ఆర్థికంగా వెనుకబడిన ప్రతి మహిళకి నెలకి లక్ష రూపాయలు ఇస్తామని రాహుల్ గాంధీ తెలపలేదు

ద్వారా: రాహుల్ అధికారి
మే 17 2024

ఈ కథనాన్ని షేర్ చెయ్యండి: facebook logo twitter logo linkedin logo
ఆర్థికంగా వెనుకబడిన ప్రతి మహిళకి నెలకి లక్ష రూపాయలు ఇస్తామని రాహుల్ గాంధీ తెలపలేదు

దేశంలో ప్రతి పేద మహిళకి నెలకి లక్ష ఇస్తామని రాహుల్ గాంధీ వాగ్ధానం చేశారని క్లైమ్ చేసిన సామాజిక మాధ్యమ పోస్ట్ స్క్రీన్ షాట్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

ఫ్యాక్ట్ చెక్స్

తీర్పు తప్పుదారి పట్టించేది

ఒరిజినల్ వీడియోలో రాహుల్ గాంధీ ఆర్థికంగా వెనుకబడిన ప్రతి మహిళకు నెలకి 8500 రూపాయలు లభిస్తాయని తెలిపారు.

క్లైమ్ ఐడి 87fb48f8

క్లైమ్ ఏంటి?

ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ వీడియో ఒకటి సామాజిక మాధ్యమాలలో షేర్ చేసి, ఆర్థికంగా వెనుకబడిన ప్రతి మహిళా అకౌంట్ లో నెలకి లక్ష రూపాయలు వేస్తామని అన్నారని క్లైమ్ చేశారు.

ఎక్స్ (పూర్వపు ట్విట్టర్) లో కొంత మంది యూజర్లు ఈ వీడియోని షేర్ చేశారు. “దేశంలో అత్యధిక మంది మధ్య తరగతి రైతులు సంవత్సరానికి 12 లక్షల రూపాయల కన్నా తక్కువ సంపాదిస్తారు. వాళ్ళ మీద అధిక పన్నులు విధించి, నిరుద్యోగులకు సంవత్సరానికి 12 లక్షలు ఇవ్వటానికి, వారిని తనకి ఓటు వేయమని రాహుల్ గాంధీ అడుగుతున్నారు,” అని ఒక యూజర్ ఈ వీడియోకి శీర్షికగా పెట్టారు. ఇటువంటి పోస్ట్స్ ఆర్కైవ్స్ ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవచ్చు. 

వైరల్ పోస్ట్ స్క్రీన్ షాట్స్ (సౌజన్యం: ఎక్స్/లాజికల్లీ ఫ్యాక్ట్స్ ఎడిటింగ్)

అయితే ఈ క్లైమ్ తప్పుదోవ పట్టించేటట్టు ఉంది. మరింత నిడివి ఉన్న ఇదే వీడియో చూస్తే కనుక, రాహుల్ గాంధీ ఈ పధకానికి సంబంధించిన లెక్కలు చెప్పి, ఆర్థికంగా వెనుకబడిన ప్రతి మహిళ అకౌంట్ లో సంవత్సరానికి లక్ష రూపాయలు వేస్తామని చెప్పటం మనం వినవచ్చు.

మేము వాస్తవం ఎలా తెలుసుకున్నాము?

ఈ వైరల్ క్లిప్ ఒడిశాలోని బొలంగీర్ లో మే 15 నాడు రాహుల్ గాంధీ నిర్వహించిన ఎన్నికల ప్రచారం నుండి తీసుకున్నారని మేము తెలుసుకున్నాము. ఈ ప్రసంగాన్ని కాంగ్రెస్ తమ అధికారిక యూట్యూబ్ అకౌంట్ లో లైవ్ స్ట్రీమ్ చేసింది (ఆర్కైవ్ ఇక్కడ). 

జూన్ 4 తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయగానే, ఆర్థికంగా వెనుకబడిన మహిళలకి నెలకి 8500 రూపాయలు- అంటే సంవత్సరానికి లక్ష- తమ బ్యాంక్ అకౌంట్ లలో జమ అవుతుంది అని రాహుల్ గాంధీ అనటం మనం వినవచ్చు.

