నిరుద్యోగం పెరగడానికి అధిక జనాభానే కారణం అని బీజేపీ నాయకుడు దినేష్ లాల్ యాదవ్ అన్న వీడియో డీప్ ఫేక్ కాదు

ద్వారా: సోహం శా
ఏప్రిల్ 16 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
నిరుద్యోగం పెరగడానికి అధిక జనాభానే కారణం అని బీజేపీ నాయకుడు దినేష్ లాల్ యాదవ్ అన్న వీడియో డీప్ ఫేక్ కాదు

మాల్వియా షేర్ చేసిన పోస్టుల స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు అబద్ధం

ఈ వీడియో ఇంటర్వ్యూని సంతోష్ కుష్వాహా అనే ఒక స్థానిక పాత్రికేయుడు ఏప్రిల్ 13 నాడు చిత్రీకరించారు. ఇది డీప్ ఫేక్ కాదు.

క్లైమ్ ఐడి bbf44075

క్లెయిమ్ ఏమిటి ?

ఏప్రిల్ 15, 2024 నాడు భారత యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ బివి ఎక్స్ (పూర్వపు ట్విట్టర్) లో ఒక వీడియో షేర్ చేసారు. ఈ వీడియోలో భారతీయ జనతా పార్టీ ఎంపీ దినేష్ లాల్ యాదవ్ ఒక పాత్రికేయుడితో మాట్లాడుతూ, భారత దేశంలో నిరుద్యోగానికి కారణం పెరుగుతున్న జనాభా అని చెప్పారు.. 

ఉత్తర్ ప్రదేశ్ లోని ఆజంగఢ్ సీట్ నుండి బిజెపి పార్టీ తరపున ఎన్నికలలో పోటీకి దిగుతున్న యాదవ్, ఈ వీడియోలో మాట్లాడుతూ, “చెప్పండి, మోదీజీకి కానీ యోగిజీకి కానీ ఒక్క బిడ్డ అయినా ఉన్నారా? వాళ్ళు నిరుద్యోగాన్ని ఆపేశారు. వాళ్ళు మేము పెంచము అని చెప్పారు. కనుక ఇప్పుడు నిరుద్యోగాన్ని పెంచుతుంది ఎవరు? ఎవరైతే బిడ్డలని కంటున్నారో వారు,”  అని అనటం మనం వినవచ్చు. (హిందీ నుండి అనువాదం)

ఎక్స్ పోస్ట్ వైరల్ అయిన తరువాత బిజెపి ఐటి సెల్ అధ్యక్షుడు అమిత్ మాల్వియా మరియు బిజెపి నాయకుడు తేజిందర్ సింగ్ బగ్గ ఈ వీడియో డీప్ ఫేక్ అని వారి సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశారు పైగా, ఈ వీడియో జనాలని తప్పుదోవ పట్టించడానికి, మనుషులను విడదీయడానికి, అల్లర్లని ప్రేరేపిస్తునన్నట్టుగా షేర్ చేస్తున్నారు అని పేర్కొన్నారు.

యాదవ్ కుడా ఈ వీడియోని షేర్ చేసి తన ఎక్స్ అకౌంట్ లో ఇది ఫేక్ అని తెలియజేశారు. పైగా తన పెదాల కదలిక సరితూగలేదని, తన గొంతుకు సరి కావట్లేదని తెలిపారు. ఇలాంటి ఫేక్ వీడియోలను షేర్ చేయటం కాంగ్రెస్ కు ఈమధ్య కాలంలో ట్రెండ్ అయిందని కుడా అన్నారు. ఈ వీడియో షేర్ చేసే వారిపై చర్యలు తీసుకోవాలని కుడా బిజెపి నాయకులు కోరారు.


మాల్వియా మరియు యాదవ్ షేర్ చేసిన పోస్టుల స్క్రీన్ షాట్ (సౌజన్యం : ఎక్స్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

కానీ, ఈ వీడియో డీప్ ఫేక్ కాదు. ఇది యాదవ్ మాట్లాడిన వీడియోనే. అయితే, ఒరిజినల్ వీడియోలో రెండు  క్లిప్లను జత చేసి ఈ వీడియో చేశారు.  అయితే, దీని వలన యాదవ్ మాటల అర్థమేమీ మారలేదు. 

మేము ఏమి కనుగొన్నము? 

ఈ పూర్తి వీడియోని పాత్రికేయుడు సంతోష్ కుష్వాహా నడిపే ‘సోల్ అప్ హిందీ’ అనే యూట్యూబ్ ఛానల్ లో ఏప్రిల్ 13, 2024 నాడు పోస్ట్ చేసినట్టు మేము కనుగొన్నాము. ఈ వీడియో శీర్షిక హిందీ లో  “बेरोजगारी के सवाल पर भड़के सांसद निरहुआ कहा कहा योगी मोदी जी की तरह मत करो पैदा बच्चे” అని ఉంది. (నిరుద్యోగం గురించి ప్రశ్నిస్తే కోపగించుకున్న రాజకీయవేత్త, మోదీ మరియు యోగి లాగా పిల్లల్ని కనకండి అని చెప్తున్నారు). ఆ వ్యాఖ్యలు వీడియో చివర్లో 11:00 నిమిషాల వ్యవధి దగ్గర మనం చూడవచ్చు..
 

