2022 నాటి ఈద్ వీడియో చూపి, ఇది ఈ మధ్యకాలంలో ఉత్తరాఖండ్ అల్లర్లకు చెందిన వీడియో గా షేర్ చేసారు

ద్వారా: చందన్ బొర్గోహాయ్
ఫిబ్రవరి 12 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
2022 నాటి ఈద్ వీడియో చూపి, ఇది ఈ మధ్యకాలంలో ఉత్తరాఖండ్ అల్లర్లకు చెందిన వీడియో గా షేర్ చేసారు

సామాజిక మాధ్యమాలలో షేర్ అవుతున్న పోస్ట్ (సౌజన్యం : ఫేస్బుక్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు తప్పుదారి పట్టించేది

వార్త కథనాల ప్రకారం, ఈ వీడియో 2022 లో హరిద్వార్ లో ఈద్ ఉల్ ఫితూర్ సమయం లోనిది.

క్లైమ్ ఐడి fd764a60

ఉత్తరాఖండ్ లోని హల్ద్వాని ప్రాంతంలో ఫిబ్రవరి 8నాడు అధికారులు చేప్పట్టిన అక్రమ నిర్మాణాల తొలగింపు కార్యక్రమంలో ఒక మసీదు మరియు ఒక మద్రసాను తొలగించడంతో అల్లర్లు చెలరేగాయి, ఇందులో ఇద్దరు సామాన్యులు కుడా వారి ప్రాణాలు కోల్పవటం జరిగింది. ఈ నేపధ్యం, జనాలు గుంపులుగా ఉన్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతుంది. ఆ జనాలు తలపైన టోపీ పెట్టుకుని ముస్లిం మతానికి చెందిన వారి లాగ కనిపిస్తున్నారు. ఈ వీడియోకి మతరంగు పులిమి ఇది ఉత్తరాఖండ్ లోని అల్లర్లకు సంబంధించినది అని అన్నట్టుగా షేర్ చేస్తున్నారు.

ఎక్స్ (పూర్వపు ట్విట్టర్ )లో ఒక యూజర్ ఈ వీడియో షేర్ చేస్తూ “హల్ద్వానిలో 20 సంవత్సరాల క్రితం ముస్లిం జనాభా 1 శాతం, ప్రస్తుతం 20 శాతం, హిందువులారా, ఆలస్యం కాకముందే మేలుకోండి.” అంటూ ఉత్తరాఖండ్ కి సంబంధించిన హాష్ టాగ్ తో షేర్ చేసారు. ఆర్కైవ్ చేసిన పోస్ట్ ఇక్కడ చూడవచ్చు. ఈ కథనం రాసే సమయానికి ఈ పోస్ట్ కు 95,000 కు పైగా వ్యూస్ ఉన్నాయి.

మరొక ఫేస్బుక్ యూజర్ ఈ వీడియోని అస్సామీస్ లో షేర్ చేస్తూ, ఉమ్మడి పౌర స్మృతి బిల్లు ను వ్యతిరేకిస్తూ ఉత్తరాఖండ్ లో ముస్లింలు నిరసన చేపట్టారు అని పేర్కొన్నారు. వైరల్ వీడియోని హల్ద్వాని లో జరిగే అల్లర్ల చిత్రాలతో కలిపి షేర్ చేసారు


సామాజిక మాధ్యమాలలో షేర్ అవుతున్న పోస్ట్ (సౌజన్యం : ఫేస్బుక్/ లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్) 

అయినప్పటికీ ఇది ఈమధ్యన తీసిన వీడియో కాదు. ఇది మే 2022 లో హరిద్వార్ లో ఈద్ సందర్బంలో తీసిన వీడియో. 

మేము ఏమి కనుగొన్నము?

వైరల్ అవుతున్న వీడియోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతుకగా, మాకు ఎక్స్ లో Dr విజయ్ శర్మ పోస్ట్ చేసిన 2022 వీడియో ఒకటి లభించింది. ఈ పోస్టుకు శీర్షికగా హిందీలో,  జ్వాలాపుర్ ఈద్గాహ్ లో హరిద్వార్ లో ముస్లింల ప్రార్థన అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్ కుడా ఇస్లామోఫోబియా కి సంబంధించిన వ్యాక్యలవుతోనే ఉంది, అందుకని మేము ఆ పోస్ట్ ను ఈ కథనం లో జత చేయలేదు.

ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోని షేర్ చేస్తూ మే 3, 2022 లో ఫేస్బుక్ లో షేర్ చేసిన పోస్ట్ కుడా మాకు లభించింది. 2022 లో ఈద్ ఉల్ ఫితూర్ మే 2 సాయంత్రం మొదలయ్యి మే 3 సాయంత్రం ముగిసింది. 

ఈ ఆధారాలతో మేము గూగుల్ లో హిందీ కీ వర్డ్స్ వాడి సెర్చ్ చేయగా భారతవర్ష 24X7 వార్త సంస్థ, వారు హిందీలో  ప్రచురించిన ఒక కథనం లభించింది. మే 3, 2022 నాటి ఆ కథనం ప్రకారం, ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో ఈద్ ఉల్ ఫితూర్ ప్రార్థనలు జరిగాయి. ఇందులో కనపడే ఫోటోలో ఉన్న గేటు మరియు గోడ వైరల్ వీడియోలో ఉన్న మాదిరి గానే ఉన్నాయి. 


వైరల్ వీడియో మరియు భారతవర్ష 24X7 వీడియోకి మధ్య పోలిక (సౌజన్యం : ఎక్స్/భారతవర్ష 24X7/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

జియోలొకేషన్ ద్వారా కుడా  హరిద్వార్ లోని ఈద్గాహ్ ని మేము కనుగొని ఇది వైరల్ వీడియోలో స్థలమే అని నిర్ధారించాము. 

లాజికల్లీ ఫ్యాక్ట్స్ తో మాట్లాడుతూ హరిద్వార్ పోలీసులు కుడా ఇది మే 2022 లో జ్వాలాపుర్ లో తీసిన వీడియో అని తెలిపారు, ఇది వారు ఎక్స్ లో కుడా పేర్కొన్నారు అని తెలిపారు. వారు చేసిన ఎక్స్ పోస్ట్ లో వైరల్ అవుతున్న వీడియో పాతదని, ఉమ్మడి పౌర స్మ్రితికి సంబంధం లేదని, ఇది ఈద్గాహ్ జ్వాలాపుర్, హరిద్వార్ లో మే 2022 లో ఈద్ సందర్బంగా తీసినది అని తెలిపారు. ఈ పోస్ట్ని kreately.in అనే రైట్ వింగ్ సంస్థ చేసిన పోస్ట్ కి జవాబుగా తెలిపారు, ఈ అకౌంట్ తప్పుడు సమాచారం షేర్ చేయడానికి కుడా ప్రసిద్ధి చెందినది.  

హరిద్వార్ పోలీసులు ఈ వీడియో 2022 నాటిది అని నిర్ధారించిన పోస్ట్ (సౌజన్యం : ఎక్స్/స్క్రీన్ షాట్)

తీర్పు


వైరల్ అవుతున్న వీడియో ఉత్తరాఖండ్ లో అల్లర్ల కంటే ముందే తీసినది, ఇది మే 2022 లో హరిద్వార్ లో ఈద్ సందర్బంగా తీసిన వీడియో. కనుక మేము దీనిని తప్పుదోవ పట్టించేటట్టగా ఉంది అని నిర్ధారించాము. 

(అనువాదం: రాజేశ్వరి పరస)

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , অসমীয়া , తెలుగు , ಕನ್ನಡ

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.