39 నిమిషాలకి పైగా ఉన్న ఈ వీడియోలో 29:15 టైమ్ స్టాంప్ దగ్గర, ర్యాలీలో ఉన్న సుస్మితా సాహు అనే మహిళ పేరు తీసుకుని, “జులై 4వ తారీఖున ఒడిశా, ఉత్తర్ ప్రదేశ్, తమిళ నాడు, ఈ విధంగా రాష్ట్రాలలో మహిళలు ఉదయం నిద్ర లేచి తమ బ్యాంక్ అకౌంట్ లో వివరాలు చూసుకుంటారు. అదే రోజు, ఆ నెలకి సంబంధించిన 8500 రూపాయలు అప్పటికే వల్ల అకౌంట్ లో ఉంటాయి,” అని రాహుల్ గాంధీ అనటం మనం వినవచ్చు.

ఈ లెక్కలు చెబుతూ, ప్రతి నెల 8500 చొప్పున సంవత్సరానికి లక్ష రూపాయలు సుస్మితా సాహు లాంటి మహిళలకి ఇస్తామని తెలిపారు. అకౌంట్ లో డబ్బులు పడుతున్న శబ్దాన్ని అనుకరిస్తూ, ఈ విధంగా లక్ష రూపాయలని నెలవారీ పద్ధతిలో వేస్తాము అని రాహుల్ గాంధీ చెప్పారు. “దీన్నే అభివృద్ధి అంటారు,” అని జోడించారు.

30:38- 30:50 టైమ్ ఫ్రేమ్ మధ్య రాహుల్ గాంధీ, "ఈ విధంగా లక్ష రూపాయాలని నెలవారీ పద్ధతిలో వేస్తాము,” అని అంటున్న భాగాన్ని తప్పుడు క్లెయిమ్ తో షేర్ చేస్తున్నారు. 

2024 లోక్ సభ ఎన్నికలకి సంబంధించి కాంగ్రెస్ తీసుకువచ్చిన మేనిఫెస్టో లో కూడా మహాలక్ష్మి పధకం కింద దేశంలోని “ప్రతి పేద కుటుంబానికి” ఇస్తాము అని, కుదిరినంతమేరకు ఆ కుటుంబంలో ఉన్న జ్యేష్ఠ మహిళ అకౌంట్ లో వేస్తాము అని ఉంది. బొలంగీర్ లో తన ప్రసంగంలో రాహుల్ గాంధీ ఇదే వాగ్ధానాన్ని పునరుధ్ఘాటించారు. అంతే కానీ నెలకి లక్ష రూపాయలు ఇస్తామని చెప్పలేదు. 

కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో స్క్రీన్ షాట్ (సౌజన్యం: కాంగ్రెస్)

తీర్పు

రాహుల్ గాంధీ వీడియో ఒకటి షేర్ చేసి, అందులో తను ప్రతి పేద మహిళకి నెలకి లక్ష రూపాయలు ఇస్తాము అని చెప్పారని క్లైమ్ చేశారు. అయితే తను చెప్పింది నెలవారీ పద్ధతిలో మొత్తం మీద సంవత్సరానికి లక్ష రూపాయలు ఇస్తాము అని. కాబట్టి ఈ క్లైమ్ తప్పుదోవ పట్టించేటట్టు ఉందని మేము నిర్ధారించాము.  

(అనువాదం - గుత్తా రోహిత్)

ఈ వాస్తవ తనిఖీని చదవండి

English , অসমীয়া , हिंदी , తెలుగు , ಕನ್ನಡ

ఫ్యాక్ట్ చెక్ కోసం ఏదైనా క్లైమ్ మాకు సబ్మిట్ చేయదలుచుకుంటున్నారా లేదా మా సంపాదక బృందాన్ని సంప్రదించదలుచుకుంటున్నారా?

0
అంశాల వారీగా అన్వేషించండి

మన జీవితాలని ప్రభావితం చేసే నిర్ణయాలని మనం మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తీసుకుంటాము. అయితే ఇంటర్నెట్ స్వభావరీత్యా తప్పుడు సమాచారం ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి చేరుతున్నది.