంపిన ఘటన వీడియోగా షేర్ చేస్తున్నారు

సామాజిక మాధ్యమాలలో కుకీ మహిళని హింసిస్తున్నారు అన్న క్లెయిమ్ తో వైరల్ అయిన పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

మయన్మార్ కి చెందిన వీడియోని మణిపూర్ లో కుకీ మహిళను చంపిన ఘటన వీడియోగా షేర్ చేస్తున్నారు. మా ఫ్యాక్ట్ చెక్ ఇక్కడ చదవండి.

క్లైమ్ ఐడి 8b42521e

(గమనిక - ఈ కథనంలో మహిళల మీద హింసకి సంబంధించిన వివరణ ఉంది. హింసకి సంబంధించిన ఫుటేజి కారణంగా ఆర్కైవ్ లింక్స్ ఇవ్వటం లేదు. పాఠకులు గమనించగలరు.)

క్లెయిమ్ ఏమిటి?

సామాజిక మాధ్యమాలలో ఒక యూజర్ ఈ విధంగా శీర్షిక పెట్టి ఒక వీడియోని షేర్ చేశారు-  “మణిపూర్ జరిగిన ఘర్షణలకు సాక్ష్యాధారాలు కావాలని సుప్రీంకోర్టు కోరుతుంది, అందుకే ఈ వీడియోను 48 గంటల్లో వైరల్ చేయాలని మిమ్ములను బ్రతిమాలుచున్నాను, దయచేసి అందరికీ షేర్ చేయండి. ఇది భారతదేశ వ్యాప్తంగా పాక్కోవాలి.” ఆ వీడియోలో, ఒక మహిళను నడి వీధిలో కొంతమంది తుపాకులు పట్టుకుని ఉన్న వ్యక్తులు చిత్ర హింసలు పెడుతున్నట్టు ఉంది. 

మణిపూర్ లో మెయితీ మరియు కుకీ తెగల మధ్య మే 2023 నుండి హింస చెలరేగుతుంది, ఇందులో దాదాపుగా 100 మంది దాకా ప్రాణాలు కోల్పోయారు. ఈ మధ్యనే సంవత్సర కాలం కుడా పూర్తి చేసుకుంది.

కానీ పై వీడియో మణిపూర్ కి చెందినది కాదు, ఇది 2022 లో మయాన్మార్ లో జరిగిన సంఘటనకి సంబంధించినది. 

వాస్తవం ఏమిటి?

గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, వైరల్ అవుతున్న వీడియో 2022 నాటిది అని అర్ధమయింది. ఇదే వీడియోని ఆర్ ఎఫ్ ఏ ఇండిపెండెంట్ వాయిస్ అఫ్ ఆసియా అని అమెరికాకి చెందిన ఒక లాభాపేక్షరహిత రేడియో సంస్థ తమ యూట్యూబ్ ఛానల్ లో పబ్లిష్ చేసింది. ఇందులో 0:28 సెకెన్ల వద్ద, వైరల్ వీడియో మాదిరి సన్నివేశాలనే మనం చూడవచ్చు. ఈ వీడియోకి బర్మీస్ లో ఉన్న శీర్షిక ఈ విధంగా ఉంది-  “మిలిటరీ కౌన్సిల్ 7 మంది దాగోన్ విశ్వవిద్యాలయం విద్యార్థులతో సహా 12 మందికి మరణ శిక్ష విధించిన తరువాత, తాము నగరంలో కొంతమంది వ్యక్తులు నడి వీధిలో ఒక మహిళను చంపుతున్న వీడియో సామాజిక మాధ్యమాలలో షేర్ చేయబడింది.”

ఈ సంఘటన గురించి వార్త కథనాల కోసం వెతుకగా, డిసెంబర్ 3, 2022 నాడు ఎన్ పి న్యూస్ ప్రచురించిన కథనం లభించింది. కొంతమంది వ్యక్తులు తుపాకులు పట్టుకుని ఒక 24 సంవత్సరాల మహిళను వీధిలోనే నిర్బంధించి, విచారించి, చిత్రహింసలు పెట్టారని ఈ కథనంలో ఉంది.వైరల్ వీడియోలో ఉన్న ఫొటోలే ఇందులో కూడా ఉన్నాయి. ఆమె మయాన్మార్ లోని తాము నగరంలో ఉపాధ్యాయురాలు అని పేర్కొన్నారు.

మయాన్మార్ నౌ అనే మయాన్మార్ వార్తా వెబ్సైటు కుడా ఈ విషయాన్ని డిసెంబర్ 6, 2022 నాడు ప్రచురించింది. నేషనల్ యూనిటీ ప్రభుత్వానికి చెందిన రక్షణ మంత్రితర శాఖ  కుడా ఈ విషయం గురించి విచారణ చేపట్టింది, దీని గురించి ఒక అధికారి మాట్లాడుతూ, ఈ సంఘటన తాము నగరంలో జూన్ లో చోటు చేసుకుంది అని, పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్ (PDF) కి చెందిన నాలుగవ బెటాలియన్ కి చెందిన కొంతమంది దీనికి పాల్పడినట్లుగా తెలిపారు. పైగా అందులో కనపడిన మహిళ అక్కడి మయాన్మార్ మిలిటరీ ప్రభుత్వం గుఢచారి అని కుడా కథనాలు తెలియజేస్తున్నాయి.

నేషనల్ యూనిటీ గవర్నమెంట్  అధికారిక వెబ్సైటు ప్రకారం, పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్ (PDF) అనేది ఎన్ యు జి తయారు చేసిన ఒక సాయుధ దళం. అయితే దీనిని మయన్మార్ సైనిక ప్రభుత్వం పి డి ఎఫ్ ని ఒక తీవ్రవాద సంస్థగా పేర్కొంది. బర్మా న్యూస్ ఇంటర్నేషనల్ (BNI) కుడా తమ వెబ్సైటులో ఇదే పేర్కొంది. పైగా ఏ కథనాలలోను బాధితురాలి మతాన్ని తెలియజేయలేదు. 

నేషనల్ యూనిటీ గవర్నమెంట్ అఫ్ మయన్మార్ ఈ వైరల్ వీడియోని డిసెంబర్ 5, 2022 నాడు పోస్ట్ చేస్తూ, ఈ విషయం గురించి విచారణ జరుపుతున్నారని, ఇది సైనిక నియమాలకి వ్యతిరేకమని తెలిపారు.

జులై 24, 2023 నాడు మణిపూర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పోలీసులు ఒక ఎఫ్ఐఆర్ ప్రతిని పోస్ట్ చేస్తూ ఈ విషయం లో కేసు నమోదు అయిందని తెలియజేసారు. మయన్మార్ లో జరిగిన ఘటనను మణిపూర్ లో జరిగినట్టుగా ప్రచారం చేస్తున్నందుకు కేసు బుక్ చేశామని తెలిపారు. శాంతి కి భంగం కల్పిస్తున్న వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు కుడా చేశామని తెలిపారు.

తీర్పు 

మహిళని కొడుతున్నట్టున్న వైరల్ వీడియో మయన్మార్ కి చెందినది. అది డిసెంబర్ 2022 లోనిది. దీనికి మణిపూర్ కి సంబంధం లేదు. కనుక ఇది అబద్దం అని మేము నిర్ధారించాము.

(అనువాదం : రాజేశ్వరి పరసా)

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , অসমীয়া , हिंदी , తెలుగు

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.