ఎక్స్ లో షేర్ చేసిన వీడియో నిడివి 58 సెకన్లు. యూట్యూబ్ లో ఉన్న పూర్తి వీడియో 11 నిమిషాలు ఉంది. ఇక్కడ స్పష్టంగా ఒక పాత్రికేయుడు ఒక ఫ్లైఓవర్ కింద ఉన్న రోడ్డు మీద నుండి రిపోర్టింగ్ చెయ్యటం, యాదవ్ బండి రాగానే ఆయనను ప్రశ్నించటం, అయన కారు ముందు సీట్లో కూర్చుని జవాబు ఇవ్వటం కనిపిస్తుంది. ఈ వీడియోలో యాదవ్ మొఖం కొన్ని సార్లు ఫోకస్ తప్పుతూ ఉన్నా కుడా, ఎక్కడా ఇది డిజిటల్ గా వక్రీకరించిన వీడియో లాగా మాకు అనిపించలేదు.

వైరల్ వీడియోలో ఉన్న క్లిప్ యూట్యూబ్ వీడియోలో 11 నిమిషాల వ్యవధి వద్ద కనిపిస్తుంది. ఇక్కడ యాదవ్ నిరోద్యోగం మరియు అధిక జనాభా గురించిన వ్యాఖ్యలు చేయటం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. పేదాల కదలికలు అయన చేసే వ్యాఖ్యలకు సరి తూగాయి. 

కానీ ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, ఎక్స్ లో ఉన్న వీడియోని రెండు వేరు వేరు క్లిప్పుల సమాహారం. ఒరిజినల్ వీడియోలో ప్రధాని గురించి, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి గురించి అయన అన్న వ్యాఖ్యలు చివరలో ఉన్నాయి.. కానీ వైరల్ వీడియోలో ఈ వ్యాఖ్యలను మొదట్లో చేర్చారు, దీని వలన యాదవ్ వ్యాఖ్యల అర్ధం ఏమి మారలేదు.

కుష్వాహాని లాజికల్లీ ఫ్యాక్ట్స్ సంప్రదించింది. తానే ఈ వీడియోని చిత్రీకరించాని అని తెలిపారు. ఒరిజినల్ వీడియోని కుడా అయన మాకు పంపించారు. ఈ వీడియో మెటా డేటా పరీక్షించగా ఈ వీడియోని ఏప్రిల్ 13, 2024 నాడు మధ్యానం 3:38 కి చిత్రీకరించారు అని తెలిసింది. అదే రోజున యూట్యూబ్ లో కుడా అప్లోడ్ చేసారు.

మెటా డేటా ప్రకారం వీడియో ఏప్రిల్ 13 నాడు రికార్డు అయింది. 

ఈ వీడియో గురించి నిపుణులు ఏమంటున్నారు ?

మిస్ ఇన్ఫర్మేషన్ కంబాట్ అలయెన్స్ వారి డీప్ ఫేక్స్ అనాలిసిస్ యూనిట్ కుడా ఈ వీడియోని నాలుగు వేరు వేరు డిజిటల్ పరికరాలను వాడి పరీక్షించింది. ఈ అలయెన్స్ లో లాజికల్లీ ఫ్యాక్ట్స్ కూడా ఒక సభ్యురాలు. అవి అన్నీ కుడా ఈ వీడియో కృత్రిమంగా చేసింది కాదు అనే తెలిపాయి.

మయాంక్ వట్స్   అనే ఐఐటీ జోధ్ పూర్ కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ ని లాజికల్ల్లి ఫ్యాక్ట్స్ సంప్రదించగా ఎక్స్ లో షేర్ చేసిన వీడియో ఎడిట్ చేయబడినది అని తెలిపారు, కానీ అది డీప్ ఫేక్ కాదు అని నిర్ధారించారు. మేము ముందుగా చెప్పినట్టుగా రెండు వీడియోలని జత చేసి ఈ వీడియో చేశారు. అయితే, దీనివలన వీడియో అర్ధం కానీ సందర్భం కానీ మారలేదు. 

తీర్పు : 

ఒరిజినల్ వీడియోలో యాదవ్ ఈ వ్యాఖ్యలు చేశారు.. పైగా ఈ వీడియోని కృత్రిమంగా సృష్టించినట్టుగా ఏ విధమైన గుర్తులు కనపడలేదు. లాజికల్లీ ఫ్యాక్ట్స్ నిపుణలతో కూడా మాట్లాడి ఈ వీడియో డీప్ ఫేక్ కాదు అని నిర్ధారించింది.

(అనువాదం: రాజేశ్వరి పరస) 

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , অসমীয়া , हिंदी , తెలుగు , ಕನ್ನಡ

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.